Tesla India sales fall short of expectations with 600 orders:  టెస్లా ఇండియా కార్ల అమ్మకాలు అత్యంత దారుణంగా ఉన్నాయి.  అమెరికా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో  జూలై 15, 2025న ఘనంగా ప్రారంభించింది. ఏముంది ఇక విచ్చలవిడిగా కొనేస్తారని అనుకున్నారు. కానీ  మోడల్ Y కోసం జూలై నుంచి ఇప్పటివరకు కేవలం 600 ఆర్డర్లను మాత్రమే అందుకుంది.  ఇది కంపెనీక అంచనాల కంటే చాలా తక్కువ. 2025లో కనీసం రెండున్నర వేల యూనిట్లు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. కానీ వెయ్యి కార్లు అమ్మడం కూడా కష్టమన్న అభిప్రాయం ఏర్పడుతోంది. 

టెస్లా తన మొదటి షోరూమ్‌ను జూలై 15, 2025న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రారంభించింది, ఈ సందర్భంగా మోడల్ Yని లాంచ్ చేసింది. ఆగస్టు 11న, ఢిల్లీలోని ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3 వద్ద రెండవ టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను తెరిచింది. అదనంగా, ఆగస్టు 4న ముంబైలోని వన్ BKC వద్ద నాలుగు V4 సూపర్‌ఛార్జర్లు  ,  నాలుగు 11kW AC డెస్టినేషన్ ఛార్జర్లు తో మొదటి సూపర్‌ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. [ 

 మోడల్ Y RWD డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో, LR RWD డెలివరీలు నాలుగవ త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. 2025లో 350-500 వాహనాలను షాంఘై నుంచి  దిగుమతి చేయనున్నారు. మొదటి బ్యాచ్  ఈ నెలలోనే చేరుకుది.  అధిక దిగుమతి సుంకాలు  మోడల్ Y ధరను భారీగా పెంచాయి. అమెరికా కన్నా రెట్టింపు ధర కారణంగా ఎక్కువ మంది ఆసక్తి చూపించడంలేదు.  భారత EV మార్కెట్‌లో లగ్జరీ సెగ్మెంట్ కేవలం 4-5% వాటాను కలిగి ఉంది.  2025 మొదటి అర్ధంలో 2,800 ప్రీమియం EVలు మాత్రమే అమ్ముడయ్యాయి.  భారత్-యుఎస్ ట్రేడ్ ఒప్పందంపై ఆశలు దెబ్బతిన్నాయి, యుఎస్ 50 శాతం సుంకం విధించడంతో ధర తగ్గింపు అవకాశాలు తగ్గాయి. టెస్లా 2026 నాటికి దక్షిణ భారతదేశంలో మూడవ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్లాన్ చేస్తోంది.  

టెస్లా షోరూంలాంచ్ అయినప్పుడు విరగబడికొంటారని అనుకున్నారు. కానీ పరిస్థితి తారుమారు అయింది.