Tata Punch Turbo Vs Citroen C3 Turbo Comparison: మైక్రో SUV సెగ్మెంట్‌లో టాటా పంచ్‌ ఇప్పటికే మంచి పేరు సంపాదించుకుంది. అయితే, 2021లో లాంచ్‌ అయినప్పటి నుంచి టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ లేకపోవడం ఒక పెద్ద లోటుగా మారింది. ఈ లోటును టాటా 2026 ఫేస్‌లిఫ్ట్‌తో భర్తీ చేస్తోంది. ఇప్పుడు టర్బో ఇంజిన్‌తో వస్తున్న 2026 టాటా పంచ్‌, 2022 నుంచే టర్బో ఆప్షన్‌ అందిస్తున్న Citroen C3తో నేరుగా పోటీపడుతోంది. మనం ఈ రెండు కార్ల టాప్‌ టర్బో వేరియంట్ల మధ్య పోలికలు, తేడాలను అర్ధం చేసుకుందాం.

Continues below advertisement

టాప్‌ టర్బో వేరియంట్లు

Tata Punch: Accomplished+ S

Continues below advertisement

Citroen C3: Shine (C3X)

ఇంజిన్‌ & పనితీరు పోలిక

SUV
Punch
C3X
ట్రిమ్‌
 
Accomplished+ S
Shine
ఇంజిన్‌
 
3 cyls, 1.2-litre
3 cyls, 1.2-litre
పవర్‌
 
120hp at 5500rpm
110hp at 5500rpm
టార్క్‌
 
170Nm at 1750-4000rpm
190Nm (MT)/205Nm (AT) at 1750rpm
గేర్‌ బాక్స్‌
 
6-speed manual
6-speed manual/6-speed torque-converter automatic
0-100kph వేగం (కంపెనీ డేటా)
 
11.1 seconds
Under 10 seconds

టాటా పంచ్‌ టర్బో ఇంజిన్‌ 120hp పవర్‌ అందిస్తుంది. ఇది Citroen C3 కంటే సుమారు 10hp ఎక్కువ. అయితే, టార్క్‌ విషయంలో C3 ముందంజలో ఉంది. Citroen C3 టర్బోలో మాన్యువల్‌, ఆటోమేటిక్‌ రెండింట్లోనూ పంచ్‌ కంటే 20Nm నుంచి 35Nm వరకు ఎక్కువ టార్క్‌ లభిస్తుంది.

ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ Citroen C3లో మాత్రమే అందుబాటులో ఉంది. అదీ సాధారణ AMT కాదు, పక్కా 'టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌'. పంచ్‌లో మాత్రం టర్బో వేరియంట్‌కు ఆటోమేటిక్‌ ఆప్షన్‌ లేదు. రెండూ దాదాపు ఒకే RPM వద్ద పీక్‌ పవర్‌, టార్క్‌ను ఇస్తాయి.

ఫీచర్లు

ఫీచర్ల విషయంలో టాటా పంచ్‌ స్పష్టమైన ఆధిక్యం చూపిస్తుంది. పంచ్‌లో సన్‌రూఫ్‌, ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. Citroen C3లో ఇవి లేవు. ఇంటీరియర్‌లో కూడా పంచ్‌ మరింత ప్రాక్టికల్‌గా ఉంటుంది. పంచ్‌లో ఉన్న డ్రైవ్‌ మోడ్స్‌, రియర్‌ ఏసీ వెంట్స్‌, సెంటర్‌ ఆర్మ్‌రెస్ట్‌, అడ్జస్టబుల్‌ రియర్‌ హెడ్‌రెస్ట్స్‌, లాంటివి C3లో అందుబాటులో లేవు. 

రెండు కార్లలోనూ...

10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌

7 అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లే

ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌

క్రూయిజ్‌ కంట్రోల్‌

వైర్‌లెస్‌ ఛార్జర్‌

వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.

భద్రత

భద్రత విషయంలో రెండు కార్ల మధ్య పెద్ద తేడా లేదు. అయితే, Citroen C3లో 360 డిగ్రీ కెమెరా ఆప్షనల్‌గా రూ.25,000 అదనపు ధరకు మాత్రమే లభిస్తుంది. హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ కూడా ఆటోమేటిక్‌ వేరియంట్‌కే పరిమితం.

SUV
Punch
C3X
Airbags
 
6
6
360-డిగ్రీల కెమెరా
 
ఉంది
ఆప్షనల్‌ (రూ.25,000)
హిల్-హోల్డ్ అసిస్ట్
 
ఉంది
ఆటోమేటిక్ ట్రిమ్ మాత్రమే
టైర్ ప్రెజర్ మానిటరింగ్‌ సిస్టమ్‌
 
ఉంది
ఉంది
బ్రేకులు (ముందు/వెనుక)
 
డిస్క్/డ్రమ్
డిస్క్/డ్రమ్
ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు
 
ఉంది
ఉంది
EBDతో కూడిన ABS
 
ఉంది
ఉంది

ధరలు

ధరల విషయంలో Citroen C3 స్పష్టంగా పైచేయి సాధిస్తుంది.

Tata Punch Accomplished+ S (MT): సుమారు రూ.9.8 లక్షలు

Citroen C3 Shine (MT): సుమారు రూ.8.74 లక్షలు

అంటే, C3 సుమారు రూ.1.06 లక్షలు తక్కువ. ఆటోమేటిక్‌ వేరియంట్‌లో కూడా పంచ్‌ కంటే తక్కువ ధరకే C3 లభిస్తుంది.

డ్రైవింగ్‌ అనుభవం విషయానికి వస్తే, C3 టర్బో మరింత స్పోర్టీగా అనిపిస్తుంది. కంపెనీ చెబుతున్న ప్రకారం 0 నుంచి 100 kmph వేగాన్ని 10 సెకన్ల లోపు చేరుకుంటుంది. కంఫర్ట్‌ పరంగా కూడా C3 కొంచెం మెరుగ్గా ఉంటుంది.

ఏది బెస్ట్‌?

ఫీచర్లు ఎక్కువగా కావాలంటే Tata Punch సరైన ఎంపిక. పనితీరు, కంఫర్ట్‌, ఆటోమేటిక్‌ ఆప్షన్‌, తక్కువ ధర కావాలంటే Citroen C3 టర్బో స్పష్టంగా ఎక్కువ విలువ ఇస్తుంది. మొత్తం మీద, ఈ పోలికలో Citroen C3 మరింత బ్యాలెన్స్‌డ్‌ ప్యాకేజ్‌గా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.