Tesla Model Y vs BYD Sealion 7 vs BMW X1 LWB Comparison: టెస్లా, చాలాకాలం ఎదురుచూపుల తర్వాత, ఎట్టకేలకు భారతదేశంలోకి ప్రవేశించింది. ముంబైలోని BKC (బాంద్రా-కుర్లా కాంప్లెక్స్)లో తన మొదటి షోరూమ్‌ ప్రారంభించింది & మోడల్ Y కారును ఇండియాలో లాంచ్‌ చేసింది. ఈ కారు ధరలను కూడా వెల్లడించింది. టెస్లా మోడల్ Y లాంచ్‌తో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రేసు కొత్త స్థాయికి చేరుకుంది, హీట్‌ పెరిగింది. ఎందుకంటే, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలో టెస్లా ఎప్పుడూ ముందుంటుంది, దీని ప్రవేశంతో భారత్‌లోని ఇతర కంపెనీల మధ్య పోటీ మరింత పెరుగుతుంది.

టెస్లా మోడల్ Y ధర & స్పెసిఫికేషన్లుటెస్లా మోడల్ Y భారతదేశంలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొదటి వేరియంట్ - Standard RWD, ఇది 60kWh బ్యాటరీతో పవర్‌ తీసుకుంటుంది. ఈ వేరియంట్ దాదాపు 295 bhp పవర్‌ను ఇస్తుంది & సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 500 కి.మీ. ప్రయాణిస్తుంది. దీని ఆన్-రోడ్ ధర ‍‌(Tesla Model Y Standard RWD Price) రూ. 61.07 లక్షలు. రెండో వేరియంట్ - Long Range RWD, ఇది 75kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ 622 కి.మీ వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ అందిస్తుంది & దీని ఆన్-రోడ్ ధర  ‍‌(Tesla Model Y Long Range RWD Price) రూ. 69.15 లక్షలు. మోడల్ Y కారును టెక్నాలజీ-ఫస్ట్ SUVగా పరిగణిస్తారు. ఎందుకంటే.. ఇది ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌, ప్రీమియం సౌండ్ సిస్టమ్ & టెస్లా మొబైల్ యాప్‌తో వాహనాన్ని నియంత్రించడం వంటి స్మార్ట్ ఫీచర్‌లతో పని చేస్తుంది.

BYD సీలయన్‌ 7 పోటీ ఇస్తుందా?BYD సీలయన్ 7 SUV భారతదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్‌ అయింది. మొదటి వేరియంట్ 82.56kWh బ్యాటరీ కలిగిన సింగిల్ మోటార్‌తో పని చేస్తుంది. ఈ వేరియంట్ దాదాపు 313 bhp పవర్‌ను & దాదాపు 482 కి.మీ. డ్రైవింగ్‌ రేంజ్‌ను ఇస్తుంది. దీని ధర రూ. 51.80 లక్షలు. రెండో వేరియంట్ డ్యూయల్ మోటార్‌తో పరుగులు తీస్తుంది, ఇది దాదాపు 530 bhp పవర్‌ ఇస్తుంది. అయితే, దీని రేంజ్‌ కొద్దిగా తగ్గుతుంది & దాదాపు 456 కి.మీ. దూరాన్ని కవర్ చేయగలదు. ఈ డ్యూయల్ మోటార్ వేరియంట్ ధర రూ.60-65 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు ప్రత్యేకత దాని శక్తిమంతమైన మోటార్ సెటప్ & క్విక్‌ ఏక్సిలరేషన్‌. అయితే, దీని డ్రైవింగ్‌ రేంజ్‌ టెస్లా మోడల్ Y లాంగ్ రేంజ్ వేరియంట్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.

BMW X1 LWB రేంజ్ & ధరBMW X1 LWB ఒక లగ్జరీ కారు. నిర్మాణంలో నాణ్యత & డ్రైవింగ్‌లో సమతుల్యతకు ప్రసిద్ధి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. ఇది 66.4kWh బ్యాటరీతో పని చేస్తుంది, 204 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV పరిధి దాదాపు 531 కి.మీ. ఈ కారు లాంగ్‌ డ్రైవ్‌లకు మెరుగ్గా ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 51.90 లక్షలు. రేంజ్‌ పరంగా, ఇది BYD Sealion 7 & Tesla RWD వేరియంట్‌ కంటే కంటే మెరుగ్గా ఉంటుంది.

ఏ SUV బెస్ట్‌?ఈ మూడు ఎలక్ట్రిక్‌ SUVలను పోల్చి చూస్తే... టెస్లా మోడల్ Y లాంగ్ రేంజ్ వేరియంట్ గరిష్టంగా 622 కి.మీ. డ్రైవింగ్‌ రేంజ్‌ ఇస్తుంది. BYD సీలయన్ 7 డ్యూయల్ మోటార్ వేరియంట్ గరిష్టంగా 530 bhp పవర్‌ జనరేట్‌ చేస్తుంది. BMW X1 LWB పరిధి & ధర పరంగా బ్యాలెన్స్‌డ్‌ ఆప్షన్‌గా ఉంటుంది. టెస్లా 75kWh బ్యాటరీని కలిగి ఉంది, BYD 82.56kWh బ్యాటరీని కలిగి ఉంది & BMW 66.4kWh బ్యాటరీని కలిగి ఉంది. ధర విషయానికి వస్తే.. టెస్లా మోడల్ Y లాంగ్ రేంజ్ ధర రూ. 69.15 లక్షలు, BYD డ్యూయల్ మోటార్ వేరియంట్ అంచనా ధర రూ.60-65 లక్షలు & BMW X1 LWB ధర రూ. 51.90 లక్షలు.

తన ప్రత్యర్థులతో పోల్చినప్పుడు, మోడల్ Y కొంచెం ఖరీదుగానే కనిపిస్తుంది. ఇది సింగిల్ మోటార్‌ వేరియంట్‌, అదే సమయంలో, BYD సీలయన్ 7లో డ్యూయల్ మోటార్‌ ఉంది. ధర పరంగా BMW X1 LWB కంటే టెస్లా మోడల్‌ Y రేటు చాలా ఎక్కువ. అయితే, లాంగ్‌ రేంజ్‌ బ్యాటరీ ప్యాక్ చాలా పెద్దది & సీలయన్ 7 కంటే తక్కువ శక్తి ఇచ్చినప్పటికీ, రేంజ్‌ చాలా ఎక్కువ.