Cheapest ADAS Cars In India In 2025: భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా మారిపోతోంది. ఇప్పుడు కేవలం పవర్, లుక్స్ మాత్రమే కాదు - సేఫ్టీ కూడా చాలా ముఖ్యమైంది. పెరుగుతున్న వాహనాల రద్దీ, ఆధునిక కార్ల వేగం నడుమ డ్రైవర్‌తో పాటు ప్రయాణీకుల భద్రత కూడా ముఖ్యం. అందుకే ADAS (Advanced Driver Assistance Systems) టెక్నాలజీని మధ్యస్థ ధరల్లోనే అందించడం మొదలుపెట్టాయి ప్రముఖ కార్ కంపెనీలు. ఈ టెక్నాలజీ డ్రైవర్‌కు సహకరించి, ప్రమాదాల అవకాశాన్ని తగ్గిస్తుంది. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సహా చాలా మోడ్రన్ ఫీచర్లు ADAS సూట్‌లో భాగంగా వస్తాయి.
ఇప్పుడు, కేవలం రూ.9 లక్షల నుంచే ఈ హైటెక్ సేఫ్టీ ఫీచర్లు అందిస్తున్న టాప్ 10 కార్లు ఇవి:
10. MG Astor - ₹15.16 లక్షలు
2021లో ADASతో వచ్చిన తొలి SUV ఇదే. Level 2 ADAS కలిగిన Savvy Pro వేరియంట్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, CVT ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది.
9. Honda Elevate - ₹14.8 - ₹16.06 లక్షలు
ZX టాప్ వేరియంట్‌లో ADAS అందిస్తున్నారు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్, CVT ఆప్షన్లు ఉన్నాయి. బ్లాక్ ఎడిషన్ కూడా ఆకర్షణీయంగా ఉంది.
8. Kia Syros - ₹14.56 - ₹15.94 లక్షలు
HTX+(O) టాప్ వేరియంట్‌లో Level 2 ADAS ఫీచర్లు ఉన్నాయి. 1.0 టర్బో పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్‌లతో DCT లేదా TC గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి.
7. Hyundai Venue - ₹14.56 - ₹15.69 లక్షలు
HX 10 వేరియంట్‌లో Level 2 ADAS ఫీచర్లు వస్తాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ లేదా 1.5 లీటర్ డీజిల్ ఆప్షన్లు. డ్రైవింగ్‌లో అదనపు సేఫ్టీ ఫీలింగ్ ఇస్తుంది.
6. Hyundai Verna - ₹14.35 - ₹16.98 లక్షలు
SX(O) వేరియంట్‌లో Level 2 ADAS. 1.5 లీటర్ పెట్రోల్, 160 hp టర్బో వేరియంట్‌లతో MT/DCT ఆప్షన్లు ఉన్నాయి. ఫీచర్‌ల పరంగా ఈ సెగ్మెంట్‌లో ఇది లీడర్.
5. Tata Nexon - ₹13.53 - ₹14.15 లక్షలు
Fearless+ PS ట్రిమ్‌లో Level 2 ADAS అందుబాటులో ఉంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో DCT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది. డీజిల్ వేరియంట్‌లో మాత్రం ఈ ఫీచర్ లేదు.
4. Kia Sonet - ₹13.51 - ₹14.09 లక్షలు
GTX+, X-Line వేరియంట్‌లలో Level 1 ADAS ఉంది. 1.0 టర్బో పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్‌లతో ఆటోమేటిక్ ఆప్షన్లు మీ ముందుకు వస్తాయి.
3. Honda City - ₹12.69 - ₹16.07 లక్షలు
SV వేరియంట్ తప్ప అన్ని మోడళ్లలో ADAS లభిస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ MT/CVT ఆప్షన్లు. స్మూత్ రైడ్, సేఫ్ డ్రైవింగ్ రెండింటినీ కలిపిన కాంబినేషన్ ఈ కార్.
2. Mahindra XUV 3XO - ₹11.5 - ₹14.4 లక్షలు
AX5 L, AX7 L వేరియంట్‌లలో Level 2 ADAS ఉంది. 1.2 టర్బో పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. భారతీయ రోడ్లకు సరిపోయే SUV ఇది.
1. Honda Amaze (3rd Gen) - ₹9.15 - ₹10 లక్షలు
దేశంలోనే తక్కువ ధరలో ADAS కలిగిన కారు ఇదే. ZX వేరియంట్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో MT/CVT ఆప్షన్లు లభిస్తాయి.
రూ.9 లక్షల నుండి రూ.16 లక్షల మధ్యలో సేఫ్టీతో కూడిన ఈ కార్లు కుటుంబ డ్రైవ్‌కి పర్ఫెక్ట్. భవిష్యత్ టెక్నాలజీ ఇప్పుడు మన బడ్జెట్‌లోకి వచ్చేసింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.