మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లడానికి లేదా వ్యాపారం పనులపై సిటీలో డ్రైవింగ్ చేయడానికి మంచి ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా.. అయితే Tata Tiago EV మీకు బెస్ట్ ఆప్షన్. టాటా టియాగో ఈవీ రోజువారీ ప్రయాణాలు చేసే వారికి పెట్రోల్, డీజిల్ ఖర్చు టెన్షన్ లేకుండా చేస్తుంది. ఈ టియాగో EV ఛార్జింగ్ చేస్తే 315 KM వరకు ప్రయాణించవచ్చు. మీరు రోజుకు 60 కిలోమీటర్లు నడిపినా ఈ కారు కేవలం కిలోమీటరుకు ఒక రూపాయి లోపే రన్నింగ్ ఖర్చుతో నడుస్తుంది. ఈ ఈవీ కారు మీ బైక్, మెట్రో కంటే చౌకగా సేవలు అందిస్తుంది. టాటా కంపెనీ MY24, MY25 మోడల్ Tiago EVలపై 1.50 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. 

Continues below advertisement

ధర, వేరియంట్‌లు

Tata Tiago ఈవీ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షలకు ప్రారంభమై వేరియంట్ బట్టి గరిష్టంగా రూ. 11.14 లక్షల వరకు ఉంటుంది. టియాగో ఈవీ కారు 4 వేరియంట్‌లలో వస్తుంది. టాటా టియాగో XE MR, XT MR, XT LR, XZ+ Tech Lux LR. తక్కువ బడ్జెట్ ఉన్న కస్టమర్‌లకు మీడియం రేంజ్ వేరియంట్ సరైన ఛాయిస్. అయితే ఎక్కువ దూరం వెళ్లాలనుకునే, లాంగ్ డ్రైవ్ కోరుకునే వారికి లాంగ్ రేంజ్ వేరియంట్ సరైనది.

Tata Tiago EV బయటి వైపు LED హెడ్‌లైట్‌లు, కొత్త సిల్వర్ గ్రిల్ స్ట్రిప్, 14 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో బ్లాక్- గ్రే డాష్‌బోర్డ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (Wireless Android Auto, Apple CarPlay సపోర్ట్‌తో), డిజిటల్ క్లస్టర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, 240 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Continues below advertisement

వాహనదారుల సేఫ్టీ విషయానికి వస్తే, Tata Tiago EV చాలా నమ్మదగిన కార్లలో ఒకటి. టియాగో ఈవీ గ్లోబల్ NCAP నుండి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS- EBD, ESP, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), కెమెరా వంటి ఫీచర్‌లు ఉన్నాయి. దీంతో పాటు IP67 వాటర్‌ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్, లిక్విడ్ కూల్డ్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ బ్యాటరీని మరింత సురక్షితంగా ఉంచుతుంది. 

బ్యాటరీ, రేంజ్.. ఛార్జింగ్ వివరాలు

Tata Tiago EVలో రెండు బ్యాటరీ వేరియంట్స్‌ ఉన్నాయి.  ఒకటి 19.2 kWh (మీడియం రేంజ్), రెండోది 24 kWh (లాంగ్ రేంజ్). మీడియం రేంజ్ వేరియంట్ 60 bhp పవర్, 110 Nm టార్క్‌ను అందిస్తుండగా.. ఫుల్ ఛార్జింగ్ చేస్తే 250 నుంచి 275 కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు. అదే విధంగా లాంగ్ రేంజ్ వేరియంట్ 74 bhp పవర్, 114 Nm టార్క్‌తో 293 నుంచి 315 KM జర్నీ చేయవచ్చు. 

ఛార్జింగ్ విషయానికి వస్తే, 3.3 kW AC హోమ్ ఛార్జర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 9.4 గంటలు పట్టవచ్చు. అయితే DC ఫాస్ట్ ఛార్జర్ 10 నుంచి 80% ఛార్జింగ్‌ను కేవలం 57 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. కంపెనీ 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ ఇస్తుంది.