Tata Tiago Smart Base Variant Features: సాధారణంగా కార్ల కంపెనీలు తమ కొత్త మోడళ్లను లాంచ్ చేసినప్పుడు కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో ఉండే ఆకర్షణీయమైన ఫీచర్లనే హైలైట్ చేస్తుంటాయి. కానీ మెజారిటీ భారతీయులు చూసేది బేస్ వేరియంట్‌ వైపే. అతి తక్కువ ధరలో ఒక కారును ఇంటికి తీసుకెళ్లాలనుకునే సగటు మధ్యతరగతి వినియోగదారుడి కోసం టాటా మోటార్స్ తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌ టియాగోలో స్మార్ట్ వేయింరట్‌ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దింది. 

Continues below advertisement

హైదరాబాద్‌ ఆన్‌రోడ్ ధర ప్రకారం కేవలం 5.67 లక్షల నుంచే ప్రారంభమయ్యే ఈ వేరియంట్‌, అటు పెట్రోల్, ఇటు సీఎన్జీ ప్రియులకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. అసలు ఈ స్మార్ట్ వేరియంట్‌లో ఏముంది? ఏయే ఫీచర్లు మిస్‌ అవుతున్నాయి? భద్రత విషయంలో టాటా తీసుకున్న జాగ్రత్తలు గురించి చూద్దాం. 

Continues below advertisement

స్మార్ట్ వేరియంట్‌లో ఉన్నవేంటీ?

టాటా టియాగో లైనప్‌లో స్మార్ట్ అనేది ఎంట్రీ లెవల్‌ లేదా బేస్ వేరియంట్. సాధారణంగా బేస్ వేరియంట్‌ అంటే కేవలం ఇంజిన్, బాడీ మాత్రమే ఉంటాయని, సౌకర్యాలు ఉండవనే అపోహ ఉంటుంది. కానీ, టియాగో స్మార్ట్ వేరియంట్ ఆ అపోహను తొలగిస్తోంది. ఇది కేవలం మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పెట్రోల్‌ వెర్షన్ ధర 5.67 లక్షలు ఉంటే సీఎన్జీ వెర్షన్ 6.80లక్షలకు లభిస్తోంది. 

మే నెలాఖరు నుంచి టాటా మోటార్స్ టియాగో అప్‌డేటెడ్‌ వెర్షన్లు మార్కెట్‌లో ఉంచింది. ఇందులో భాగంగానే మే 28న పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లను అధికారికంగా మార్కెట్‌లోకి తెచ్చారు. జూన్ 3 నాటికి ఈ బేస్ వేరియంట్‌ పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులకు స్పష్టంగా తెలిశాయి. 

టియాగో స్మార్ట్ వేరియంట్‌ను ఎంచుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. దీనికి పోటీగా ఉన్న మారుతి స్విఫ్ట్ లేదా హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్ బేస్ వేరియంట్‌ కంటే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తోంది. బేస్ వేరియంట్‌ అయినప్పటికీ ఇందులో సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ లేదు. బేస్ వేరియంట్‌ నుంచే సీఎన్జీ ఆప్షన్ అందించడం సామాన్యుడికి ఇంధన ఖర్చులు తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. 

డిజైన్‌లో కనిపించిన మార్పులు 

టియాగో స్మార్ట్ వేరియంట్‌ చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ టియాగో సిగ్నేచర్ షేప్‌ను అలాగే ఉంచారు. ఇందులో సాధారణంగా హాలోజన్ హెడ్‌ ల్యాంప్స్‌ ఉంటాయి. ముందు భాగంలో బ్లాక్ టాటా అప్లిక్యూ, బ్లాక్ గ్రిల్ ఇచ్చారు. ఇది కారుకు ఒక క్లాసిక్‌ లుక్ ఇస్తుంది. ఇందులో 14 ఇంచ్ స్టీల్ వీల్స్‌ వస్తాయి. వీల్ క్యాప్స్ ఉండవు. బయటి రియర్ వ్యూ మిర్రర్స్‌, డౌర్‌ హ్యాండిల్స్ బ్లాక్ కలర్‌లో ఉంటాయి. వెనుక భాగంలో ఫుల్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. ఇది బేసి వేరియంట్‌కు ప్రీమియం టచ్ ఇస్తుంది. 

ఇంటీరియర్ ఫీచర్లు 

కారు లోపల స్మార్ట్ వేరియంట్ చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. బ్లాక్, గ్రే కలర్‌ ఫ్యాబ్రిక్‌ అప్హోల్స్టరీని ఉపయోగించారు. ఈ వేరింట్‌లో ఎలాంటి ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్ ఉండదు. దీనికి బదులు మొబైల్ ఫోన్ హోల్డర్‌ను అమర్చుకోవడానికి ఒక ప్రత్యేక స్లాట్ ఇచ్చారు. ఇది చాలా స్మార్ట్ ఐడియా, ఎందుకంటే ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఫోన్‌నే నావిగేషన్ కోసం వాడుతున్నారు. టాప్‌ మోడల్స్‌లో ఉండే కొత్త డిజిటల్ క్లస్టర్‌నే ఈ బేస్ వేరియంట్‌లోనూ కొనసాగించారు. స్మార్ట్‌ పరికరాల కోసం ఒక 12వీ సాకెట్ ఇచ్చారు. 

భద్రతలో రాజీ లేదు 

టాటా కార్లు అంటేనే భద్రతకు మారుపేరు. టియాగో స్మార్ట్ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ ఇచ్చారు. బ్రేకింగ్ వ్యవస్థను నియంత్రించడానికి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. చిన్నపిల్లల భద్రత కోసం చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ చేయడానికి రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉపయోగపడతాయి. కారులో ఉన్న అందరు ప్రయాణికులకు 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఇచ్చారు. 

ఇంజిన్ పనితీరు 

టియాగో స్మార్ట్ రెండు రకాల ఇంధన ఆప్షన్లతో వస్తుంది. 1.2లీటర్ మూడు సిలిండ్‌ ఇంజిన్ 85bhp పవర్, 113nM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ సీఎన్జీ మోడ్‌లో 76bhp పవర్‌, 96Nm టార్క్‌ను ఇస్తుంది. సీఎన్జీ మోడళ్లలో టాటా పేటెంట్ పొందిన ట్విన్ సిలిండర్ లే అవుట్ ఉంటుంది. దీని వల్ల డిక్కీలో సామాన్లు పెట్టుకోవడానికి తిగిన స్థలం ఉంటుంది. ఇందులో 5 స్పీడ్‌ మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది. 

ఎవరితో పోటీ పడుతుంది?

భారత్ మార్కెట్‌లో టియాగో స్మార్ట నేరుగా మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ 10, సిట్రోయెన్ సీ 3X సీఎన్జీతో పోటీ పడుతుంది.  ధర పరంగా చూస్తే స్విఫ్ట్, నియోస్‌ల కంటే టియాగో స్మార్ట చౌకైంది. స్పేస్ విషయంలోనూ ముందంజలో ఉంది. తక్కువ బడ్జెట్‌లో, సిటీ డ్రైవింగ్ కోసం సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారు కావాలనుకునే వారికి ముఖ్యంగా మైలేజీ ముఖ్యం అనుకునే వాళ్లకు టియాగో స్మార్ట్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.