Luxury Sports Cars India 2025: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రతి నెలా చాలా కొత్త కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ వేగం విషయంలో మాత్రం కేవలం కొన్ని కార్లకే ప్రత్యేక స్థానం ఉంది. 0-100 కి.మీ. వేగాన్ని ఎంత త్వరగా అందుకుంటుంది? అనే విషయాన్ని బేస్ చేసుకుని, టాప్-5 కార్లతో ఒక లిస్ట్ రూపొందిస్తే, కేవలం రెండు కంపెనీలు మాత్రమే ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.
5. BMW XM – 4.44 సెకన్లు
BMW M డివిజన్ రూపొందించిన XM SUV లుక్స్‌లో క్లాస్‌గా, పెర్ఫార్మెన్స్‌లో మాస్‌గా ఉంటుంది. ఈ కారులో 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ బ్యాటరీ ప్యాక్ కలిసి పని చేస్తాయి. ఇవి కలిపి 653hp పవర్, 800Nm టార్క్ ఇస్తాయి. SUV అయినా, హైబ్రిడ్ వెయిట్ ఉన్నా కూడా ఈ కారు కేవలం 4.44 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని చేరుతుంది. ₹2.60 కోట్ల ఎక్స్-షోరూమ్ ధర ఉన్న ఈ కారు వేగాన్ని, ఎఫిషియెన్సీని ఒకేసారి అందిస్తుంది.
4. BMW M340i – 4.39 సెకన్లు
ఇది లిస్ట్‌లో “బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ” కారు ఇది. 3.0 లీటర్ టర్బో స్ట్రైట్-సిక్స్ ఇంజిన్ తో 374hp పవర్, 500Nm టార్క్ ఇస్తుంది. 0-100 కి.మీ.ను 4.39 సెకన్లలో చేరడం దీని స్పెషాలిటీ. “M” బ్యాడ్జ్ లేకపోయినా కూడా ప్యూర్ స్పోర్ట్స్ కార్ ఫీలింగ్ ఇస్తుంది. ₹78.20 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో ఈ స్థాయి పనితీరు అంటే నిజంగా అదిరిపోయే ఆఫర్. స్పీడ్‌తో పాటు లగ్జరీ, కంఫర్ట్ కూడా ఇస్తుంది.
3. Mercedes AMG C 63 S E-Performance – 3.68 సెకన్లు
పాత మోడల్‌లోని V8 స్థానంలో ఇప్పుడు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ + హైబ్రిడ్ టెక్ ఇచ్చారు. వెయిట్ పెరిగినా కూడా 680hp పవర్, 1,020Nm టార్క్ ఇస్తుంది. 0-100 కి.మీ.కి కేవలం 3.68 సెకన్లలో చేరే ఈ సూపర్-సెడాన్ నిజంగా ఒక “బీస్ట్”. ధర మాత్రం ₹1.95 కోట్లు (ఎక్స్-షోరూమ్), ఈ రేటులోనూ స్పీడ్ ప్రియులకు ఇది డ్రీమ్ కారు.
2. Mercedes AMG S 63 E-Performance – 3.46 సెకన్లు
“లగ్జరీ అంటే ఇది, స్పీడ్ అంటే ఇది” అన్నట్టుగా ఉండే కారు ఇది. సాధారణంగా సెడాన్ అంటే కంఫర్ట్ అని అనుకుంటాం. కానీ ఈ AMG వేరే లెవెల్. 4.0 లీటర్ ట్విన్-టర్బో V8 + హైబ్రిడ్ సెటప్ తో 802hp పవర్, 1,430Nm టార్క్ ఇస్తుంది. 3.46 సెకన్లలో 0-100 కి.మీ. వేగం అందుకోవడం హైలైట్. ₹3.34 కోట్లు (ఎక్స్-షోరూమ్) ధర ఉన్నా, ఈ కారు లగ్జరీతో పాటు రోడ్డుపై రేస్‌ట్రాక్ ఫీల్ ఇస్తుంది.
1. BMW M8 Competition – 3.45 సెకన్లు
ప్రస్తుతం దేశంలో ఉన్న ఫాస్టెస్ట్ కారు ఇదే. 3.45 సెకన్లలోనే 0-100 కి.మీ. చేరి, స్పీడ్ టెస్ట్‌లో టాప్ స్పాట్ సాధించింది. హైబ్రిడ్ టెక్ లేకపోయినా, 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్, 625hp పవర్, 750Nm టార్క్ తో దూసుకెళ్తుంది. లుక్స్‌లో గ్రాండ్ టూరర్‌లా కనిపించినా, అసలు ఫీలింగ్ మాత్రం స్పోర్ట్స్ కార్ మాదిరిగానే ఉంటుంది. ధర ₹2.52 కోట్లు (ఎక్స్-షోరూమ్). రేటు విషయంలో, ఈ లిస్ట్‌లో మూడో చౌకైన కారు అయినప్పటికీ, స్పీడ్‌లో మాత్రం అగ్రస్థానం సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో “వేగం + లగ్జరీ” కాంబినేషన్ ఇష్టపడే వాళ్లు ఈ లిస్ట్ దగ్గర పెట్టుకోండి. BMW, మెర్సిడెస్-AMG ఫాస్టెస్ట్ బ్రాండ్స్‌గా ప్రూవ్ అయ్యాయి. స్పీడ్‌లో BMW M8 Competition టాప్ పొజిషన్‌లో ఉండగా, లగ్జరీలో AMG S 63 E-Performance రాజులా ఉంటుంది. ధరలు భారీగా ఉన్నా, ఈ కార్లను ఓన్ చేసుకోవడం ఒక స్టేటస్ సింబల్ అని చెప్పొచ్చు.