భారతదేశంలోకి లగ్జరీ కార్ల లాంచింగ్ ఈజీ. అదే విధంగా టెస్లా కూడా భారత మార్కెట్లోకి వచ్చింది. టెస్లా భారతదేశంలో ఒకే ఒక మోడల్, మోడల్ Y ని మాత్రమే దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది. ఇది పూర్తిగా దిగుమతి చేసుకున్న కారు కనుక, భారీ కస్టమ్స్ సుంకాలను విధిస్తుంది. దీని ధర భారీగా పెరుగుతుంది. అందుకే చాలా మంది భారత కస్టమర్లు BYD, BMW వంటి బ్రాండ్‌లకు మారారు.

Continues below advertisement

ఏ టెస్లా మోడళ్లకు డిస్కౌంట్లు ఇచ్చారుటెస్లా ఇప్పుడు కొన్ని అంతగా అమ్ముడుపోని 2025 మోడల్ Y యూనిట్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ స్టాండర్డ్ సిరీస్ వేరియంట్‌పై అందిస్తున్నారు. దీని ధర ₹60 లక్షల లోపు ఉంది. అయితే, ఈ ఆఫర్ అన్ని టెస్లా కార్లకు వర్తించదు, కానీ జాబితాలో అమ్ముడుపోని వాహనాలకు డిస్కౌంట్ అందించి సేల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఆందోళన పెంచుతున్న అమ్మకాల లెక్కలు డిసెంబర్‌లో టెస్లా భారతదేశంలో 68 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది BYD, BMW వంటి పోటీదారుల కంటే చాలా తక్కువ. 2025 క్యాలెండర్ సంవత్సరంలో టెస్లా మొత్తం అమ్మకాలు 200 యూనిట్లకు పైగా ఉన్నాయి. అయితే టెస్లా కంపెనీ చాలా మెరుగైన పనితీరును ఆశించింది. ప్రారంభంలో టెస్లా మంచి బుకింగ్‌లను అందుకుంది. కానీ అధిక ధరలకు చాలా మంది కస్టమర్లు తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు.

Continues below advertisement

ఖరీదైన ధర, పరిమిత షోరూమ్ నెట్‌వర్క్టెస్లా మోడల్ Y భారతదేశంలో BMW iX1 LWB, బీవైడీ (BYD) సీలియన్ 7 వంటి ఎలక్ట్రిక్ SUVల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. సమస్య ఏమిటంటే పోటీ కంపెనీల కార్లు తక్కువ ధరలకు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా, టెస్లా సర్వీస్ సెంటర్లు, షోరూమ్‌ల సంఖ్య ప్రస్తుతం పరిమితంగా ఉంది. అయినప్పటికీ కంపెనీ క్రమంగా దాని నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఇది భవిష్యత్తులో అమ్మకాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. టెస్లా మోడల్ Yని నడిపిన తర్వాత, చాలా మంది దాని పనితీరు, టెక్నాలజీ, డ్రైవ్ నాణ్యతతో ఆకట్టుకుంది. అయితే, దీని ధర భారత మార్కెట్‌కు చాలా ఎక్కువ అని భావిస్తున్నారు. ప్రత్యేకించి అదే విభాగంలో మరింత సరసమైన వేరియంట్ ఎంపికలు అందుబాటులో ఉన్నప్పుడు టెస్లా విక్రయాలు తగ్గాయి.

టెస్లా వ్యూహాన్ని ఏది ముందుకు తీసుకెళ్తుంది

ఇప్పుడు లంబోర్గిని ఇండియా మాజీ CEO శరద్ అగర్వాల్ టెస్లా ఇండియా కార్యకలాపాలు చూస్తున్నారు. టెస్లా కంపెనీ వ్యూహాత్మక మార్పులు చేస్తుందని అంతా భావిస్తున్నారు. భారత మార్కెట్లో విజయం సాధించడానికి, టెస్లా కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడంతో పాటు, స్థానికంగా అసెంబ్లింగ్ చేయడం లేదా ధరల తగ్గింపు వంటి మార్గాల ద్వారా టెస్లా కార్ల ధరలు దిగి రావొచ్చు.