Top Fuel Efficient Petrol Mid Size SUVs in India 2026 Mileage Guide: ఇండియాలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కారు కొనేవారు ముందుగా చూసేది మైలేజ్. ముఖ్యంగా మిడ్ సైజ్ ఎస్‌యూవీ (Mid-size SUV) సెగ్మెంట్ లో పోటీ తీవ్రంగా ఉంది. గతంలో కేవలం డీజిల్ కార్లు మాత్రమే ఎక్కువ మైలేజ్ ఇస్తాయనే పేరు ఉండేది. కానీ ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీ (Hybrid Technology) పుణ్యమా అని పెట్రోల్ కార్లు కూడా లీటర్ కు 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ట్రాఫిక్ లో రోజూ ప్రయాణించే వారికి, లాంగ్ డ్రైవ్స్ వెళ్లే వారికి ఈ కార్లు ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ లో అత్యధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ మిడ్ సైజ్ ఎస్‌యూవీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైబ్రిడ్ కార్ల హవా..మైలేజ్ రేసులో మారుతి సుజుకి, టొయోటా కంపెనీలు టాప్ లో ఉన్నాయి. మారుతి సుజుకి విక్టోరిస్ (Victoris), గ్రాండ్ విటారా (Grand Vitara), టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ (Hyryder) కార్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ తో వస్తున్నాయి. ఇందులో మారుతి విక్టోరిస్ ఏకంగా 28.65 కి.మీ మైలేజ్ ఇస్తూ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. గ్రాండ్ విటారా, హైరైడర్ కార్లు కూడా 27.97 కి.మీ మైలేజ్ అందిస్తున్నాయి. తక్కువ స్పీడ్ లో ఉన్నప్పుడు ఈ కార్లు కేవలం బ్యాటరీ (Electric Mode) మీద నడుస్తాయి. దీనివల్ల సిటీ ట్రాఫిక్ లో పెట్రోల్ ఖర్చు చాలా తగ్గుతుంది. పూర్తి ఎలక్ట్రిక్ కార్లకు మారడం ఇష్టం లేని వారికి ఇవి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్.
సాధారణ పెట్రోల్ వేరియంట్లు..స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని భావించే వారి కోసం ఇవే కార్లు 1.5 లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజిన్ తో కూడా వస్తున్నాయి. మారుతి విక్టోరిస్ మాన్యువల్ వేరియంట్ 21.18 కి.మీ మైలేజ్ ఇస్తుండగా, గ్రాండ్ విటారా 21.11 కి.మీ, హైరైడర్ 21.12 కి.మీ మైలేజ్ ఇస్తున్నాయి. వీటిలో ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ కూడా ఉంది. ఏడబ్ల్యూడీ విభాగంలో టొయోటా హైరైడర్ 19.39 కి.మీ తో ముందంజలో ఉంది. తక్కువ ధరలో మంచి మైలేజ్ కావాలనుకునే వారికి ఈ నార్మల్ పెట్రోల్ వేరియంట్లు కరెక్ట్ గా సరిపోతాయి.
స్కోడా, సిట్రోయెన్ పర్ఫార్మెన్స్..తాజాగా లాంచ్ అయిన స్కోడా కుషాక్ (Kushaq) కూడా మైలేజ్ పరంగా మెరుగైన ఫలితాలు ఇస్తోంది. దీని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ లో 19.66 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇక సిట్రోయెన్ బసాల్ట్ (Basalt) 19.5 కి.మీ, సి3 ఎయిర్ క్రాస్ 18.5 కి.మీ మైలేజ్ ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు కొత్త రెనో డస్టర్ (Duster) ఆటోమేటిక్ వేరియంట్ 18.45 కి.మీ మైలేజ్ ఇస్తోంది. ఈ కార్లు కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా మంచి పవర్, కంఫర్ట్ ను కూడా అందిస్తాయి.
హ్యుందాయ్ క్రెటా..దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే హ్యుందాయ్ క్రెటా (Creta) కూడా ఈ లిస్ట్ లో ఉంది. క్రెటా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ డిసిటి వేరియంట్ 18.4 కి.మీ మైలేజ్ ఇస్తుంది. అదే నార్మల్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఆటోమేటిక్ లో 17.7 కి.మీ వరకు మైలేజ్ వస్తుంది. మైలేజ్ తో పాటు ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారు క్రెటా వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి మైలేజ్ పరంగా మారుతి విక్టోరిస్ రారాజుగా నిలవగా, టెక్నాలజీ పరంగా మిగిలిన కంపెనీలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. మీ అవసరానికి తగ్గట్టుగా ఈ లిస్ట్ నుండి ఒక మంచి కారును ఎంచుకోవచ్చు.
