Car Safety Tips For Winter: చలికాలం రాగానే మనకు కూల్ వాతావరణం వచ్చిందన్న సంతోషం ఉంటుంది. కానీ డ్రైవర్స్‌కి మాత్రం ఇది కొంచెం ఛాలెంజింగ్ టైమ్. శీతాకాలంలోని చలి, పొగమంచు, జారుడు రోడ్లు అన్నీ కలిసి డ్రైవర్లకు చాలెంజ్ విసురుతాయి. ఈ సీజన్‌లో కారు డ్రైవ్ చేయాలంటే కాస్త జాగ్రత్త అవసరం. మీ సేఫ్టీతో పాటు మీ కార్ కేర్‌కి కూడా ఈ టిప్స్ చాలా హెల్ప్ అవుతాయి.
1. కారు మెయింటెనెన్స్ తప్పక చేయించుకోండి
వింటర్‌లో వాహనం రెగ్యులర్‌గా సర్వీస్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇంజిన్, బ్రేకులు, బ్యాటరీ, కూలెంట్ లెవల్స్ చెక్ చేయించుకోండి. పాత బ్యాటరీ అయితే రీప్లేస్ చేయడమే మంచిది. చల్లని వాతావరణంలో స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి.
2. విండ్‌షీల్డ్, మిర్రర్స్ క్లీన్ చేయండి
తక్కువ ఉష్ణోగ్రతల్లో మంచు, తేమ విండోస్‌పైకి వచ్చి చేరతాయి. గోరు వెచ్చటి నీటితో విండోలు, మిర్రర్స్, హెడ్‌ల్యాంప్స్, ఫాగ్‌ల్యాంప్స్ క్లీన్ చేయండి. వేడి ఎక్కువ ఉన్న నీళ్లు వాడితే గ్లాస్ క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
3. లైటింగ్ & ఎలక్ట్రికల్స్ చెక్ చేయండి
హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్, ఫాగ్‌ల్యాంప్స్ అన్ని సరిగ్గా వర్క్ అవుతున్నాయా చూడండి. విండ్‌షీల్డ్ వైపర్ల బ్లేడ్స్ నలిగిపోయి ఉంటే వెంటనే మార్చేయండి. వాషర్ ట్యాంక్‌లో నీరు, ఫ్లూయిడ్ మిక్స్ పెట్టడం మర్చిపోవద్దు.
4. టైర్లు సరైన ప్రెషర్‌లో ఉంచండి
టైర్లను ఓవర్ ప్రెషర్‌లో పెడితే కారు స్లిప్ అవుతుంది, తక్కువ ప్రెషర్ అయితే రోడ్డుపై గ్రిప్ తగ్గుతుంది. వింటర్ టైర్లు లేదా స్నో చెయిన్స్ వాడడం మంచిది. వాటిని ఫిట్ చేసేందుకు ప్రాక్టీస్ చేయడం కూడా అవసరం.
5. ఎలక్ట్రిక్ వాహన యజమానుల కోసం స్పెషల్ సూచనలు
EVలను చల్లని వాతావరణంలో ఎక్కువ రోజులు పార్క్ చేయొద్దు. టాటా మోటార్స్ సూచన ప్రకారం, -25 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్‌లో రోజుల తరబడి కదిలించకుండా ఉంచడం మానేయాలి. ఇలా చేస్తే లిథియం-అయాన్ బ్యాటరీ ఫ్రీజ్ అవుతుంది. రేంజ్ కూడా తగ్గిపోతుంది.
6. పొగమంచులో డ్రైవింగ్ చేస్తే ఇలా చేయండి
హైబీమ్ వాడొద్దు, పొగమంచులో అది కళ్లను ఇబ్బంది పెడుతుంది. లోబీమ్ లేదా ఫాగ్‌ల్యాంప్స్ వాడండి. ముందున్న వాహనానికి గ్యాప్ ఎక్కువగా ఉంచండి. సడన్‌గా బ్రేక్ వేయకండి, టర్న్‌లో కూడా స్మూత్‌గా డ్రైవ్ చేయండి.
7. స్కిడ్ అయితే పానిక్ అవ్వొద్దు
కారు స్లిప్ అవుతుంటే స్టీరింగ్‌ని అదే దిశలో తిప్పండి. ఉదాహరణకి, కారు వెనుక భాగం కుడి వైపునకు జారుతుంటే, స్టీరింగ్ కూడా కుడి వైపునకు తిప్పండి, దీని వల్ల కారు స్ట్రెయిట్‌గా వస్తుంది. సడన్ యాక్సిలరేషన్ లేదా బ్రేక్ వేయడం చేయవద్దు.
8. ఎమర్జెన్సీ కోసం సిద్ధంగా ఉండండి
కారులో బ్లాంకెట్స్, డ్రై ఫుడ్, వాటర్ బాటిల్స్, పవర్ బ్యాంక్ పెట్టుకోండి. లాంగ్ డ్రైవ్ సమయంలో ఇవి లైఫ్ సేవర్స్ అవుతాయి. డ్రైవింగ్ చేయనప్పుడు కారు ఇంజిన్‌ను ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచకండి, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ప్రమాదం ఉంటుంది.
ఫైనల్ టిప్
వింటర్ సీజన్ అంటే అడ్వెంచర్ డ్రైవ్స్ చేయాలని అనిపిస్తుంటుంది. కానీ ఫన్ కంటే ముందు సేఫ్టీని గుర్తు పెట్టుకోండి. ముందస్తుగా చెక్‌లిస్టు ఫాలో అయితే చలి సీజన్‌లో కూడా మీ డ్రైవింగ్ స్మూత్‌గా, సేఫ్‌గా సాగుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.