Toyota Taisor Long Term Review Telugu: టయోటా టైజర్ అనేది కేవలం ఒక SUV మాత్రమే కాదు, డ్రైవ్ చేసే వారికి సరదా (ఫన్) కూడా ఇస్తుందని లాంచ్ సమయంలో కంపెనీ క్లియర్‌గా చెప్పింది. మరి, ఆ మాట నిజమేనా?. గత కొన్ని నెలల్లో ఈ కారును 11,500 కిలోమీటర్లు నడిపిన తర్వాత, ఒక వ్యక్తి తన అనుభవాలతో రాసిన రివ్యూ ఇది. టయోటా టైజర్ నిజంగా కారు ఏం ఆఫర్ చేస్తుందో ఈ రివ్యూ ద్వారా స్పష్టంగా అర్థమైంది.
ఇంజిన్ & డ్రైవింగ్ ఫన్టైజర్‌లో ఉన్న 1.0 లీటర్ టర్బో ఇంజిన్ 100hp పవర్, 148Nm టార్క్ ఇస్తుంది. బరువు కేవలం 1,030 కిలోలు మాత్రమే ఉండటంతో ఇంజిన్ పనితీరు ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ట్రాఫిక్‌లో చిన్న గ్యాప్ దొరికినా యాక్సిలేటర్ తొక్కగానే కారు రెస్పాన్స్ ఇస్తుంది. టర్బో లాగ్ కొద్దిగా ఉన్నప్పటికీ, పవర్ క్రమంగా పెరుగుతూ, నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌లా రెస్పాన్స్ ఇస్తుంది.
లాంగ్ డ్రైవ్ అనుభవంఈ రివ్యూ రాసిన వ్యక్తి, లాంగ్ డ్రైవ్ అనుభవం కోసం టయోటా టైజర్‌తో పుణె ట్రిప్ వేశాడు. ఓపెన్ రోడ్‌లో డ్రైవ్ చేసినప్పుడు ఇంజిన్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. గేర్‌బాక్స్ లైట్‌గా, సరిగ్గా పని చేస్తూ డ్రైవింగ్‌లో ఆనందాన్ని అందించింది.
కంఫర్ట్ & ఇంటీరియర్ఈ కారు, బయటి నుంచి చూసినప్పుడు కాంపాక్ట్‌గా కనిపించినా, వెనుక సీటింగ్‌లో లెగ్‌రూమ్ సరిపడా ఉంది. రియర్ ఎయిర్ వెంట్స్, USB-C పోర్ట్స్ ఉపయోగకరంగా ఉన్నాయి. ఇంటీరియర్ లగ్జరీగా కాకపోయినా ప్రాక్టికల్‌గా ఉంది. అయితే, ప్లాస్టిక్ క్వాలిటీ చాలా గట్టిగా అనిపిస్తుంది. 360 డిగ్రీ కెమెరా క్లారిటీ టాప్ లెవెల్‌లో లేకపోయినా, ఉపయోగకరంగానే ఉంది.
బూట్ స్పేస్ & చిన్న మైనస్ పాయింట్లుబూట్ స్పేస్ 300 లీటర్ల వరకు ఉంది. కానీ లిప్ ఎక్కువగా ఉండటంతో బరువుగా ఉన్న వస్తువులు ఎత్తడం కష్టంగా ఉంటుంది. ఫుట్‌వెల్ తక్కువగా ఉండటం వల్ల డెడ్ పెడల్ నుంచి క్లచ్‌కి కదలడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
నాయిస్ & ఇన్సులేషన్రోడ్డు మీది శబ్ధాలతో పాటు ఇంజిన్ సౌండ్ కూడా కేబిన్‌లో వినిపించడం మరో మైనస్ పాయింట్. సైలెంట్ రోడ్ మీద ఇది పెద్ద సమస్య కాకపోయినా, ట్రాఫిక్‌లో మాత్రం చిరాగ్గా ఉంటుంది.
మైలేజ్సిటీలో లీటరకు 12-14 km మైలేజ్ ఇస్తుంది. హార్డ్ డ్రైవ్ చేస్తే 10 kmpl వరకు పడిపోతుంది. టర్బో పెట్రోల్ SUV కి పర్లేదు అనిపించే నంబర్లు ఇవి.
ఆశించిన ఫీచర్లుకూల్డ్ సీట్లు, సన్‌రూఫ్, ADAS ఫీచర్లు ఉంటే ఇంకా బాగుండేది. క్రూయిజ్ కంట్రోల్, క్లియర్ అనలాగ్ డయల్స్ వంటివి డ్రైవింగ్ సమయంలో హెల్ప్ చేస్తాయి.
ఫైనల్‌గా ఏం చెప్పొచ్చు?ఓవరాల్‌గా చూస్తే, టయోటా టైజర్ కాంపాక్ట్ SUV సైజ్‌లో ఉన్నా, డ్రైవింగ్ ఫన్ & ప్రాక్టికల్ యూజ్ రెండింటినీ కలిపిన పర్ఫెక్ట్ ప్యాకేజీ. లాంగ్‌టర్మ్ యూజ్‌లో కూడా ఇది బ్యాలెన్స్‌డ్ SUVగా ప్రూవ్ అయ్యింది.