Affordable SUVs in India | ఇండియాలో కార్లు కొనేవారు ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ఫీచర్, ప్రస్తుతం బడ్జెట్ ఎస్‌యూవీల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. జీఎస్టీ (GST) తగ్గింపు తర్వాత చాలా కార్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో అత్యంత తక్కువ ధరకు పనోరమిక్ సన్‌రూఫ్ అందిస్తున్న టాప్ 5 కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కియా సైరోస్ (Kia Syros)..ప్రస్తుతం ఇండియాలో పనోరమిక్ సన్‌రూఫ్‌తో లభిస్తున్న అత్యంత చౌకైన కారు ఇదే. కియా తన సైరోస్ మోడల్‌లోని హెచ్‌టీకే+ (HTK+) ట్రిమ్ నుండి ఈ ఫీచర్‌ను అందిస్తోంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత దీని ప్రారంభ ధర రూ. 10.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 12.3 ఇంచ్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వెనుక సీట్లకు విండో కర్టెన్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 16 ఇంచ్ అలాయ్ వీల్స్‌తో ఈ కారు ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)..తర్వాతి స్థానంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ నిలుస్తుంది. వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో వచ్చే దీని 'REVX A' వేరియంట్ ధర రూ. 10.75 లక్షలు మాత్రమే. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎంజీ ఆస్టర్ (MG Astor)కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన అత్యంత చౌకైన కారు ఎంజీ ఆస్టర్. దీని 'షైన్' వేరియంట్ ధర రూ. 11.20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బేస్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని ట్రిమ్స్‌లో ఈ సన్‌రూఫ్ ఆప్షన్ ఉంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్, రివర్స్ కెమెరా, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్ వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
టాటా నెక్సాన్ (Tata Nexon)..టాటా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న నెక్సాన్ కూడా ఈ జాబితాలో ఉంది. దీని క్రియేటివ్+ పీఎస్ (Creative+ PS) వేరియంట్ ధర రూ. 11.25 లక్షలుగా ఉంది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో పాటు దేశంలోనే పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన మొట్టమొదటి సీఎన్జీ కారుగా కూడా నెక్సాన్ గుర్తింపు పొందింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
టాటా కర్వ్ (Tata Curvv)..ఈ జాబితాలో ఐదవ స్థానంలో టాటా నుండి వచ్చిన కూపే ఎస్‌యూవీ 'కర్వ్' నిలుస్తుంది. దీని ప్యూర్+ ఎస్ (Pure+ S) వేరియంట్ ధర రూ. 11.59 లక్షలుగా నిర్ణయించారు. వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ తో పాటు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, ఆటో హెడ్ లైట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు దీని సొంతం. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో ఇది ప్రయాణికులకు గరిష్ట భద్రతను కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
