Electric Car Road Trip Guide: ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలతో లాంగ్‌ డ్రైవ్‌ చేయడం కొత్త విషయం కాదు. టెక్నాలజీ ముందడుగు వేస్తున్నకొద్దీ, యువతీ యువకులు, కుటుంబాలు EVలతో సిటీ లిమిట్స్‌ దాటి ఇంటర్‌సిటీ ట్రిప్స్‌ చేస్తున్నారు. కానీ, పెట్రోల్‌ కార్లలాగా ఒక్కసారిగా బయలుదేరడం EVలకి పనికి రాదు. సరైన ప్రణాళిక అవసరం. ఇక్కడ మీ రోడ్‌ ట్రిప్‌ సక్సెస్‌ కావడానికి 5 ముఖ్యమైన టిప్స్‌ చూద్దాం.

Continues below advertisement

మీ డ్రైవింగ్‌ స్టైల్‌ కార్‌ రేంజ్‌ పెంచుతుందిమీ డ్రైవింగ్‌ పద్ధతి మీ EV రేంజ్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. హైవేపై స్థిరమైన స్పీడ్‌లో నడపడం, అకస్మాత్తుగా యాక్సిలేట్‌ చేయకపోవడం, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌ వాడటం వంటివి బ్యాటరీ శక్తిని సేవ్‌ చేస్తాయి. 

కొత్త EV మోడళ్లలో “వన్‌ పెడల్‌ డ్రైవ్‌” ఫీచర్‌ కూడా ఉంటుంది, యాక్సిలేటర్‌ నుంచి కాలు తీస్తే వాహనం స్లో అవుతుంది. దాంతో ఎలక్ట్రిక్‌ శక్తి తిరిగి బ్యాటరీకి వెళ్తుంది. ఇది రేంజ్‌ పెంచడమే కాకుండా డ్రైవింగ్‌ను కూడా కంఫర్ట్‌గా మారుస్తుంది.

Continues below advertisement

ఛార్జింగ్‌ స్టాప్స్‌ ముందే మ్యాప్‌ చేయండిసంప్రదాయ కార్ల కోసం ఫ్యూయల్‌ స్టేషన్లు ప్రతి 5 కిలోమీటర్లు ఒకటి కనిపిస్తాయి. కానీ ఛార్జింగ్‌ పాయింట్లు అంతగా లేవు. కాబట్టి, మీ EV సిటీ దాటక ముందే ప్లాన్‌ చేసుకోండి. Google Maps‌, PlugShare, Zeon Charging వంటి యాప్స్‌ ఉపయోగించి మీ రూట్‌లో ఉన్న ఛార్జింగ్‌ స్టేషన్‌లు చెక్‌ చేయండి.

హైవేలపై సాధారణంగా 50kW–150kW ఫాస్ట్‌ DC ఛార్జర్లు ఉంటాయి. కొన్ని చోట్ల 7kW–22kW AC ఛార్జర్లు కనిపిస్తాయి. ఫాస్ట్‌ ఛార్జర్‌తో 20-30 నిమిషాల్లో 80% ఛార్జ్‌ అవుతుంటే, AC ఛార్జర్‌తో కొన్ని గంటలు పట్టవచ్చు. కాబట్టి 30-40 కిలోమీటర్ల బఫర్‌ రేంజ్‌ ఉంచడం మంచిది.

బ్యాకప్‌ తప్పనిసరిఇంటర్‌సిటీ ట్రిప్‌లో అన్ని చోట్ల ఛార్జింగ్‌ సదుపాయాలు ఉండవు. కొన్ని సార్లు ఛార్జర్‌ డౌన్‌లో ఉండవచ్చు లేదా క్యూలు ఎక్కువగా ఉండవచ్చు. అందుకే రెండు రకాల ఛార్జర్లు వెంట ఉంచుకోండి - ఒక సాధారణ హోమ్‌ ప్లగ్‌ ఛార్జర్‌, ఇంకో ఫాస్ట్‌ ఛార్జర్‌. మీ వాహనం ఛార్జ్‌ అవ్వడానికి ఎంత టైమ్‌ పడుతుందో మీకొక అంచనా ఉండాలి. ఇలాంటి అంచనా వేసుకుంటే ట్రిప్‌ మధ్యలో ఆందోళన ఉండదు.

భౌగోళిక పరిస్థితులు & వాతావరణం ప్రభావంఎత్తైన మార్గాలు, ఘాట్స్‌ లాంటివి బ్యాటరీని త్వరగా ఖర్చు చేస్తాయి. అందుకే ట్రిప్‌లో అదనపు ఛార్జింగ్‌ స్టాప్స్‌ను టచ్‌ చేస్తూ వెళ్లండి. టైర్‌ ప్రెషర్‌ సరిగ్గా ఉంచడం, వాషర్‌ ఫ్లూయిడ్‌ నింపడం, పోర్టబుల్‌ ఎయిర్‌ ఫిల్లర్‌ వెంట ఉంచుకోవడం చాలా అవసరం.

తీవ్ర ఎండలు, చలి వాతావరణం కూడా బ్యాటరీ పనితీరును తగ్గిస్తాయి. కాబట్టి వాతావరణాన్ని బట్టి ప్రణాళిక వేయండి.

టూల్‌కిట్‌ & అసిస్టెన్స్‌EVతో ట్రిప్‌ చేస్తుంటే టూల్‌కిట్‌, టైర్‌ ఇన్‌ఫ్లేటర్‌, జంప్‌ స్టార్టర్‌, ఫ్లాష్‌లైట్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ తప్పనిసరి. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ నంబర్‌ ఫోన్‌లో సేవ్‌ చేసుకోండి. ఎక్కడైనా సమస్య వచ్చినా వెంటనే సహాయం అందుతుంది.

 హైబ్రిడ్‌ కార్ల సౌలభ్యంప్యూర్‌ EVలతో పోలిస్తే హైబ్రిడ్‌ (పెట్రోల్‌ + ఎలక్ట్రిక్‌) వాహనాలు కొంత సౌలభ్యం ఇస్తాయి. అవి “సెల్ఫ్‌ రీజెనరేషన్‌” టెక్నాలజీతో పని చేస్తాయి. మోటార్‌ వినియోగించిన శక్తినే తిరిగి బ్యాటరీలో నిల్వ చేసి అదనంగా 60-80 కిలోమీటర్ల వరకూ నడుస్తాయి.

హైబ్రిడ్‌ కారు యూజర్లు చెప్పిన ప్రకారం: “హైబ్రిడ్‌ కారు అంటే ఛార్జింగ్‌ ఫ్రెండ్‌ కూడా, పెట్రోల్‌ బ్యాకప్‌ కూడా!”. అయితే, పర్యావరణహితం విషయంలో మాత్రం EVలకే ఫుల్‌ మార్కులు.

ట్రిప్‌కు ముందు ఇంట్లో కనీసం 12-13 గంటల పాటు ఛార్జ్‌ చేయండి. మీ మార్గంలో ఉన్న స్టేషన్‌లను ముందే చెక్‌ చేయండి. అలా చేస్తే లాంగ్‌ డ్రైవ్‌లో బ్యాటరీ ఆందోళన లేకుండా, ఫుల్‌ ఎంజాయ్‌మెంట్‌తో ప్రయాణం సాగుతుంది.