Tata Tiago NRG: టాటా టియాగో NRG అప్‌డేట్ వెర్షన్ ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చేసింది. టియాగో NRG ఎంట్రీ లెవల్ వేరియంట్ -XTని పూర్తిగా నిలిపివేశారు. ఇకపై భారత్‌ మార్కెట్‌లో ఈ వెరియంట్‌ను తీసుకురావడం లేదని కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు టాటా టియాగో NRGను చాలా ఏరియాస్‌లో అప్‌డేట్ చేసి తీసుకొచ్చింది.  


SUV లాంటి స్టైలింగ్ హ్యాచ్‌బ్యాక్ పొందాలనుకునే వారి కోసం ఈ కొత్త మోడల్ టాటా టియాగో NRGను రూపొందించారు. ఇతర టియాగో వేరియంట్‌లతో పోలిస్తే మాస్ లుక్‌తో ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్, స్కిడ్ ప్లేట్లు, బాడీ క్లాడింగ్ ఇలా చాలా ఏరియాల్లో మార్పులు చేశారు.  


టాటా టియాగో NRG ఇంజిన్, పవర్‌ట్రెయిన్
టాటా టియాగో NRG 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా AMT యూనిట్‌ గేర్‌ బాక్స్‌లను కలిగి ఉంది. ఈ రెండు ఆప్షన్స్‌తో టాటా టియాగో NRG ఇంజిన్ గరిష్ట పవర్‌ 82 HP. కస్టమర్లు మాన్యువల్ లేదా AMT ఆప్షన్‌తో CNG వేరియంట్‌ కూడా వస్తోంది. ఇందులో ఇంజిన్‌ గరిష్ట పవర్‌ 73 HP ఉంటుంది. 


టాటా టియాగో NRG అవుటర్‌ స్పెసిఫికేషన్స్‌


ముందు, వెనుక బంపర్ల వద్ద రీడిజైన్ చేసిన సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, LED హెడ్‌లైట్లు, రీ డిజైన్ చేసిన వీల్ కవర్లు టియాగో NRG 2025 మోడల్ అప్‌డేట్ చేశారు. టెయిల్‌గేట్‌పై NRG బ్యాడ్జ్, చంకీ బ్లాక్ రూఫ్ రెయిల్స్ , సైడ్‌లో ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ చూడవచ్చు. ఇవి నార్మల్ టియాగో మోడళ్లలో కనిపించవు.


టాటా టియాగో NRG ఇంటీరియర్ స్పెసిఫికేషన్స్‌ 
టాటా టియాగో NRGలో ఆపిల్ కార్‌ప్లేతో కనెక్ట్ అయిన వైర్‌లెస్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వస్తోంది. దీనికి ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ కూడా ఉంది. ఆటో హెడ్‌లైట్లు, వైపర్‌లు, బ్యాక్ కెమెరాతోపాటు చాలా ఫీచర్స్‌ ఇక్కడ చూడవచ్చు.


టాటా టియాగో NRGలో సెక్యూరిటీ స్పెసిఫికేషన్స్‌


ముందు భాగంలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 3-పాయింట్ ELR సీట్ బెల్టులు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, మాన్యువల్ HVAC వస్తున్నాయి.  


టాటా టియాగో NRG ప్రైస్  ఎంత  
టాటా టియాగో NRG XZ రూ. 7.2 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారత మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS, మారుతి సుజుకి వ్యాగన్ Rకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.