Commuter Motorcycles India 2025: భారత టూవీలర్‌ మార్కెట్‌కు అసలైన బలం కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్. రోజువారీ ప్రయాణాలు, ఆఫీస్‌, కాలేజ్‌, చిన్న కుటుంబాల అవసరాల కోసం ఎక్కువ మంది భారతీయులు ఈ సెగ్మెంట్‌పై ఆధారపడతారు. 2025 సంవత్సరం ఈ విభాగానికి ప్రత్యేకంగా నిలిచింది. కొత్త మోడళ్లతో పాటు, ఇప్పటికే ఉన్న కొన్ని పాపులర్ బైక్స్‌కు కొత్త డిజైన్‌, ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్లు వచ్చాయి.

Continues below advertisement

2025 ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, ఈ ఏడాది భారత్‌లో లాంచ్ అయిన లేదా భారీ అప్‌డేట్లు పొందిన టాప్‌ 5 కమ్యూటర్ మోటార్‌సైకిళ్లపై ఒక రివ్యూ ఇది.

Hero Glamour X 125

Continues below advertisement

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.82,967 నుంచి125 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్‌కు కొత్త ఊపిరి పోసిన బైక్ హీరో గ్లామర్ X 125. సాధారణ కమ్యూటర్ లుక్‌కు స్పోర్టీ టచ్ జోడించి ఈ మోడల్‌ను హీరో రూపొందించింది. ఇందులోని 124.7 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ 11.34 bhp పవర్‌, 10.5 Nm టార్క్ ఇస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్‌లో 5 అంగుళాల కలర్ LCD డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, సెగ్మెంట్‌లో తొలిసారిగా క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుమారు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Hero Xtreme 125R

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.89,000 నుంచి2025లో గణనీయమైన అప్‌డేట్లు పొందిన స్పోర్టీ కమ్యూటర్ బైక్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌. గ్లామర్ X 125లో ఉన్న అదే 124.7 సీసీ ఇంజిన్‌ను ఇది కూడా వాడుతుంది. అగ్రెసివ్‌, యూత్‌ఫుల్ డిజైన్ దీని ప్రత్యేకత.ఆల్-LED లైటింగ్‌, LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌, కనెక్టివిటీ ఫీచర్లు, క్రూయిజ్ కంట్రోల్‌, డ్యూయల్ ఛానల్ ABS వంటి ఫీచర్లతో ఇది ప్రీమియం కమ్యూటర్‌గా నిలిచింది.

Bajaj Pulsar 150

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.1,08,772 నుంచిభారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే స్పోర్టీ కమ్యూటర్ బైక్స్‌లో ఒకటైన బజాజ్ పల్సర్ 150, 2025లో చిన్నదైనా కీలకమైన అప్‌డేట్లు అందుకుంది.కొత్త LED హెడ్‌ల్యాంప్స్‌, LED టర్న్ ఇండికేటర్లు, కొత్త కలర్ ఆప్షన్లు, రిఫ్రెష్డ్ బాడీ గ్రాఫిక్స్ ఇందులో ఉన్నాయి. ఇంజిన్ మాత్రం ముందు మోడల్‌లో ఉన్నదే కొనసాగుతోంది. 

Honda CB125 Hornet

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.1,03,582 నుంచిస్పోర్టీ లుక్‌తో వచ్చిన మరో పాపులర్ కమ్యూటర్ బైక్ హోండా CB125 హార్నెట్‌. ఇందులో LED లైటింగ్‌, 4.2 అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, అలాయ్ వీల్స్ ఉన్నాయి.125 సీసీ ఎయిర్-కూల్డ్ బైక్‌లో తొలిసారిగా గోల్డెన్ కలర్ USD ఫ్రంట్ ఫోర్క్ ఇవ్వడం దీని హైలైట్. 123.94 సీసీ ఇంజిన్‌, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో సుమారు 48 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Yamaha FZ

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.1,08,466 నుంచియమహా FZ సిరీస్ 2025లో టెక్నాలజీ అప్‌డేట్స్‌తో ముందుకు వచ్చింది. పెద్ద డిజైన్ మార్పులు లేకపోయినా, మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్‌, TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లు జోడించారు.ఇందులోని 149 సీసీ ఇంజిన్‌ మునుపటి మోడల్‌ తరహాలోనే కొనసాగుతోంది. నమ్మకమైన పనితీరు, కంఫర్ట్ రైడింగ్‌తో ఇది ఇప్పటికీ కమ్యూటర్ సెగ్మెంట్‌లో బలమైన ఎంపిక.

2025లో లాంచ్ అయిన ఈ ఐదు కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు మైలేజ్‌, ఫీచర్లు, డిజైన్‌, ధర అన్నింటిలోనూ విభిన్న అవసరాలను తీర్చాయి. రోజువారీ వినియోగానికి సరైన బైక్ కోసం చూస్తున్నవారికి 2025 కమ్యూటర్ సెగ్మెంట్ నిజంగా మంచి ఆప్షన్లు అందించింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.