Tata Sierra Variants, Price Range: మధ్య తరగతి వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త Tata Sierra మోడల్‌ వివరాలను టాటా మోటార్స్‌ దశలవారీగా రివీల్‌ చేస్తోంది. తాజాగా, ఈ కంపెనీ, ఈ మిడ్‌సైడ్‌ SUVకి సంబంధించిన లో-స్పెక్‌ & మిడ్‌-స్పెక్‌ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. రెండు టాప్‌ వేరియంట్‌ల ధరలను మాత్రం త్వరలో వెల్లడించనుంది. ఇప్పుడు, Sierra రేంజ్‌ను ఎలా విభజించారో, ఏ ట్రిమ్‌లో ఏమేం ఫీచర్లు ఉన్నాయో, వాటి ధరలు ఎంతో క్లియర్‌గా తెలుసుకోవచ్చు.

Continues below advertisement

ఏడు ట్రిమ్‌లు – కొనేవారికి విస్తృతమైన ఎంపికలుటాటా మోటార్స్‌, కొత్త Sierraను మొత్తం ఏడు ట్రిమ్‌లలో అందిస్తోంది, అవి:  Smart+, Pure, Pure+, Adventure, Adventure+, Accomplished, Accomplished+

ఒక్కో దాంట్లో ఒక్కో ఫీచర్‌ ప్యాకేజీతో వస్తుండటం వల్ల, బడ్జెట్‌ ప్రకారం సెలెక్ట్‌ చేసుకోవడానికి చాలా వరకు ఆప్షన్‌లు ఇచ్చినట్లైయింది.

Continues below advertisement

ధర ఎంత నుంచి మొదలవుతుంది?కొత్త Sierra ధరలు ₹11.49 లక్షల నుంచి ₹18.49 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్‌-షోరూమ్‌). టాప్‌ లైన్‌లో ఉన్న రెండు వేరియంట్‌ల ధరలు ఇంకా రాలేదు కానీ, ఇప్పటివరకు వచ్చిన లిస్టు ప్రకారం, ఈ SUV సెగ్మెంట్‌లో బలమైన పోటీని సృష్టించబోతోంది.

AP, TG మార్కెట్లలో SUV డిమాండ్‌ భారీగా ఉండటంతో, ₹11–18 లక్షల రేంజ్‌లో Sierra ఒక స్ట్రాంగ్‌ ఆప్షన్‌గా మారే ఛాన్స్‌ స్పష్టంగా కనిపిస్తోంది.

సియెరా పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు, వేరియంట్లు, ధరలు ఇవే:

ఇంజిన్‌

ట్రాన్స్‌మిషన్‌
Smart+ (రూ.లక్షల్లో)
Pure (రూ.లక్షల్లో)
Pure+ (రూ.లక్షల్లో)
Adventure (రూ.లక్షల్లో)
Adventure+ (రూ.లక్షల్లో)
1.5-లీటర్‌ NA పెట్రోల్‌
 
MT
11.49
12.99
14.49
15.29
15.99
1.5-లీటర్‌ NA పెట్రోల్‌
 
DCA
-
14.49
15.99
16.79
-
1.5-Turbo పెట్రోల్‌
 
AT
-
-
-
-
17.99
1.5-Turbo డీజిల్‌
 
MT
12.99
14.49
15.99
16.49
17.19
1.5-Turbo డీజిల్‌
 
AT
-
15.99
17.49
-
18.49

వేరియంట్ల వారీగా ఫీచర్లు:

Smart+... బేసిక్‌, కానీ యూజ్‌ఫుల్‌

ఈ ఎంట్రీ ట్రిమ్‌లోనే చాలా ముఖ్యమైన ఫీచర్లు లభిస్తున్నాయి:

• LED DRLs• LED టెయిల్‌ ల్యాంప్స్‌• పుష్‌-బటన్‌ స్టార్ట్‌• రియర్‌ AC వెంట్స్‌• 17-అంగుళాల వీల్స్‌• నాలుగు డిస్క్‌ బ్రేకులు• ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ + ఆటో హోల్డ్‌

ఈ సెగ్మెంట్‌లో బేస్‌ వేరియంట్‌లో ఇన్ని ఫీచర్లు రావడం ప్రత్యేకమే.

Pure & Pure+.... ఫ్యామిలీలకు బెస్ట్‌ ప్యాకేజీ

ఈ రెండు వేరియంట్‌లలో వచ్చే ఫీచర్లు:• పానోరమిక్‌ సన్‌రూఫ్‌• 10-అంగుళాల టచ్‌స్క్రీన్‌• క్రూయిజ్‌ కంట్రోల్‌• వైర్లెస్‌ Android Auto / Apple CarPlay• ఆటో హెడ్‌ల్యాంప్స్‌• రైన్‌-సెన్సింగ్‌ వైపర్లు• డ్యుయల్‌-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌

ఈ ఫీచర్ల లిస్ట్‌ చూస్తే, Pure+ అనేది మిడ్‌-స్పెక్‌ అయినప్పటికీ ప్రీమియం లాగా కనిపిస్తుంది.

Adventure & Adventure+.... స్టైల్‌ + ఫీచర్లు

• 18-అంగుళాల పెద్ద వీల్స్‌• 360-డిగ్రీ కెమెరా• టెర్రైన్‌ మోడ్స్‌• పెద్ద డిస్‌ప్లే• లెదరెట్‌ ఇంటీరియర్‌• మరిన్ని కన్వీనియెన్స్‌ ఫీచర్లు

ఈ రెండు వేరియంట్‌లు రోడ్‌పై SUV ప్రెజెన్స్‌ పెంచేలా ఉంటాయి.

Accomplished & Accomplished+...  టాప్‌-క్లాస్‌ అనుభవం

టాటా ఇంకా ధర ప్రకటించని రెండు వేరియంట్‌లు ఇవే. పెర్ఫార్మెన్స్‌, ఇంటీరియర్‌, టెక్నాలజీ విషయంలో ఇవే హైయెస్ట్‌ స్పెక్‌లు అవుతాయి.

మూడు శక్తిమంతమైన ఇంజిన్‌ ఆప్షన్‌లు

1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ (160hp) – ఆటోమేటిక్‌

1.5 లీటర్‌ పెట్రోల్‌ (106hp) – మాన్యువల్‌, DCT

1.5 లీటర్‌ డీజిల్‌ (118hp) – మాన్యువల్‌, ఆటోమేటిక్‌

ఈ మూడు పవర్‌ట్రైన్లు ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రోడ్లకు, ముఖ్యంగా హైవే డ్రైవింగ్‌ & సిటీలో రోజువారీ ప్రయాణాలకు బాగా సరిపోతాయి.

వేరియంట్‌ ప్రకారం మారుతున్న రంగులుకొత్త Sierra మొత్తం ఆరు ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్‌లు అందిస్తోంది, అవి:  Pristine White, Pure Grey, Coorg Cloud, Munnar Mist, Bengal Rouge, Andaman Adventure. వేరియంట్‌ను ఆధారంగా ఈ కలర్‌ ఆప్షన్స్‌ మారుతాయి.

టాటా మోటార్స్‌ Sierraను ఖచ్చితంగా ఒక పెద్ద ప్లాన్‌తో తీసుకొచ్చింది. Creta, Seltos, Grand Vitara, Elevate, Taigun, Kushaq వంటి భారీ ప్రత్యర్థులతో నేరుగా పోటీ పడడానికి ఈ SUVని సిద్ధం చేసింది. ధరలు, ఫీచర్లు, ఇంజిన్‌ ఆప్షన్‌లు అన్నీ కలిసి ఈ కారు స్ట్రాంగ్‌ కాంపిటీటర్‌ అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.