Tata Sierra కారు లాంచింగ్ నుండి ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనంగా మారింది. మార్కెట్లోకి రాకముందే ఈ కారుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆకర్షణీయమైన డిజైన్, సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు, శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ కారణంగా ఈ టాటా సియెర్రా SUV కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అయితే, దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 11.49 లక్షలుగా ఉంది.  వాస్తవానికి కారు కొనేటప్పుడు RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలను జోడించిన తర్వాత ఆన్-రోడ్ ధర చాలా పెరుగుతుంది. అయితే మీరు Tata Sierra Diesel ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. ఫైనాన్స్ విషయాలు, EMI, డౌన్ పేమెంట్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Continues below advertisement

ఎంట్రీ లెవెల్ వేరియంట్ EMI

Tata Sierra కు చెందిన Smart Plus Diesel వేరియంట్ దాని బేస్ మోడల్. ఆ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 15,34,926 అవుతుంది. మీరు ఇందులో మొత్తం డబ్బులు కట్టనక్కర్లేదు. ప్రస్తుతం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తాన్ని 5 సంవత్సరాలకు 10 శాతం వడ్డీ రేటుతో కారు లోన్ తీసుకుంటే, మీ నెలవారీ EMI దాదాపు రూ. 32,613 అవుతుంది.

Pure Diesel వేరియంట్ ఫైనాన్స్ వివరాలు

Pure Diesel వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.49 లక్షలు కాగా, ఢిల్లీలో దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 17,10,696గా ఉంది. ఈ కారు కోసం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత, 5 సంవత్సరాల కారు లోన్ 10 శాతం వడ్డీతో తీసుకుంటే, దీని EMI నెలకు దాదాపు రూ. 36,347 అవుతుంది.

Continues below advertisement

ఆటోమేటిక్ వేరియంట్ EMI

మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తీసుకోవాలని భావిస్తున్నారా, అయితే టాటా సియోర్రా Pure Diesel AT మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 18,86,467గా ఉంది. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి, 5 సంవత్సరాల కారు లోన్ తీసుకున్నట్లయితే, ఈ వేరియంట్ EMI నెలకు దాదాపు రూ. 40,082 అవుతుంది.

Pure Plus Diesel కారు, అడ్వెంచర్ డీజిల్ కారు ఫైనాన్స్ వివరాలు

Pure Plus Diesel (మాన్యువల్) కారు ఆన్-రోడ్ ధర కూడా దాదాపు రూ. 18,86,467 (18 లక్షల 86 వేల 4 వందల అరవై ఏడు రూపాయలు)గా ఉంది. ఈ కారు ప్రతినెలా EMI కూడా దాదాపు 40,082 అవుతుంది. టాప్ వేరియంట్ Adventure Diesel ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 19,45,057గా ఉంది. ఈ కారును 5 సంవత్సరాల కారు లోన్ 10 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే కనుక, మీ EMI నెలకు దాదాపు రూ. 41,327 అవుతుంది.