Toyota Innova Hycross Limited Edition: టయోటా పెట్రోల్ జీఎక్స్ వేరియంట్ ఆధారంగా ఇన్నోవా హైక్రాస్ కొత్త లిమిఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 20.07 లక్షల నుంచి రూ. 20.22 లక్షల మధ్య ఉంటుంది. దీని ధర స్టాండర్డ్ జీఎక్స్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొన్ని మార్పులు కూడా చేశారు.


ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్ చాలా తక్కువగా చేశారు. మధ్యలో ఉన్న గ్రిల్‌పై కొత్త క్రోమ్ గార్నిష్, ముందూ వెనుకా ఉన్న బంపర్‌ల్లో కొత్త ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లు అందించారు. దాని ప్లాటినం వైట్ ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్ కోసం మీరు అదనంగా రూ.9,500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే తక్కువ జీఎక్స్ ట్రిమ్‌పై రూపొందిన కారణంగా హైఎండ్ వేరియంట్లలో లభించే బంపర్ గార్నిష్, పెద్ద అల్లాయ్ వీల్స్ ఇందులో లేవు.


ఇంటీరియర్స్‌లో ఏం మార్పులు చేశారు?
దీని ఇంటీరియర్‌లో ముఖ్యమైన అప్‌డేట్‌లు అందించారు. ఇది డాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్‌ల కోసం కొత్త సాఫ్ట్ టచ్, చెస్ట్‌నట్ బ్రౌన్ ఫినిషింగ్‌ను పొందుతుంది. సాధారణ జీఎక్స్ ట్రిమ్ బ్లాక్ ప్లాస్టిక్‌ను పొందుతుంది. విండో కంట్రోల్స్ చుట్టూ కొత్త ఫాక్స్ వుడ్ ట్రిమ్ కూడా ఉంది. అయితే ఫాబ్రిక్ సీట్ కవర్లు కొత్త డ్యూయల్ టోన్ బ్లాక్, బ్రౌన్ ఫినిషింగ్‌ను పొందుతాయి. జీఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్‌ల్లో అందుబాటులో ఉంది.


ఇంజిన్ ఎలా ఉంది?
జీఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ 2.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ సీవీటీ గేర్‌బాక్స్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ 172 హెచ్‌పీ పవర్‌ని, 205 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ డిసెంబర్ వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.


మరోవైపు టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ ఈవీ కారును కూడా లాంచ్ చేయనుంది. దీని కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా అందుబాటులో ఉండనుంది. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ ఈవీ కంటే దిగువన పంచ్ ఈవీని ఉంచనుందని తెలుస్తోంది. టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ సైజుల్లో వస్తుంది. ఇందులో మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ మోడల్స్ ఉండనున్నాయి. లాంగ్ రేంజ్ పంచ్ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఒక్క ఛార్జ్‌కి 325 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. టియాగో ఈవీ, టిగోర్ ఈవీలకు ప్రత్యామ్నాయంగా టాటా పంచ్ ఈవీ ఉండనుందని సమాచారం. లో రేంజ్ వెర్షన్ మిడ్ రేంజ్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో అందుబాటులో ఉంటుంది. 125 బీహెచ్‌పీ కంటే ఎక్కువ శక్తిని టాటా పంచ్ కలిగి ఉంటుందని అంచనా.


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!