Tata Punch GST 2025 Price Drop: ఈ దీపావళికి, "చీప్‌ & బెస్ట్‌"లో ఒక మంచి కారు కొనాలని ఆలోచిస్తుంటే, టాటా పంచ్ గురించి మీరు ఒకసారి ఆలోచించవచ్చు. వాస్తవానికి, టాటా పంచ్‌ కొనడానికి ఇది ఒక మంచి అవకాశం. ఆంధ్ర & తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఈ కాంపాక్ట్ SUV, టాటా పంచ్ ఇప్పుడు ఇంకా చవకగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో, గతంలో దీని ఎక్స్-షోరూమ్ ధర ₹5,99,990. కానీ ఇప్పుడు, GST 2.0 అమలుతో, కంపెనీ ఆ ధరను ₹5,49,990 కి తగ్గించింది. దీని అర్థం, ఈ కారు కొనే కస్టమర్లకు ఇప్పుడు ఒకేసారి ₹50,000 మిగులుతుంది, దీపావళి మరింత వెలుగులు విరజిమ్ముతుంది.

Continues below advertisement

ఫీచర్లు & ఇంటీరియర్ ఎలా ఉన్నాయి? కొత్త టాటా పంచ్ 2025 లోపలి భాగాన్ని ఇంకా ప్రీమియంగా తీర్చిదిద్దారు. లెదర్‌తో చుట్టిన టు-స్పోక్ స్టీరింగ్ వీల్‌ ఇచ్చారు. ప్రకాశవంతమైన టాటా లోగో అమర్చారు. పెద్ద 10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోకు మద్దతు ఇస్తుంది. డ్రైవర్ కోసం 7-అంగుళాల డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంది.

టాటా పంచ్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు & క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్ & కీలెస్ ఎంట్రీ వంటివి ఈ కారు డ్రైవింగ్‌ సౌలభ్యాన్ని పెంచుతాయి. టాప్-ఎండ్ వేరియంట్‌లలో టచ్-అండ్-టోగుల్ ఆడియో కంట్రోల్స్‌ & కనెక్టెడ్‌ కార్ టెక్నాలజీ కూడా ఉంటాయి.

Continues below advertisement

టాటా పంచ్ ఎంత సురక్షితం? టాటా పంచ్ గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందింది, తద్వారా ఇది తన విభాగంలో అత్యంత సురక్షితమైన వాహనాలలో ఒకటిగా నిలిచింది. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌లో ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS & EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌, రియర్ పార్కింగ్ సెన్సార్లు & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. 

టాటా పంచ్ ఇంజిన్ & మైలేజ్కొత్త టాటా పంచ్ 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 87 bhp & 115 Nm టార్క్ ఇస్తుంది. దీని CNG వేరియంట్ 72 bhp & 103 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. ఈ కారు మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 20.09 kmpl మైలేజీని అందిస్తుంది, CNG వేరియంట్ 26.99 km/kg ఆకట్టుకునే మైలేజీని అందిస్తుంది.

ప్రత్యర్థి కార్లు ఎంత చౌకగా మారాయి? టాటా పంచ్‌కు సమీప ప్రత్యర్థి కార్లు - Hyundai Exter & Maruti Suzuki Ignis. ఇంకా, ఈ SUV Tata Altroz, Tata Tiago & Renault Kiger తో కూడా పోటీ పడుతుంది. ఇటీవలి GST తగ్గింపు తర్వాత హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర ₹31,000 నుంచి ₹86,000 వరకు తగ్గింది. మారుతి ఇగ్నిస్ ధర ₹50,000 నుంచి ₹70,000 వరకు దిగి వచ్చింది. అంటే.. ప్రస్తుతం కస్టమర్‌లు ఎంచుకోవడానికి బోలెడన్ని వాహనాలు అందుబాటు ధరలో & ఫుల్‌ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.