Affordable cars with ADAS in India 2026: కారు కొనేటప్పుడు ఇప్పుడు ఫీచర్లతో పాటు భద్రతకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా హైవే ప్రయాణాలు చేసేవారికి అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థలు ఉపయోగపడతాయి. వీటినే ADAS అంటారు. ప్రమాదాలను ముందే గుర్తించి అలెర్ట్‌ చేయడంలో ఈ సాంకేతికత డ్రైవర్‌కు సహాయపడుతుంది. ఇప్పటివరకు ఖరీదైన కార్లలో మాత్రమే కనిపించిన ADAS.. ఇప్పుడు సాధారణ కార్లలోకి కూడా వచ్చింది. హ్యుందాయ్, హోండా, మహీంద్రా, మారుతి వంటి సంస్థలు తమ కార్లలో ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. మిడిల్‌క్లాస్‌ కుటుంబాలు కూడా కొనగలిగే బడ్జెట్‌లోనే ఈ కార్లను అందుబాటులోకి తెచ్చాయి.

Continues below advertisement

ప్రస్తుతం, ADASలో ప్రధానంగా రెండు స్థాయిలు ఉన్నాయి, అవి - . Level 1 & Level 2. Level 1లో.. ముందున్న వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదం గురించి హెచ్చరిక, లేన్‌లోనే కారు ఉండేలా సహాయం వంటి ఫీచర్లు ఉంటాయి. Level 2లో వీటితో పాటు వాహనం వేగాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చే క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ పర్యవేక్షణ వంటి ఫీచర్లు ఉంటాయి. 

భారత్‌లో తక్కువ ధరకు ADAS అందిస్తున్న 10 కార్లు ఇవే:

Continues below advertisement

10. నిస్సాన్ టెక్టన్

ధర: రూ.15.39 లక్షలు-రూ.18.59 లక్షలు

నిస్సాన్ కొత్త SUV టెక్టన్‌తో ఈ జాబితా మొదలవుతుంది. టెక్నా & టెక్నా+ వేరియంట్లలో Level 2 ADAS ఉంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. మాన్యువల్, DCT గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది.

9. MG ఆస్టర్

ధర: రూ.15.3 లక్షలు

2021లో వచ్చిన సమయంలో ADAS అందించిన ఏకైక మధ్యతరహా SUVల్లో ఆస్టర్ ఒకటి. టాప్ వేరియంట్‌లో Level 2 ADAS ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో CVT గేర్‌బాక్స్ లభిస్తుంది.

8. హోండా ఎలివేట్

ధర: రూ.15.19 లక్షలు-రూ.16.36 లక్షలు

ఎలివేట్‌లో టాప్ వేరియంట్‌తో పాటు కొన్ని ప్రత్యేక వేరియంట్లలో ADAS ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 121 హెచ్‌పీ శక్తిని ఇస్తుంది. మాన్యువల్ & CVT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

7. హ్యుందాయ్ వెన్యూ

ధర: రూ.14.65 లక్షలు-రూ.15.65 లక్షలు

కొత్త వెన్యూ గత మోడల్ కంటే మెరుగైన Level 2 ADASతో వస్తోంది. టాప్ వేరియంట్లలో ఈ సదుపాయం ఉంటుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో DCT గేర్‌బాక్స్ లభిస్తుంది. కొన్ని వేరియంట్లలో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంది.

6. కియా సోనెట్

ధర: రూ.13.66 లక్షలు-రూ.14.37 లక్షలు

సోనెట్‌లో Level 1 ADAS అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్లలో ఈ సదుపాయం ఉంటుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్‌కు DCT, డీజిల్‌కు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: నెలకు కేవలం రూ.10 వేలతో ఎలక్ట్రిక్‌ కారు సొంతం - పెట్రోల్ భారం నుండి విముక్తి పొందే ఐడియా

5. టాటా నెక్సాన్

ధర: రూ.13.62 లక్షలు-రూ.13.82 లక్షలు

టాటా నెక్సాన్‌లో Level 2 ADAS ఉంది. అయితే ఇది కొన్ని టాప్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో DCT గేర్‌బాక్స్ కలిపి అందిస్తున్నారు. డీజిల్ వెర్షన్‌లో ADAS లేదు.

4. హోండా సిటీ

ధర: రూ.13.59 లక్షలు-రూ.17.44 లక్షలు

బేస్ వేరియంట్ మినహా హోండా సిటీలో చాలా వేరియంట్లకు Level 2 ADAS అందుబాటులో ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్ & CVT గేర్‌బాక్స్‌లు ఉన్నాయి. హైబ్రిడ్ వెర్షన్‌లో కూడా ADAS లభిస్తుంది.

3. మహీంద్రా XUV 3XO

ధర: రూ.12.02 లక్షలు-రూ.15.03 లక్షలు

XUV 3XOలో కొన్ని టాప్ వేరియంట్లలో Level 2 ADAS ఉంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్ & ఆటోమేటిక్ ఎంపికలు ఉన్నాయి. కొన్ని వేరియంట్లలో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా లభిస్తుంది.

2. మారుతి బలెనో

ధర: రూ.9.55 లక్షలు-రూ.9.99 లక్షలు

రూ.10 లక్షల లోపు ADAS అందించే కార్లలో బలెనో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ జాబితాలో ఉన్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ కూడా ఇదే. టాప్ ఆల్ఫా వేరియంట్‌లో Level 2 ADAS ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్ & AMT ఎంపికలు ఉన్నాయి.

1. హోండా అమేజ్

ధర: రూ.9.39 లక్షలు-రూ.10 లక్షలు

భారత్‌లో ADAS అందించే అత్యంత అందుబాటు ధర కారు హోండా అమేజ్. నాలుగు మీటర్లలోపు పొడవున్న సెడాన్‌లలో ADAS పొందిన ప్రత్యేక మోడల్‌గా ఇది నిలుస్తుంది. టాప్ ZX వేరియంట్‌లో ఈ సదుపాయం ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్ & CVT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సెకండ్‌హ్యాండ్ Maruti Brezza కొంటున్నారా? ఈ సమస్యలు ఉన్నాయేమో ముందే చెక్ చేయండి

ADAS ఇక ఖరీదైన కార్లకే పరిమితం కాదు. రూ.10 లక్షల లోపు ధరలోనే ఈ సాంకేతికతను అందించే కార్లు కూడా వచ్చాయి. అయితే, ADAS ఉన్నా డ్రైవర్ అప్రమత్తతే అత్యంత ముఖ్యం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.