Tata Sierra 2025 Launch New Specs: భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఒకప్పుడు తనదైన గుర్తింపు తెచ్చుకున్న టాటా సియెరా, మళ్లీ తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఈ SUVని 2025 చివర్లో లాంచ్‌ చేయబోతోందని టాటా మోటార్స్‌ ఇటీవలే సంకేతాలు ఇచ్చింది. అంటే, దాదాపు 25 ఏళ్ల తర్వాత టాటా బ్రాండ్‌ యొక్క లెజెండరీ SUV కొత్త రూపంలో తిరిగి రంగప్రవేశం చేయబోతోంది.

Continues below advertisement

డిజైన్‌ - క్లాసిక్‌ టచ్‌తో మోడ్రన్‌ లుక్‌

కొత్త టాటా సియెరా డిజైన్‌ చూస్తే, అది పాత సియెరా బాక్సీ లుక్స్‌ని గుర్తు చేస్తూనే, మోడ్రన్‌ SUV స్టైల్‌కి సరిపోయేలా మలిచారు. వెహికల్‌ ముందు భాగంలో బోల్డ్‌ గ్రిల్‌, చతురస్రాకార LED హెడ్‌ల్యాంప్స్‌, అగ్రెసివ్‌ బంపర్‌, భారీ స్కిడ్‌ ప్లేట్‌తో SUV స్పూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. సైడ్‌ ప్రొఫైల్‌లో పెద్ద విండోలు, గ్లాస్‌-బ్లాక్‌ వీల్‌ ఆర్చ్‌లు, ఫ్లష్‌ టైప్‌ డోర్‌ హ్యాండిల్స్‌, డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఉండనున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్‌ LED టెయిల్‌లైట్స్‌, స్మార్ట్‌ స్పాయిలర్‌ డిజైన్‌ SUVకి ఆధునిక లుక్‌ ఇస్తాయి.

Continues below advertisement

EV వెర్షన్‌ మాత్రం కొంచెం డిఫరెంట్‌ ఫీల్‌తో వస్తుంది - ప్రత్యేక అల్లాయ్‌ వీల్స్‌, బ్లూ EV బ్యాడ్జింగ్‌, రివైజ్డ్‌ బంపర్లు ఇవన్నీ కొత్త మోడల్‌ స్పెషల్‌ ఫీచర్లు.

ఫీచర్లు - టెక్నాలజీతో నిండిన ఇంటీరియర్‌

సియెరా ముఖ్యమైన USP (Unique Selling Proposition) దాని ఫీచర్లే. టాటా కార్లలో మొదటిసారిగా ట్రిపుల్‌ స్క్రీన్‌ సెటప్‌తో ఇది రాబోతోంది, అవి - డ్రైవర్‌ డిస్‌ప్లే, సెంట్రల్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, కో-ప్యాసింజర్‌ స్క్రీన్‌. ఇవి చూడగానే ప్రీమియం SUV అనిపించేలా ఉంటుంది. ఇంకా... ఈ కారులో పనోరమిక్‌ సన్‌రూఫ్‌, డ్యూయల్‌ జోన్‌ ఆటో క్లైమేట్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ చార్జర్‌, JBL సౌండ్‌ సిస్టమ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్స్‌ ఉంటాయి. 

EV వెర్షన్‌లో V2L (Vehicle to Load), V2V (Vehicle to Vehicle) ఛార్జింగ్‌ టెక్‌ ఫీచర్లు కూడా ఉంటాయి.

సేఫ్టీ కోణంలో చూస్తే... Level-2 ADAS, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్‌ & రియర్‌ సెన్సర్లు, TPMS, మల్టిపుల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్‌ & పవర్‌ట్రెయిన్‌

సియెరా మూడు రకాల పవర్‌ ట్రెయిన్‌ ఆప్షన్‌లతో రాబోతోంది: 

1.5 లీటర్‌ T-GDI టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ (170PS, 280Nm)

1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ (118PS, 260Nm)

ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ - మల్టిపుల్‌ బ్యాటరీ ప్యాక్‌లతో, దాదాపు 500km రేంజ్‌ అందించే అవకాశం ఉంది.

ట్రాన్స్‌మిషన్‌ విషయానికి వస్తే.., 6-స్పీడ్‌ మాన్యువల్‌, 7-స్పీడ్‌ DCT ఆటోమేటిక్‌ ఆప్షన్‌లు ఉంటాయని అంచనా.

ధర & లాంచ్‌ టైమ్‌

సియెరా లాంచ్‌ 2025 చివరి త్రైమాసికంలో జరుగుతుందని సమాచారం.

ICE వెర్షన్‌ ధర: ₹10.50 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

EV వెర్షన్‌ ధర: ₹25 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉండవచ్చని అంచనా.

టాటా సియెరా తిరిగి రావడం టాటా బ్రాండ్‌కే కాదు, భారత SUV మార్కెట్‌కీ కూడా మైలురాయి. ఇది నాస్టాల్జియా, ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీల్‌ అన్నీ కలిపిన మోడల్‌. 2025 చివర్లో సియెరా రోడ్డెక్కగానే SUV మార్కెట్‌లో ఒక కొత్త తరం పోటీ ప్రారంభమవుతుంది. మీరు క్లాసిక్‌ లుక్‌తో మోడ్రన్‌ SUV కోసం ఎదురు చూస్తుంటే, టాటా సియెరా ఖచ్చితంగా పరిశీలించదగిన ఎంపిక!.