Top 10 Most Affordable Diesel Cars 2025: డీజిల్‌ కార్లకు భారత మార్కెట్లో ఎప్పటికీ ప్రత్యేక డిమాండ్‌ ఉంటుంది. ఇంధన ధరలు పెరిగినా, ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే డీజిల్‌ వాహనాలు ఇప్పటికీ చాలామంది ఫస్ట్‌ ఛాయిస్‌. అయితే BS6 ఎమిషన్‌ నార్మ్స్‌ వల్ల చాలా కంపెనీలు డీజిల్‌ మోడళ్లను నిలిపివేశాయి. అయినా, టాటా, మహీంద్రా, కియా, హ్యుందాయ్‌ బ్రాండ్లు ఇంకా అందుబాటు ధరల్లో డీజిల్‌ కార్లను అందిస్తున్నాయి.


ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న టాప్‌ 10 చౌక డీజిల్‌ కార్ల జాబితా ఇదే.


1. Tata Altroz – ధర: ₹8.99 లక్షలు – ₹11.29 లక్షలు


భారతదేశంలో ప్రస్తుతం లభించే అత్యంత చౌకైన డీజిల్‌ కారు టాటా ఆల్ట్రోజ్‌. 1.5-లీటర్‌ ఇంజిన్‌, 90hp పవర్‌, 200Nm టార్క్‌ ఇస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.


2. Mahindra Bolero – ధర: ₹9.81 లక్షలు – ₹10.93 లక్షలు


ఎప్పటినుంచో రోడ్లపై హిట్‌గా నిలుస్తున్న మహీంద్రా బొలెరో 76hp, 1.5-లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో వస్తుంది. 5MT గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.


3. Mahindra Bolero Neo/ Neo+ – ధర: ₹9.97 లక్షలు – ₹12.51 లక్షలు


బొలెరో నియో (7-సీటర్‌) & నియో+ (9-సీటర్‌) వేరియంట్లు మార్కెట్లో ఉన్నాయి. నియో 100hp ఇంజిన్‌తో వస్తే, నియో+ 120hp ఇస్తుంది.


4. Mahindra XUV 3XO – ధర: ₹9.99 లక్షలు – ₹14.99 లక్షలు


సబ్‌-4 మీటర్‌ SUVల్లో డీజిల్‌ AMT ఆప్షన్‌ ఇచ్చిన చౌకైన SUV ఇదే. 117hp, 300Nm ఇంజిన్‌, 6MT/6AMT ఆప్షన్లతో అమ్ముడవుతోంది.


5. Kia Sonet – ధర: ₹10 లక్షలు – ₹15.74 లక్షలు


కాంపాక్ట్‌ SUV సెగ్మెంట్‌లో కియా సోనెట్‌ 1.5-లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. 6MT, 6AT ఆప్షన్లు లభిస్తాయి.


6. Tata Nexon – ధర: ₹10 లక్షలు – ₹15.60 లక్షలు


టాటా నెక్సాన్‌ డీజిల్‌ మోడల్‌లో 115hp ఇంజిన్‌, 6MT/6AMT గేర్‌బాక్స్‌ ఉన్నాయి. SUVలలో మంచి సేల్స్‌ సాధిస్తున్న మోడల్‌ ఇది.


7. Hyundai Venue – ధర: ₹10.80 లక్షలు – ₹13.53 లక్షలు


సబ్‌-4 మీటర్‌ SUVల్లో బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచిన వెన్యూ డీజిల్‌ 116hp ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. దీనిలో ఆటోమేటిక్‌ ఆప్షన్‌ లేదు, కేవలం 6MTలో మాత్రమే లభిస్తుంది.


8. Kia Syros – ధర: ₹11.30 లక్షలు – ₹17.80 లక్షలు


కియా సైరోస్‌, ప్రీమియం కాంపాక్ట్‌ SUVగా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. 116hp ఇంజిన్‌, 6MT/6AT ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.


9. Tata Curvv – ధర: ₹11.50 లక్షలు – ₹19.52 లక్షలు


కూపే స్టైల్‌ SUVల్లో పాపులర్‌ అయిన టాటా కర్వ్‌ 118hp ఇంజిన్‌తో నడుస్తుంది. 6MT, 7DCT ఆప్షన్లు ఉన్నాయి.


10. Mahindra Thar – ధర: ₹11.50 లక్షలు – ₹17.62 లక్షలు


లైఫ్‌స్టైల్‌ SUVగా పేరు తెచ్చుకున్న థార్‌ను రెండు డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో కొనవచ్చు - 118hp (1.5L) & 130hp (2.2L). ఇవి 6MT, 6AT గేర్‌బాక్స్‌లు లభిస్తాయి.


పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్-షోరూమ్.


కర్బన ఉద్గారాల నిబంధనల కారణంగా చాలా బ్రాండ్లు డీజిల్‌ కార్లను తగ్గించినప్పటికీ... టాటా, మహీంద్రా, కియా, హ్యుందాయ్‌ ఇంకా వినియోగదారుల కోసం చవకైన డీజిల్‌ ఆప్షన్లను అందిస్తున్నాయి. టాటా ఆల్ట్రోజ్‌‌ ఇప్పటికీ అత్యంత చౌకైన డీజిల్‌ కారు కాగా, మహీంద్రా థార్‌, టాటా కర్వ్‌ లాంటి SUVలు స్టైల్‌తో పాటు డీజిల్‌ పవర్‌ను కోరుకునే వారికి సరైన ఎంపికలు అవుతున్నాయి.