500 Km Range Tesla Model Y Deliveries Starts: భారతదేశంలో, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ మరో ముందడుగు వేసింది. గ్లోబల్‌ బిలియనీర్‌ Elon Musk కు చెందిన టెస్లా... తన పాపులర్‌ SUV Model Y డెలివరీలను మన దేశంలో అధికారికంగా ప్రారంభించింది. వాస్తవానికి, ఈ వరల్డ్‌ క్లాస్‌ ఎలక్ట్రిక్‌ కారు 15 జులై 2025న లాంచ్‌ అయింది & రెండున్నర నెలల్లోనే తొలి డెలివరీలను ప్రారంభించింది. 

Continues below advertisement


రెండు వేరియంట్లలో Tesla Model Y 
టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్‌ కారు, భారతీయుల కోసం రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. మొదటి వేరియంట్ RWD (రియర్-వీల్ డ్రైవ్), ఫుల్‌ ఛార్జ్‌తో ఇది 500 కి.మీ. (WLTP) డ్రైవింగ్‌ రేంజ్‌ను అందిస్తుంది. రెండో వేరియంట్ LR RWD (లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్), ఇది 622 కి.మీ. (WLTP) వరకు పరిధిని కలిగి ఉంటుంది. కంపెనీ ఇప్పటికే RWD వేరియంట్ డెలివరీలను ప్రారంభించింది, లాంగ్-రేంజ్ మోడల్ త్వరలో అందుబాటులోకి వస్తుంది.


ధర & ఆఫర్లు
టెస్లా మోడల్ Y ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను ఈ కంపెనీ రూ. 59.89 లక్షలుగా నిర్ణయించింది. కస్టమర్లను ఆకర్షించడానికి ఈ కంపెనీ ఒక బంపర్‌ ఆఫర్‌ కూడా ప్రకటించింది. ప్రతి కొత్త కారు కొనుగోలుతో, ఉచిత హోమ్ ఛార్జింగ్ ఇన్‌స్టాలేషన్ (వాల్ కనెక్టర్) అందిస్తోంది. ఈ ఫీచర్ వల్ల, కారు యజమానులు తమ ఇంట్లో లేదా ఆఫీస్‌లోనే ఈ కారు ఛార్జింగ్‌ను సులభంగా సెటప్ చేసుకోవడానికి వీలవుతుంది. 


ఫీచర్లు & ఛార్జింగ్ నెట్‌వర్క్
టెస్లా మోడల్ Y కారులో గ్లోబల్‌-స్టాండర్డ్‌ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. మోడల్ Y డెలివెరీలతో పాటు, భారతదేశంలో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా ఈ కంపెనీ ప్రారంభించింది. ముంబైలోని BKC సెంటర్‌లో నాలుగు V4 సూపర్‌చార్జర్‌లు (DC) & నాలుగు డెస్టినేషన్ ఛార్జర్‌లు (AC) ఇన్‌స్టాల్ చేశారు. దిల్లీలోని ఏరోసిటీలో నాలుగు V4 సూపర్‌చార్జర్‌లు (DC) & మూడు డెస్టినేషన్ ఛార్జర్‌లు (AC) అందుబాటులోకి తెచ్చారు. కస్టమర్‌లు దిల్లీ & ముంబైలోని టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల నుంచి ఈ కారును టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకోవచ్చు లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా నేరుగా బుక్ చేసుకోవచ్చు.


భారతదేశంలో, టెస్లా మోడల్ Y డెలివరీ ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఒక చారిత్రాత్మక అడుగుగా భావిస్తున్నారు. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్‌ను పెంచడమే కాకుండా, దేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తుందని అంచనా వేస్తున్నారు.


టెస్లా మోడల్ Y పోటీ కార్లు
భారతీయ మార్కెట్లో, టెస్లా మోడల్ Y చాలా ప్రీమియం ఎలక్ట్రిక్ SUVల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోటీ కార్ల లిస్ట్‌లో- 560 km రేంజ్ & విలాసవంతమైన ఇంటీరియర్‌కు ప్రసిద్ధి చెందిన Mercedes-Benz EQB ఉంది. BMW iX1 LWB కూడా ఒక స్ట్రాంగ్‌ ఆప్షన్‌ అవుతుంది, ఈ కారులో వైడ్ స్క్రీన్ కర్వ్డ్ డిస్‌ప్లే & 10.7 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఉన్నాయి. Kia EV6, 84 kWh బ్యాటరీ & 663 km డ్రైవింగ్‌ రేంజ్‌తో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇండియాకి చెందిన కంపెనీలు కూడా ఈ రేసులో స్ట్రాంగ్‌ పెర్ఫార్మెన్స్‌ చేస్తున్నాయి. Mahindra BE 6 & ata Harrier EV కూడా బలమైన పోటీని అందిస్తున్నాయి. BYD Sealion 7 కూడా అద్భుతమైన బ్యాటరీ, పనితీరు & ప్రీమియం ఫీచర్లతో మన మార్కెట్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది.