కొత్త సంవత్సరం 2026 ప్రారంభంతోనే కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న బ్యాడ్ న్యూస్. వారు కారు కోసం కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. వాస్తవానికి, అనేక పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు జనవరి 2026 నుండి వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఇది కొత్త కారు లేదా బైక్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ధరలను పెంచడం తప్పనిసరి అని, లేకపోతే లాభాలను గడించలేమని కార్లు, బైక్స్ కంపెనీలు చెబుతున్నాయి.

Continues below advertisement

ప్రధాన కారణం..  ముడి పదార్థాల ధరలు 

కార్ల తయారీలో ఉపయోగించే రాగి, అల్యూమినియం, కొన్ని ప్రత్యేక లోహాల వంటి ముడి పదార్థాల ధరలు ఇటీవలి నెలల్లో వేగంగా పెరిగాయి. ఈ లోహాలు కారు ఇంజిన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఇతర ముఖ్యమైన భాగాలలో ఉపయోగించనున్నారు. వీటిలో ఎక్కువ భాగం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నందున, మరోవైపు డాలర్ ఖరీదైనప్పుడు కంపెనీల ఖర్చు మరింత పెరుగుతుంది. ఇటీవల రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మరింత బలహీనపడుతోంది. దీనివల్ల విదేశాల నుంచి ముడి సరుకు, ఆటో మొబైల్ ఉత్పత్తుల దిగుమతులు ఖరీదైనవిగా మారాయి.

ధరలు ఎంత పెరగవచ్చు?

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కంపెనీలు సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో ధరలలో సవరణలు చేస్తాయి. ఈసారి కూడా కొన్ని కార్ల ధరలు 2 నుండి మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో అనేక బ్రాండ్లు ఉన్నందున, కంపెనీలకు ఎక్కువ శాతం పెంచడం అంత సులభం కాదు. అయినప్పటికీ, మంచి డిమాండ్, స్ట్రాంగ్ బుకింగ్‌ల కారణంగా ధరలు పెరిగిన తర్వాత కూడా కస్టమర్లు కార్లు కొనుగోలు చేస్తారని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి.

Continues below advertisement

ఏ కంపెనీలు ప్రకటించాయి?

కొన్ని కంపెనీలు జనవరి నుంచి కొత్త ధరలను అమలు చేస్తామని ఇప్పటికే తెలిపాయి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ( JSW MG Motor India) తన అన్ని మోడళ్ల ధరలు సుమారు 2 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది. Mercedes- Benz India కూడా తన అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. బీఎండబ్ల్యూ మోటార్ ఇండియా (BMW Motorrad India) తన మోటార్‌సైకిళ్ల ధరలలో ఎక్కువ పెరుగుదల ఉంటుందని చెప్పింది. దీనితో పాటు, ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) కూడా తన అన్ని మోడళ్ల ధరలను పెంచబోతోంది.

టూ వీలర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తప్పించుకోలేవు

కేవలం కార్లు మాత్రమే కాదు, బైక్‌లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఖరీదైనవి కావచ్చు. ముడి సరుకు ధరల పెరుగుదల, ఎలక్ట్రానిక్ విడి భాగాల ధరల పెరుగుదల, విదేశీ మారకపు రేటులో హెచ్చుతగ్గులు దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. రాబోయే కాలంలో మరిన్ని కంపెనీలు ధరలను పెంచే అవకాశం ఉంది. కనుక మీరు వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, సరైన సమయంలో నిర్ణయం తీసుకుని కొనుగోలు చేయడం మీ బడ్జెట్లో ఉంటుంది. ప్రయోజనకరం అని కంపెనీలు సూచిస్తున్నాయి.

Also Read: ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీల్లో NMC, LFP పేర్లు వింటున్నారా? వీటి మధ్య తేడాలేంటి?