Toyota Ebella EV Details Telugu: భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి ఈ విటారా ‍‌(Maruti e Vitara) & దాని బ్యాడ్జ్‌ ఇంజినీర్డ్‌ సిబ్లింగ్‌ మోడల్‌ అయిన 'టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ ఇబెల్లా' భారీ అంచనాలతో సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు, బలెనో-గ్లాంజా ‍(Baleno-Glanza), ఫ్రాంక్స్‌-టైజర్‌ (Fronx-Taisor), ఎర్టిగా-రూమియన్‌ (Ertiga-Rumion) వంటి ICE మోడళ్లలో కలిసి పనిచేసిన ఈ రెండు కంపెనీలు, ఇప్పుడు తొలిసారిగా పూర్తిగా ఎలక్ట్రిక్‌ SUVలతో రంగంలోకి దిగుతున్నాయి. మరి ఈ రెండు కార్ల మధ్య పోలికలు, తేడాలు ఏమిటో చూద్దాం.

Continues below advertisement

సైజు, ప్లాట్‌ఫామ్‌ వివరాలు

ఈ రెండు కార్లకు 2,700 మిల్లీమీటర్ల వీల్‌బేస్‌ ఉంటుంది. ఇది MG ZS EV, హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌ కంటే ఎక్కువ. టయోటా ఇబెల్లా UK స్పెక్‌, ఈ విటారాతో పోలిస్తే కొద్దిగా పొడవుగా, తక్కువ ఎత్తుతో ఉంటుంది. భారత్‌లోకి ఇబెల్లా 18 ఇంచుల వీల్స్‌తో మాత్రమే రానుంది.

Continues below advertisement

 
మారుతి ఈ విటారా
టయోటా ఇబెల్లా
పొడవు (మి.మీ.)
 
4,275
4,285
వెడల్పు (మి.మీ.)
 
1,800
1,800
ఎత్తు (మి.మీ.)
 
1,645
1,640
వీల్‌బేస్‌ (మి.మీ.)
 
2,700
2,700
వీల్‌ సైజ్‌ (అంగుళాలు)
 
18/ 19
18

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో తేడాలు

బయట నుంచి చూస్తే ఈ విటారా, ఇబెల్లా రెండూ చాలా వరకు ఒకేలా కనిపిస్తాయి. అయితే ముందు భాగంలో చిన్న తేడాలు ఉన్నాయి. ఈ విటారాకు Y ఆకారంలో LED DRLs ఇచ్చారు. బంపర్‌పై బోల్డ్‌ ప్లాస్టిక్‌ క్లాడింగ్‌ కూడా కనిపిస్తుంది. ఇబెల్లా మాత్రం సెగ్మెంటెడ్‌ LED DRLs‌తో, మరింత స్మూత్‌ బంపర్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫాగ్‌ ల్యాంప్స్‌ మాత్రం ఈ విటారాలో మాత్రమే ఉంటాయి.

సైడ్‌ ప్రొఫైల్‌లో వీల్‌ డిజైన్‌, డోర్‌ హ్యాండిల్స్‌, వీల్‌ ఆర్చ్‌ క్లాడింగ్‌ అన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. ఇబెల్లాలో మాత్రమే ‘BEV’ బ్యాడ్జింగ్‌ ఉంటుంది. వెనుక భాగంలో కూడా టెయిల్‌ ల్యాంప్‌ సిగ్నేచర్‌ తప్ప పెద్దగా మార్పులు లేవు. మోనోటోన్‌, డ్యూయల్‌ టోన్‌ కలిపి పలు రంగుల ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

బ్యాటరీ, మోటార్‌, రేంజ్‌

 
మారుతి ఈ విటారా
టయోటా ఇబెల్లా
బ్యాటరీ కెసాసిటీ (kWh)
 
49 | 61
49 | 61
డ్రైవ్‌ టైప్‌
 
FWD | FWD
FWD | FWD
పవర్‌ (hp)
 
NA
144 | 174
టార్క్‌ (Nm)
 
NA
189
ARAI రేంజ్‌ (km)
 
NA | 543
440 | 543

ఈ విభాగంలో రెండు కార్లు కూడా ఒకే టెక్నాలజీని పంచుకుంటాయి. 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లు ఉంటాయి. ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సెటప్‌తో వస్తాయి. చిన్న బ్యాటరీతో సుమారు 440 కిలోమీటర్ల రేంజ్‌ ఇవ్వనుంది. పెద్ద బ్యాటరీతో గరిష్టంగా 543 కిలోమీటర్ల ARAI రేటెడ్‌ రేంజ్‌ అందించే అవకాశం ఉంది.

ఇంటీరియర్‌, ఫీచర్లు

కారు లోపలికి వెళ్తే, బ్రాండ్‌ లోగో తప్ప మిగతా ప్రతిదీ ఒకేలా ఉంటుంది. బ్రౌన్‌-బ్లాక్‌ డ్యూయల్‌ టోన్‌ ఇంటీరియర్‌, రెండు స్పోక్‌ల స్టీరింగ్‌, ఫిజికల్‌ కంట్రోల్స్‌, రెక్టాంగ్యులర్‌ AC వెంట్స్‌, డ్యూయల్‌ స్క్రీన్‌ సెటప్‌ కనిపిస్తాయి.

10.25 ఇంచుల టచ్‌స్క్రీన్‌, 10.1 ఇంచుల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, వెంటిలేటెడ్‌ సీట్లు, 12 కలర్‌ అంబియంట్‌ లైటింగ్‌, JBL సౌండ్‌ సిస్టమ్‌, 360 డిగ్రీ కెమెరా, లెవల్‌ 2 ADAS వంటి ఫీచర్లు రెండింట్లోనూ ఉంటాయి.

మొత్తంగా చూస్తే, టయోటా ఇబెల్లా & మారుతి ఈ విటారా టెక్నాలజీ, ఫీచర్లు, రేంజ్‌లో దాదాపు ఒకేలా ఉన్నా, డిజైన్‌ టచ్‌, బ్రాండ్‌ ఇమేజ్‌ ఆధారంగా కొనుగోలుదారుల ఎంపిక మారే అవకాశం ఉంది. మిడ్‌సైజ్‌ ఎలక్ట్రిక్‌ SUV సెగ్మెంట్‌లో ఈ రెండు కార్లు లాంచ్‌ అయ్యాక పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.