భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గత నాలుగైదు ఏళ్లలో ఈవీ క్రేజ్ పెట్రోల్, డీజిల్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆటోమొబైల్ కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. టాటా మోటార్స్ కూడా ఈ విభాగంలో మరింత ముందుకు దూసుకెళ్లే కంపెనీగా మారుతోంది. టాటా మోటార్స్ కంపెనీ ఫిబ్రవరి 2026లో Tata Punch EV Faceliftని భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ డెలివరీ కూడా ప్రారంభించించింది. ఈ ఎలక్ట్రిక్ SUV దాని పవర్‌ఫుల్ ఫీచర్లు, మంచి రేంజ్, బడ్జెట్ ధర కారణంగా వాహనదారులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా, ఈ కారు పలు విషయాల్లో MG Comet EVకి నేరుగా పోటీనిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ డిజైన్, ఫీచర్లు
కొత్త Tata Punch EV Faceliftలో పలు మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. టాటా కంపెనీ ఇందులో LED హెడ్‌లైట్‌లు, వెనుక కనెక్ట్ చేసిన LED టైల్‌లైట్‌లను అందించింది. ఇది పంచ్ ఫేస్‌లిఫ్ట్ లుక్ మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. దీనితో పాటు, కొత్త డిజైన్ కలిగిన 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఇచ్చారు. ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. మోడ్రన్ కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది. దీంతో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇచ్చారు. సౌకర్యం కోసం ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఆటో డిమ్మింగ్ IRVM, సింగిల్ సన్‌రూఫ్ వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి.
బ్యాటరీ, మోటార్, డ్రైవింగ్ పరిధి
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) రెండు బ్యాటరీ ఎంపికలతో తీసుకొచ్చారు. ఇందులో 30 kWh, 40 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఈ బ్యాటరీ ఎంపికలతో ఈ SUV గరిష్టంగా దాదాపు 468 కిలోమీటర్ల వరకు జర్నీ రేంజ్ అందిస్తుంది. ఇందులో ఇచ్చిన ఎలక్ట్రిక్ మోటార్ దాదాపు 82-95 kW వరకు ఎనర్జీ జనరేట్ చేస్తుంది. సిటీ రోడ్లపై డ్రైవింగ్‌ను మరింత తేలిక చేస్తుంది. కంపెనీ ఇందులో రీజెనరేషన్ మోడ్‌ను కూడా అందించింది. ఇది బ్రేక్ వేసినప్పుడు బ్యాటరీని కొద్దిగా ఛార్జ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనితో పాటు, వివిధ డ్రైవింగ్ మోడ్‌లు కూడా ఇచ్చారు.
Tata Punch EV Facelift ధర
Tata Punch EV Facelift ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర దాదాపు 9.69 లక్షలుగా ఉంది. అదే సమయంలో, దాని టాప్ వేరియంట్ దాదాపు 12.59 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద లభిస్తుంది. కంపెనీ దీనిని BaaS అంటే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్‌తో కూడా అందిస్తోంది. ఈ ఆప్షన్ కింద కారు ప్రారంభ ధర దాదాపు 6.49 లక్షల వరకు దిగొస్తుంది. ప్రస్తుతం ఇది చాలా మంది కస్టమర్‌లకు మరింత బడ్జెట్ ధర సౌకర్యం కల్పిస్తుంది.
