Tata Sierra EV Price And Features: దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఎంతోకాలంగా ఊరిస్తున్న సియెర్రా EVని జూన్ 30, 2026న అధికారికంగా మార్కెట్లోకి తీసుకురానుంది. లాంచ్‌కు ముందు విడుదల చేసిన కొత్త ప్రమోషనల్ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ SUV పూర్తి ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో భారీ చర్చకు కారణమైన సియెర్రా EV... ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లు & శక్తివంతమైన బ్యాటరీ ఆప్షన్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.

Continues below advertisement

ఎక్స్‌టీరియర్‌

సియెర్రా EV డిజైన్ పరంగా పెట్రోల్/డీజిల్ వెర్షన్‌ను పోలి ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ మోడల్‌కు ప్రత్యేకమైన కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ముందుభాగంలో సాధారణ గ్రిల్ స్థానంలో బాడీ కలర్ బ్లాంక్-ఆఫ్ గ్రిల్‌ను అందించారు. LED లైట్ బార్ & హెడ్‌ల్యాంప్ సెటప్ యథాతథంగా ఉంచినప్పటికీ, ICE వెర్షన్‌లో కనిపించే ‘Sierra’ బ్యాడ్జింగ్‌ను తొలగించారు.

Continues below advertisement

ఫ్రంట్ బంపర్‌కు గ్లాస్-బ్లాక్ ఫినిష్ ఇవ్వడంతో పాటు దిగువ భాగంలో ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ను అమర్చారు. సైడ్ ప్రొఫైల్ & వెనుక భాగంలో పెద్దగా మార్పులు లేవు. అయితే, ఫ్రంట్ డోర్లు & టెయిల్‌గేట్‌పై ‘Sierra.ev’ బ్యాడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కూడా కొనసాగించారు. కొత్త సిల్వర్ కలర్ షేడ్‌తో పాటు మరికొన్ని ప్రత్యేక రంగుల్లో ఈ SUV అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇంటీరియర్ 

ఇంటీరియర్ వివరాలను టాటా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే హైయ్యర్ వేరియంట్లలో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లేతో కూడిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉండే అవకాశం ఉంది. లోయర్ వేరియంట్లలో డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో పాటు హెడ్-అప్ డిస్‌ప్లే అందించవచ్చు.

అంతేకాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ & పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ వంటి ఫీచర్లు కూడా లభించే అవకాశముంది. దీంతో సియెర్రా EV ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించనుంది.

ఇంజిన్‌

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, టాటా హారియర్ EVలో కనిపించే అనేక అంశాలను సియెర్రా EVలోనూ చూసే అవకాశం ఉంది. కంపెనీకి చెందిన acti.ev+ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ SUVలో 65kWh & 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. టాప్ వేరియంట్‌లో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వ్యవస్థను అందించనున్నట్లు టాటా ఇప్పటికే ధృవీకరించింది. ఇతర వేరియంట్లు రియర్-వీల్ డ్రైవ్ (RWD) కాన్ఫిగరేషన్‌తో రానున్నాయి.

హారియర్ EV గరిష్టంగా 627 కి.మీ. రేంజ్ అందిస్తుండగా, సియెర్రా EV పరిమాణం & బరువు తక్కువగా ఉండటంతో మరింత మెరుగైన రేంజ్‌ను అందించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ధరలు

ఎక్స్‌షోరూమ్ ధర రూ.18.49 లక్షల నుంచి రూ.23.49 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర సుమారు రూ.19.57 లక్షల నుంచి రూ.24.94 లక్షల వరకు ఉండవచ్చు. RWD 65kWh వేరియంట్ ధర రూ.19.61 లక్షలు, RWD 75kWh వేరియంట్ ధర రూ.22.36 లక్షలు & AWD 75kWh వేరియంట్ ధర రూ.25.02 లక్షల వరకు ఉండే అవకాశముంది.

టాటా EV పోర్ట్‌ఫోలియోలో Curvv EV & Harrier EV మధ్య స్థానాన్ని దక్కించుకోనున్న సియెర్రా EV, మార్కెట్లో MahindraBE 6, Hyundai Creta Electric, MG ZS EV & Maruti e Vitaraకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఆధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్ & లాంగ్‌ రేంజ్ కలయికతో ఈ SUV భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో కీలక మోడల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.