Tata tiago On EMI Finance Plan: రోజు రోజుకు రోడ్లపై రద్దీ పెరిగిపోతోంది. దీనికి తోడు పార్కింగ్ కోసం పడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇంధన భారం ఉండనే ఉంది. అయితే భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన టాటా టియాగోతో ఈ సమస్యలకు చక్కని పరిష్కారాన్ని అందించింది. కేవలం స్లైలిష్‌ లుక్ మాత్రమే కాకుండా భద్రతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు సామాన్యుల మనసులు గెలుచుకుంటోంది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు, ఫైనాన్స్‌ వెసులుబాటును విశ్లేషిస్తే, మధ్యతరగతి కుటుంబాలకు టియాగో ఎందుకు బెస్ట్ ఆప్షనో తెలుసుకుందాం. 

Continues below advertisement

భద్రత టియాగో స్పెషల్ 

2016లో టాటా మోటార్స్ తన ఇంపాక్ట్‌ డిజైన్ ఫిలాసఫీతో టియాగోను మార్కెట్‌లోకి తెచ్చినప్పటి నుంచి ఇది ఒక సంచలనంగా మారింది. ఒకప్పుడు పెట్రోల్‌, డీజిల్ ఇంజిన్లో లభించిన ఈ కారు కాలక్రమేణా పర్యావరణ హితమైన సీఎన్జీ, ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లోకి రూపాంతరం చెందింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే... ప్రస్తుతం టియాగోలో డీజిల్ వెర్షన్ అందుబాటులో లేదు. 

టియాగోను మిగతా కార్ల కంటే భిన్నంగా నిలబెట్టేది దాని 4 స్టార్ గ్లోబల్‌ ఎన్‌ క్యాప్‌ సేఫ్టీ రేటింగ్. బిజీగా ఉండే రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు భద్రత చాలా ముఖ్యం. 1199 సీసీ ఇంజన్‌తో , మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో ఇది డ్రైవింగ్‌ అనుభవాన్ని సులభతరం చేస్తుంది. 

Continues below advertisement

పెట్రోల్‌ వేరియంట్లు బడ్జెట్‌ ప్లాన్ 

టియాగో పెట్రోల్‌ మోడల్స్ 1199 సీసీ ఇంజిన్‌తో 86పీఎస్‌ పవర్‌, 113 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తాయి. నగరంలోని వీటి ఆన్‌ రోడ్ ధరలు 5.67 లక్షల నుంచి 8.47 లక్షల వరకు ఉన్నాయి. 

బేస్‌ మోడల్‌(XE): ఎంట్రీ లెవెల్‌ కొనుగోలుదారుల కోసం రూపొందించిన ఈ మోడల్‌ ఆన్‌రోడ్ ధర 5,6,654టాప్ సెల్లింగ్‌(XT): టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, అల్లాయ్‌ వీల్స్‌ వంటి సౌకర్యాలతో దీని ధర 7.19 లక్షలుగా ఉంది. 

ఆటోమేటిక్‌ వెర్షన్‌(XZA AMT): సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది. ఈ మోడల్ ధర 8.47 లక్షలు. 

పెట్రోల్‌ మోడల్స్ లీటర్‌కు 20-23 కిలోమీటర్లు మైలేజీని అందిస్తూ రోజువారి అవసరాలకు పొదుపుగా నిలుస్తున్నాయి. 

సీఎన్జీ వేరియంట్ల ధరలు 

ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న టైంలో సీఎన్జీ వైపు మొగ్గు చూపుతున్నారు చాలా మంది. టియాగో సీఎన్జీ మోడల్స్ కిలోకు 26-28 కిలోమీటర్ల మైలేజీి ఇస్తున్నాయి. హైదరాబాద్‌లో సీఎన్‌జీ స్టేషన్లు ఎక్కువగా ఉండటం, కిలో సీఎన్జీ ధర సుమారు రూ. 80 ఉండటం వల్ల ఇది అత్యంత ఎకనామికల్‌ ఆప్షన్‌గా ఉంది. 

సీఎన్‌జీలో బేస్ మోడల్ XE ధర 6.80 లక్షళ నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్‌ XZA AMT సీఎన్జీ 9.59 లక్షల వరకు అందుబాటులో ఉంది. సీఎన్జీ విభాగంలో కూడా ఆటోమేటిక్‌ ఆప్షన్ ఇవ్వడం టాటా టియాగో స్పెషల్. 

టాటా టియాగో ఈవీ 

పర్యావరణ హితం, జీరో ఎమిషన్స్‌ కోరుకునే వారికి కోసం టియాగో ఈవీ ఒక గొప్ప వరం. దీనిలో మీడియం రేంజ్‌, లాంగ్ రేంజ్‌ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి 250 నుంచి 315కిలోమీటర్ రేంజ్‌ను అందిస్తున్నాయి. చార్జింగ్ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తుండటం వల్ల ఈవీ మోడల్స్‌కు డిమాండ్ పెరిగింది. ఈవీ ఆన్‌ రోడ్ ధరలు 8.60 లక్షల నుంచి 11.9 లక్షల వరకు ఉన్నాయి. 

ఫైనాన్స్‌ ప్లాన్, ఈఎంఐ వివరాలు 

మధ్యతరగతి ప్రజలకు లోన్ సౌకర్యం కారు కొనుగోలును సులభతరం చేస్తోంది. బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్లు 8.5 శాతం నుంచి 9.5శాతం  వడ్డీ రేట్లతో లోన్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈవీలకు గ్రీన్ లోన్ స్కీమ్‌ కింద 7.4 శాతం వంటి తక్కువ వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. సాధారణంగా 20 శాతం డౌన్‌ పేమెంట్‌తో ఐదేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే ఈఎంఐ వివరాలు ఇలా ఉంటాయి. 

పెట్రోల్‌ XE: డౌన్‌ పేమెంట్‌ రూ. 1,13,531; ఈఎంఐ 9,500-9562సీఎన్జీ XE: డౌన్‌ పేమెంట్‌ రూ. 1,36,061; ఈఎంఐ 11,400-11,452

ఈవీ XE MR: డౌన్‌ పేమెంట్‌ రూ. 1,72,152; ఈఎంఐ 14,140-14,400

ఒక వేళ మీరు 7 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే ఈ వేరియంట్‌లో ఈఎంఐ కేవలం 7300 వరకు తగ్గే అవకాశం ఉంది. 

ఐడీ ప్రూఫ్‌, అడ్రస్‌ ప్రూఫ్‌, ఇన్‌కమ్‌ ప్రూఫ్‌, బ్యాంకు స్టేట్‌మెంట్స్‌ సమర్పిస్తే బ్యాంకులో లోన్ ప్రక్రియ మొదలవుతుంది. 

మెయింటెనెన్స్‌ ఖర్చు తక్కువగా ఉండటం, 3 ఏళ్ల వారంటీ, ట్రాఫిక్‌లో సులభంగా నడపగలిగే సామర్థ్యం టియాగోను బెస్ట్‌ బైగా మారుస్తున్నాయి.