భారత ఆటోమొబైల్ మార్కెట్లో Hyundai Cretaచాలా కాలం నుంచి నమ్మకమైన వాహనంగా ఉంది. ఇప్పుడు TataMotorsకొత్త TataSierraను లాంచ్ చేయడంతో ఈ సెగ్మెంట్లో పోటీ పెరిగింది. టాటా Sierraను ప్రీమియం లుక్, మోడ్రన్ ఫీచర్స్ తో అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో TataSierra SUV లేదా HyundaiCretaSUVలలో మీకు ఏది సరైన ఎంపిక అని తేల్చుకోలేకపోతున్నారా.. అయితే వాటి ధర, ఫీచర్లు తెలుసుకుని మీకు కావాల్సిన ఎస్‌యూవీ కొనుగోలు చేసేయండి. 

రెండింటి ధర ఎంత? 

ధర విషయానికి వస్తే HyundaiCretaప్రారంభ ధర TataSierraకంటే కొంచెం తక్కువగానే ఉంది. దాంతో ఇది లో బడ్జెట్ కొనుగోలుదారులకు ఎక్కువగా నచ్చవచ్చు. హ్యుందాయ్ Cretaబేస్మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 10.73 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే TataSierraప్రారంభ ధర 11.49 లక్షల రూపాయలు. అయితే టాప్వేరియంట్లో ధర  మారుతుంది. టాటా Sierraగరిష్ట ధర రూ.18.49 లక్షలుగా ఉంటే, Cretaటాప్మోడల్ 20.20 లక్షల వరకు ఉంది. 

సియెరాలో ఈ ఫీచర్లు చూశారా

TataSierraకేబిన్ దీనిని ఇతర ఎస్‌యూవీల నుండి వేరు చేస్తుంది. Tataలో ఇప్పటివరకు దాని అత్యంత ప్రీమియంఇంటీరియర్అని, చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారని కంపెనీ పేర్కొంది. టాటా Sierraలో ట్రిపుల్ స్క్రీన్సెటప్ ఇచ్చారు. ది ఈ సెగ్మెంట్లో దీనిని ప్రత్యేకంగా చేస్తుంది. దీనితో పోలిస్తే Hyundai Cretaలో డ్యూయల్ స్క్రీన్సెటప్ లభిస్తుంది. Sierraలో 19 అంగుళాల పెద్ద అల్లాయ్వీల్స్ ఇచ్చారు. ఇవి దీనికి మరింత పవర్‌ఫుల్, ప్రీమియంలుక్ఇస్తాయి.

టెక్నాలజీ ఎలా ఉంది ? 

రెండు SUVsలో అనేక ఫీచర్లుసమానంగా ఉన్నాయి. కానీ టాటా Sierraకొన్ని విషయాలలో ముందుంది. ఇందులో మల్టీ-కలర్యాంబియంట్లైటింగ్, 12 స్పీకర్ JBLసౌండ్సిస్టమ్, ఫ్రంట్సీట్స్ కోసం మెరుగైన థైసపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కేబిన్‌కు మరింత సౌకర్యవంతమైన, లగ్జరీఫీల్ఇస్తాయి. మరోవైపు Hyundai Cretaకూడా రోజువారీ అవసరాలకు సౌకర్యవంతమైన సీటింగ్, మీకు ఈజీ డ్రైవింగ్ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇది ఫ్యామిలీయూజ్ కోసం మెరుగ్గా ఉంటుంది.

కొత్త Tata Sierraడిజైన్ చాలా భిన్నంగా, కాస్త యూనిక్‌గా ఉంది. ఇందులో పాత Sierraఛాయలు కనిపిస్తాయి. ఇది దీనిని ప్రత్యేకంగా చేస్తుంది. దీని కలర్ఆప్షన్స్ కూడా భారత కస్టమర్లకు నచ్చుతాయి. మరోవైపు, Hyundai Cretaడిజైన్ కూడా చాలా మోడ్రన్‌గా ఉంది. మీరు లేటెస్ట్టెక్నాలజీ, ఎక్కువ ఫీచర్లు, ప్రీమియంఫీల్ కోరుకుంటే Tata Sierraమీకు మంచి ఎంపిక అవుతుంది. మీరు మెరుగైన పెర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్, బ్యాలెన్స్డ్ప్యాకేజ్ కోరుకుంటే Hyundai Creta మీకు మంచి SUV ఛాయిస్ కానుంది. 

Also Read: మారుతి నుంచి టాటా వరకు, కియా నుంచి స్కోడా వరకు - 2026లో లాంచ్‌కు సిద్ధమైన 11 ఎలక్ట్రిక్‌ కార్లు