Royal Enfield Bullet 350 Latest News: రాయల్ ఎన్ ఫీల్డ్ వారి  బుల్లెట్ బైక్ కొనాల‌ని చూస్తున్న బైక్ ల‌వ‌ర్స్ కు శుభ‌వార్త‌. జీఎస్టీ శ్లాబుల స‌వ‌ర‌ణతో ప‌దిశాతం వ‌ర‌కు అదా అవుతోంది. సో మీ మ‌న‌సుకు న‌చ్చిన బుల్లెట్ బైక్ ను సొంతం చేసుకునేందుకు ఇదే మంచి స‌మ‌యం.కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తాజాగా  సవరిం‍చిన సంగ‌తి తెలిసిందే. దీని వల్ల దీపావళి పండుగకు ముందు ప్రజలకు పెద్ద గిఫ్ట్ లభించింది. కార్లు , మోటార్‌సైకిళ్ల కొనుగోలు ఇప్పుడు కొంచెం సులభమవుతుంది, ఎందుకంటే జీఎస్టీ తగ్గింపుతో వాటి ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. కొత్త జీఎస్టీ రీఫార్మ్స్ ప్రకారం, 350cc వరకు ఉన్న స్కూటర్లు , బైక్‌లు ఇప్పుడు చౌకగా లభ్యమవుతాయి, అయితే 350cc పైగా ఉన్న బైక్‌లు ఖరీదవుతాయి. వాటిపై జీఎస్టీ 28 నుంచి నలభై శాతానికి చేరుతుంది. బైక్‌లపై జీఎస్టీ 28% నుండి 18% కు తగ్గించబడిందని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఈ కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి. మీరు రాబోయే రోజుల్లో Royal Enfield Bullet 350 కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే, ఇప్పుడు ఇది ఎలాంటి తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకుందాం.

జీఎస్టీ త‌గ్గింపు.. బులెట్ 350కి 349cc ఇంజిన్ ఉంది. అంటే ఇది జీఎస్టీ త‌గ్గింపు కేట‌గిరీలోకి వ‌స్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,76,000. ప్రస్తుతం దీని మీద 28% జీఎస్టీ వర్తిస్తోంది. ఇప్పుడు ఈ జీఎస్టీ 10 శాతం తగ్గినట్లయితే, ఈ బైక్ కొనుగోలుపై ప్రజలు రూ.17,663 వరకు లాభపడతారని విశ్లేష‌కులు తెలిపారు.. పవర్ , మైలేజ్ విషయానికి వస్తే, Royal Enfield Bullet 350లో సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ ఇంజిన్ 6,100 rpm వద్ద 20.2 bhp పవర్, 4,000 rpm వద్ద 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ కాన్స్టెంట్ మెష్ గేర్‌బాక్స్ కలదు. ఇలాంటి సూపర్బ్ ఫీచర్లు గల బుల్లెట్ బైక్ ను సొంతం చేసుకోవాలని ఎంతోమంది కలలు కంటుంటారు.

డీసెంట్ మైలేజీ..ఈ బైక్ 1 లీటర్ పెట్రోల్‌కు సగటున 35 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు, ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 450 కిమీ వరకు ప్రయాణించగలదు. భద్రత పరంగా బైక్ ముందు డిస్క్ బ్రేక్స్, వెనుక డ్రమ్ బ్రేక్స్ కలిగి ఉంటుంది. దీంతో కంట్రోల్ బాగుంటుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మిలిటరీ వేరియంట్‌లో సింగిల్ చానల్ ABS, బ్లాక్ గోల్డ్ వేరియంట్‌లో డ్యూయల్ చానల్ ABS అందుబాటులో ఉంది. కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, బులెట్ 350 మిలిటరీ రెడ్, బ్లాక్, స్టాండర్డ్ మారూన్ మరియు బ్లాక్ గోల్డ్ రంగులలో లభిస్తుంది. సో బుల్లెట్ కొనాలంటే మ‌రో రెండు వారాలు ఆగిన‌ట్ల‌యితే త‌గ్గింపు ధ‌ర‌లోనే మ‌న‌సుకు న‌చ్చిన బైక్ ని సొంతం చేసుకోవ‌చ్చు. మ‌రోవైపు కొన్ని షోరూమ్ లో ఇప్పుడే బుక్ చేసుకుని, 22 త‌ర్వాత అమౌంట్ పే చేస్తే, త‌గ్గిన జీఎస్టీ వ‌ర్తిస్తుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. సో.. బుల్లెట్ బైక్ లవ‌ర్స్.. త్వ‌రలోనే మీ మ‌న‌సుకు న‌చ్చిన బైక్ ను సొంతం చేసుకోండి మ‌రి.