Top 5 Highest Mileage Cars In India 2025: భారతదేశంలో కారు కొనే వినియోగదారులు మొదట చూసేది మైలేజ్‌నే. ఇంధన ధరలు చుక్కల్లో ఉన్న నేపథ్యంలో, ఎక్కువ కిలోమీటర్లు ఇచ్చే ఇంధన సామర్థ్యం ఉన్న కార్లకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఇప్పుడు, మార్కెట్లో అత్యధిక మైలేజ్‌ ఇస్తున్న టాప్‌-5 కార్ల లిస్ట్‌ అప్‌డేట్‌ అయింది. ఈ రేస్‌లో మారుతి, హోండా, టయోటా వంటి ప్రముఖ కంపెనీలు దూసుకుపోతున్నాయి. CNG మోడళ్లు కాకుండా, పెట్రోల్‌, డీజిల్‌, హైబ్రిడ్‌ మోడళ్ల ఆధారంగా ఈ లిస్ట్‌ సిద్ధమైంది.

5. Maruti Swift - ARAI సర్టిఫైడ్‌ మైలేజ్‌: 25.75 kmpl

దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి స్విఫ్ట్‌ ఒకటి. 1.2-లీటర్‌ Z సిరీస్‌ ఇంజిన్‌తో వచ్చిన ఈ కారు 82hp పవర్‌, 112Nm టార్క్‌ జనరేట్‌ చేస్తుంది. AMT వెర్షన్‌లో 25.75 కి.మీ. మైలేజ్‌, మాన్యువల్‌లో 24.8 కి.మీ. మైలేజ్‌ ఇస్తుంది. ఈ కారు తేలికపాటి బరువు కారణంగా, డిజైర్‌ కంటే ఎక్కువ మైలేజ్‌ అందిస్తోంది.

4. Maruti Celerio - ARAI సర్టిఫైడ్‌ మైలేజ్‌: 26 kmpl

మారుతి సెలెరియో దేశంలో అత్యధిక మైలేజ్‌ ఇస్తున్న పెట్రోల్‌ కారు. 1.0-లీటర్‌ త్రీ సిలిండర్‌ ఇంజిన్‌, 5-స్పీడ్‌ AMTతో వస్తున్న ఈ కారు గరిష్టంగా 26 కి.మీ. మైలేజ్‌ ఇస్తుంది. చిన్న సైజు, తక్కువ బరువు కారణంగా ఇది మార్కెట్లో మైలేజ్‌ కింగ్‌గా పేరు తెచ్చుకుంది.

3. Honda City e:HEV - ARAI సర్టిఫైడ్‌ మైలేజ్‌: 27.26 kmpl

సెడాన్‌ సెగ్మెంట్‌లో టాప్‌లో నిలిచింది హోండా సిటీ హైబ్రిడ్‌. 1.5-లీటర్‌ అట్కిన్సన్‌ సైకిల్‌ ఇంజిన్‌తో పాటు 109hp ఇస్తున్న ఎలక్ట్రిక్‌ మోటార్‌ ఈ ఫోర్‌వీలర్‌లో ఉంది. దీంతో కలిపి 126hp పవర్‌ ప్రొడ్యూస్‌ చేస్తుంది. e-CVT ట్రాన్స్‌మిషన్‌తో 27.26 కి.మీ. మైలేజ్‌ అందించడం హోండా సిటీ ప్రత్యేకత.

2. Toyota Hyryder/Maruti Grand Vitara - ARAI సర్టిఫైడ్‌ మైలేజ్‌: 27.97 kmpl

SUV సెగ్మెంట్‌లో టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హైడర్‌, మారుతి గ్రాండ్ విటారా రెండూ జాయింట్‌గా రెండో స్థానంలో నిలిచాయి. రెండింటిలోనూ ఒకే 1.5-లీటర్‌ అట్కిన్సన్‌ ఇంజిన్‌, 80hp ఎలక్ట్రిక్‌ మోటార్‌ ఉంది. ఈ రెండు కార్లు, తలో 116hp పవర్‌తో 27.97 కి.మీ. మైలేజ్‌ ఇస్తున్నాయి.

1.  Maruti Victoris - ARAI సర్టిఫైడ్‌ మైలేజ్‌: 28.65 kmpl

బెస్ట్‌ మైలేజ్‌ కార్ల లిస్ట్‌లో టాప్‌ స్పాట్‌ దక్కించుకున్నది మారుతి విక్టోరిస్‌. ఇంకా ధరలు ప్రకటించకపోయినా, ఈ SUV ఇప్పటికే హాట్‌ టాపిక్‌గా మారింది. గ్రాండ్ విటారా, హైడర్‌లాగే హైబ్రిడ్‌ సిస్టమ్‌ను ఉపయోగించినా, 28.65 కి.మీ. మైలేజ్‌తో దేశంలోనే అత్యధిక మైలేజ్‌ SUVగా రికార్డు సృష్టించింది.

మారుతి విక్టోరిస్‌ లాంచ్‌ తర్వాత మార్కెట్లో మైలేజ్‌ పోటీ మరింత పెరగనుంది. ఇప్పటికే స్విఫ్ట్‌, సెలెరియో, హోండా సిటీ హైబ్రిడ్‌, టయోటా హైడర్‌ లాంటి కార్లు మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. మైలేజ్‌ మాత్రమే కాదు, టెక్నాలజీ, కంఫర్ట్‌, స్టైల్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త మోడళ్లను తీసుకొస్తున్నారు. అయితే మైలేజ్‌ విషయానికి వస్తే, విక్టోరిస్‌ SUV ఇప్పుడు రోడ్‌ కింగ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.