Tesla Cybertruck News: అత్యాధునిక టెక్నాలజీ, ప్రత్యేకమైన డిజైన్‌తో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టెస్లా సైబర్‌ట్రక్‌కు త్వరలో తెరపడనుంది. భారీ అంచనాలతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్‌కు ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో ఉత్పత్తిని నిలిపివేయాలని టెస్లా నిర్ణయించింది. 2027 మధ్య నాటికి సైబర్‌ట్రక్ తయారీని పూర్తిగా నిలిపివేయనున్నట్లు కంపెనీ CEO ఎలాన్ మస్క్ ‍‌(Elon Musk) తన ట్వీట్‌లో వెల్లడించారు. దీని స్థానంలో సైబర్‌క్యాబ్ ‍‌(Tesla Cybercab) తీసుకురానున్నారు. ప్రపంచంలోనే అత్యంత దృఢమైన & సురక్షితమైన కార్లలో ఒకటిగా సైబర్‌ట్రక్ గుర్తింపు పొందింది.

Continues below advertisement

సైబర్‌ట్రక్ మార్కెట్లోకి వచ్చిన మూడేళ్లలోపే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. అంతకుముందు టెస్లా Model S & Model X కార్ల ఉత్పత్తిని కూడా నిలిపివేసింది. ఇప్పుడు సైబర్‌ట్రక్ వంతు వచ్చింది.

సైబర్‌ట్రక్ ప్రయాణం ఎలా మొదలైంది?

Continues below advertisement

టెస్లా 2019లో సైబర్‌ట్రక్‌ను కాన్సెప్ట్ మోడల్‌గా ప్రపంచానికి పరిచయం చేసింది. తొలుత 2021లోనే మార్కెట్లోకి తీసుకురావాలని భావించింది. అయితే వివిధ కారణాలతో ఆలస్యమైంది. చివరకు అమెరికాలోని టెక్సాస్ గిగాఫాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించి, 2023లో అమ్మకాలకు తీసుకొచ్చింది.

టెస్లా ఈ వాహనాన్ని తన ప్రధాన ప్యాసింజర్ వెహికల్‌గా ప్రచారం చేసింది. Ford F-150 Lightning వంటి ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కులకు పోటీగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం.. అమెరికా, మెక్సికో, కెనడా, UAE, ఖతార్, దక్షిణ కొరియా & సౌదీ అరేబియాలో సైబర్‌ట్రక్ విక్రయాలు జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?

అమ్మకాలు తగ్గడానికి కారణాలేంటి?

సైబర్‌ట్రక్ ప్రారంభంలో మంచి ఆసక్తిని, అమ్మకాలను సంపాదించింది. అయితే తర్వాతి సంవత్సరాల్లో పరిస్థితి మారిపోయింది. దీని ప్రత్యేకమైన, కోణాలతో కూడిన డిజైన్ కొందరిని ఆకట్టుకున్నప్పటికీ మరికొందరికి నచ్చలేదు. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించిన దీని బాడీ డిజైన్ కూడా చర్చకు దారితీసింది. ముఖ్యంగా యూరప్‌లో భద్రత నిబంధనలకు సైబర్‌ట్రక్ డిజైన్ సరిపోలలేదు. దీంతో ఆ పెద్ద మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు, 2019లో కాన్సెప్ట్‌ను పరిచయం చేసినప్పుడు చెప్పిన ధరతో పోలిస్తే, అమ్మకాలకు వచ్చిన సమయంలో ధర చాలా ఎక్కువగా ఉంది. ఎలాన్ మస్క్ చుట్టూ నెలకొన్న వివాదాలు కూడా వాహనం ప్రజాదరణ తగ్గడానికి ఒక కారణంగా నిలిచాయని కథనం పేర్కొంది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ట్రక్ 63,000 యూనిట్లకు పైగా అమ్ముడైనట్లు అంచనా. అయితే మస్క్ గతంలో అంచనా వేసిన ఏడాదికి 2.5 లక్షల యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

సైబర్‌ట్రక్ స్థానంలో సైబర్‌క్యాబ్

సైబర్‌ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయడం ద్వారా లభించే తయారీ సామర్థ్యాన్ని సైబర్‌క్యాబ్ కోసం ఉపయోగించాలని టెస్లా భావిస్తోంది. Model S & Model X ఉత్పత్తిని నిలిపివేసి Optimus రోబో తయారీకి ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే, ఇప్పుడు సైబర్‌ట్రక్ స్థానంలో సైబర్‌క్యాబ్‌కు ప్రాధాన్యత ఇవ్వనుంది.

ఇది కూడా చదవండి: కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?

సైబర్‌క్యాబ్ అనేది పూర్తిగా ఆటోమేటిక్‌గా నడిచే ఎలక్ట్రిక్ ట్యాక్సీ. ఇందులో స్టీరింగ్ వీల్, పెడల్స్, బయటివైపు రియర్ వ్యూ మిర్రర్లు (ORVMs), వెనుక విండ్‌స్క్రీన్ ఉండవు. బటర్‌ఫ్లై డోర్లతో రూపొందించిన ఈ వాహనాన్ని టెస్లా తన రైడ్ హైలింగ్ సేవలకు ఉపయోగించనుంది.

టెస్లా భవిష్యత్ ప్లాన్ ఏమిటి?

సైబర్‌ట్రక్ ఉత్పత్తి నిలిచిపోయిన తర్వాత టెస్లా గ్లోబల్ ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లో Model 3 & Model Y మాత్రమే మిగులుతాయి. అయితే, 2028 నుంచి కొత్త తరం Roadster డెలివరీలు ప్రారంభమవుతాయని టెస్లా హామీ ఇచ్చింది.

తక్కువ ధరలో లభించే చిన్న EVని కూడా టెస్లా అభివృద్ధి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వాహనం ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.