Tata Sierra vs Hyundai Creta vs Kia Seltos: 2025లో భారత మార్కెట్లో విడుదల కానున్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న SUVలలో ఒకటి టాటా సియెర్రా. ఆటో మొబైల్ రంగంలో ఈ కారు కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పుడు టాటా సియెర్రా కారు విడుదల కావడంతో హ్యుందాయ్, కియా కంపెనీలు కాస్త ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఈ కారు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos) లకు మార్కెట్లో గట్టి పోటీనిస్తుంది.
Sierra, Creta లేదా Seltos, ఏ కారు బెటర్
టాటా సియెర్రా రెట్రో డిజైన్‌లో ఆధునిక ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది. టాటా ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలకు ప్రారంభమవుతుంది. దీని ఇతర వేరియంట్‌ల ధర గురించి అంతగా సమాచారం రాలేదు. హ్యుందాయ్ క్రెటా ఒక అద్భుతమైన కాంపాక్ట్ SUVగా నిలవనుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.73 లక్షలకు ప్రారంభమై గరిష్టంగా రూ. 20.20 లక్షల వరకు ఉంటుంది. కియా సెల్టోస్ కూడా ఇదే ధర రేంజ్‌లో అందుబాటులో ఉంది. కియా ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.79 లక్షలకు ప్రారంభం కాగా, రూ. 19.81 లక్షల వరకు ఉంటుంది.
- హ్యుందాయ్ క్రెటాతో పోలిస్తే టాటా సియెర్రా పొడవైన కారు. అయితే కియా సెల్టోస్ ఈ మూడింటిలోనూ అతిపెద్ద కారు.
- టాటా సియెర్రా ఈ విభాగంలో అత్యంత వెడల్పుతో పాటు ఎత్తైన కారుగా నిలిచింది.
- టాటా సియెర్రాలో అత్యధిక వీల్‌బేస్ లభిస్తుంది. ఈ కారులో స్థలం కూడా ఎక్కువ వస్తుంది. ఇది క్యాబిన్ స్పేస్‌లో మీకు లభిస్తుంది.
- SUVల ఈ విభాగంలో దాదాపు 400-500 లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది. కానీ టాటా సియెర్రా 622 లీటర్ల బూట్ స్పేస్‌తో ఎక్కువ విశాలంగా ఉంటుంది.
టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లను పరిశీలిస్తే, టాటా SUV ఎక్కువ స్థలంతో వచ్చింది. ఈ కారులో లభించే బూట్ స్పేస్ ఈ కారును విభాగంలో అగ్రస్థానంలో నిలబెడుతుంది. అయితే, ఇంత కాలం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ప్రజల ఆధరణ పొంది మార్కెట్లో నిలదొక్కుకున్నాయి. టాటా కారుపై కూడా ప్రజలు నమ్మకం ఉంచుతారు. కనుక టాటా నుంచి ఏదైనా ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే ఇతర కంపెనీలకు పోటీ తప్పదనేది వాస్తవం.
Also Read: టాటా సియెర్రా vs మారుతి గ్రాండ్ విటారా: రెండు SUVల్లో ఏ కారు ఇంజిన్ బలమైంది? తేడాలు చూడండి