Best Mileage Bikes in India | ఓవైపు యుద్ధం కొనసాగుతుండటం, ముడిచమురు రవాణాకు ఆటంకాల సమయంలో చాలా మంది తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే బైక్‌లు, లేక ఈవీలు కొనాలని భావిస్తారు. భారత మార్కెట్లో ఉన్న బెస్ట్ 100cc బైక్‌ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. ముఖ్యంగా ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవారికి లేదా రోజువారీ తమ బిజినెస్, ఇతర పనుల మీద జర్నీ చేసే వారికి ఈ బైక్‌లు సరిగ్గా సరిపోతాయి. ఇవి తక్కువ ధరలో ఉండటమే కాకుండా, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, అధిక మైలేజీ ఇవ్వడం ప్లస్ పాయింట్. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అటువంటి బైక్‌ల వివరాలు చూసి మీరు డిసైడ్ అవ్వండి. 

Continues below advertisement

టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 (TVS XL 100)

తక్కువ ఖర్చు, మెయింటనెన్స్ జాబితాలో మొదటిది TVS XL 100. ఇది ఒక రకమైన విభిన్నమైన బైక్ (మోపెడ్). వస్తువులను రవాణా చేయాల్సి ఉన్నవారికి లేదా ప్రతిరోజూ పనిచేసే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దీని ధర చాలా తక్కువ, మైలేజీ కూడా ఎక్కువ ఇస్తుంది. అందుకే గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఇది చాలా పాపులర్. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 44,550. ఈ బైక్ సుమారు 70 kmpl పైగా  మైలేజీని ఇస్తుంది.

Continues below advertisement

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)

ఈ జాబితాలో రెండవ స్థానంలో Hero HF Deluxe ఉంది. ఈ పాపులర్ బైక్‌లో 97.2cc ఇంజిన్ ఇచ్చారు. ఇది సుమారు 70 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. బైక్ ధర విషయానికి వస్తే సుమారు రూ. 55,992 నుంచి ప్రారంభమవుతుంది. దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువ. కనుక రోజువారీ జర్నీ చేసేవారికి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ సైతం బెస్ట్ ఆప్షన్.

బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100) 

బెస్ట్ బైక్స్ లిస్టులో తర్వాతి పేరు Bajaj Platina 100. మైలేజీ విషయంలో బైకును బెస్ట్ అని చెబతారు. ఇందులో 102cc ఇంజిన్ ఇచ్చారు. బజాజ్ ప్లాటినా లీటరుకు సుమారు 75– 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని సీటు, సస్పెన్షన్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దాంతో లాంగ్ జర్నీ చేయడానికి సైతం ఏ ఇబ్బంది ఉండదు. 

హీరో హెచ్ఎఫ్ 100 (Hero HF 100)

తక్కువ ధరలో ఎక్కువ మైలేజీని కోరుకునే వాహనదారులకు Hero HF 100 సైతం మంచి ఆప్షన్. ఇందులో 97cc ఇంజిన్ అందించారు. ఈ బైక్ సుమారు 70 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే, ఈ బైక్ మీద మీరు దాదాపు 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ట్రాఫిక్, వెళ్లే రోడ్డు మీద ఆధారపడి ఉంటుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 58,739 .

హోండా షైన్ 100 (Honda Shine 100)తక్కువ ఖర్చు, మెయింటనెన్స్, బెస్ట్ మైలేజీ బైకులలో Honda Shine 100 ఒకటి. ఈ బైక్‌లో సుమారు 98.98cc ఇంజిన్ ఇచ్చారు. ఇది దాదాపు 65 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ నాణ్యతతో పాటు స్మూత్ పెర్ఫార్మెన్స్ ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని పొందింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 65,243 నుంచి ప్రారంభమవుతుంది. ఆయా రాష్ట్రాలను బట్టి ధరలలో వ్యత్యాసం ఉంటుంది.