Car Driving Tips India: హైవేపై డ్రైవ్ అంటే చాలా మందికి ఆనందం. కుటుంబం లేదా స్నేహితులతో రోడ్ ట్రిప్ వేయడం, కొత్త ప్రదేశాలు చూడడం నిజంగా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కానీ, ఆ ఆనందం సేఫ్‌గా ఉండాలంటే కొన్ని డ్రైవింగ్ టిప్స్ తప్పక పాటించాలి. హైవేల్లో ట్రాఫిక్ నియంత్రణ తక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త మరింత అవసరం.
1. వేగాన్ని స్థిరంగా ఉంచండిహైవేల్లో రోడ్లు వెడల్పుగా ఉండటం వల్ల అధిక వేగం పెంచడం సులభం. కానీ, గంటకు 80 కి.మీ. స్పీడ్ లిమిట్ అని ఉంటే దానిని కచ్చితంగా పాటించండి. వర్షం, రాత్రి లేదా గుంపుగా వాహనాలు ఉన్నప్పుడు వేగం తగ్గించడం మంచిది. అవసరమైతే కొద్దిగా స్పీడ్ పెంచినా, ఎప్పుడూ బ్రేక్ దూరం గుర్తుంచుకోండి.
2. లేన్ మార్పు జాగ్రత్తగా చేయండిలేన్ మార్పు సరైన సమయానికి చేయకపోతే ప్రమాదం తప్పదు. ఎడమ వైపు నెమ్మదిగా వెళ్ళే వాహనాల కోసం, కుడివైపు ఓవర్ టేకింగ్ కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. వెనుక ట్రాఫిక్ కాస్త దూరంలో ఉన్నప్పుడు, సిగ్నల్ ఇస్తూ మీ కారును సేఫ్‌గా లేన్ మార్చండి.
3. వాహనాల మధ్య దూరం ఉంచండిముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయొచ్చు. కనీసం “3 సెకన్స్ రూల్” పాటించండి. రాత్రి అయితే 5 సెకన్ల దూరం ఉండడం ఇంకా సేఫ్. వర్షం లేదా పొగమంచు సమయంలో మరింత జాగ్రత్త అవసరం.
4. ఓవర్ టేకింగ్‌లో ఆలోచించి అడుగు వేయండిహైవేలో జరిగే ప్రమాదాల్లో ఎక్కువశాతం తప్పుడు ఓవర్ టేకింగ్ వల్లే. ముందున్న వాహనం వేగం అంచనా వేసి, వెనుక వాహనాలు వస్తున్నాయో లేదో చూసి, సరైన గేర్‌లోకి మార్చి మాత్రమే ఓవర్ టేక్ చేయండి. సింగిల్ లేన్ రోడ్లలో అయితే రిస్క్ తీసుకోకండి.
5. సిగ్నల్స్ తప్పక ఇవ్వండిలేన్ మార్చేటప్పుడు లేదా ఆగేటప్పుడు సిగ్నల్ ఇవ్వడం తప్పనిసరి. రోడ్డు మధ్యలో బ్రేక్ వేయాల్సి వస్తే ముందుగానే హజార్డ్ లైట్లు ఆన్ చేయండి.
6. మిర్రర్స్ వాడకం అలవాటు చేసుకోండిరివ్యూ మిర్రర్స్ మీకు అదనపు కళ్ళు లాంటివి. ప్రతి మూవ్‌కు ముందు, మిర్రర్‌ను చూడండి. మీ వెనుక ఉన్న వాహనాల దూరాన్ని, వేగాన్ని అర్ధం చేసుకోండి. బ్లైండ్ స్పాట్స్ తగ్గించడానికి చిన్న ఫిష్‌ఐ మిర్రర్స్ ఉపయోగించడం మంచిది.
7. రెగ్యులర్‌గా విరామాలు తీసుకోండిఒకేసారి గంటల తరబడి డ్రైవ్ చేయడం వల్ల “హైవే హిప్నోసిస్” వస్తుంది. అలసట, దాహం, ఒకే వేగం - ఇవన్నీ మానసికంగా మాయ చేస్తాయి. ప్రతి రెండు గంటలకు ఒక్కసారి ఆగి విశ్రాంతి తీసుకోండి. డ్రైవింగ్ పార్ట్‌నర్ ఉంటే మారుతూ డ్రైవ్ చేయండి.
8. వర్షంలో జాగ్రత్తవర్షపు నీటిలో ఉన్న ఆయిల్, ధూళి కణాలు కారు టైర్ల గ్రిప్ తగ్గిస్తాయి. ఆ సమయంలో వేగం తగ్గించి, బ్రేక్‌లు నెమ్మదిగా వేయండి. మడుగు లాంటి నీటిలో వేగంగా వెళ్ళకండి. కార్ హైడ్రోప్లేన్ అయ్యే ప్రమాదం ఉంది.
9. రాత్రి డ్రైవ్‌లో జాగ్రత్తరాత్రి ప్రయాణం తప్పనిసరి అయితే హెడ్‌ల్యాంప్స్, విండ్‌షీల్డ్ సరిగా ఉన్నాయో చూడండి. హైబీమ్ వాడకండి. ట్రక్ డ్రైవర్‌లు అలసటగా ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి మీ దృష్టి ఎప్పుడూ రోడ్డుపైనే ఉండాలి.
10. వాహనం చెడిపోతేహైవేలో మీ కారు బ్రేక్‌డౌన్ అయితే వాహనాన్ని పక్కకు తీసి, వెంటనే హజార్డ్ లైట్లు ఆన్ చేయండి. ట్రయాంగిల్ సైన్ బోర్డును మీ కారు వెనుక 15 అడుగుల దూరంలో పెట్టండి. సహాయం కోసం హైవే అసిస్టెన్స్ నంబర్ సంప్రదించండి.
హైవేపై డ్రైవింగ్ అంటే కేవలం స్పీడ్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా ముఖ్యం. ఈ 10 టిప్స్ పాటిస్తే మీ ప్రతి ప్రయాణం సురక్షితంగా, ఆనందంగా సాగుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.