Tata Punch CNG Price, Down Payment, Loan and EMI Details: స్టైలిష్ లుక్స్‌తో పాటు మంచి మైలేజీని ఇచ్చే SUV కావాలంటే, టాటా పంచ్ CNG గురించి మీరు తెలుసుకోవాలి. 2025 టాటా పంచ్ CNG బాహ్య రూపం స్పోర్టీ LED DRLsతో, బోల్డ్ రోన్స్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్ కారణంగా చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. మాస్క్ రూపంలో అందించే డ్యూయల్-టోన్ టాప్ & బ్లాక్ పేంటెడ్ A‑పిల్లర్స్ కారు అందానికి ప్రీమియం టచ్ ఇచ్చాయి. షార్ప్ బంపర్లు, డైమండ్‑కట్ అలాయ్ వీల్స్, పెట్ స్టాన్స్‌తో పంచ్ నిజంగా ఒక మినీ SUV లా కనిపిస్తుంది. అగ్రెసివ్ హెక్క్స్, LED హెడ్ ల్యాంప్స్ మోడరన్ టచ్‌తో ఈ కార్ మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటుంది.
టాటా పంచ్ CNGలో "Pure iCNG వేరియంట్"ను హైదరాబాద్ మార్కెట్లో రూ. 7.30 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు (Tata Punch CNG ex-showroom price, Hyderabad) కొనుగోలు చేయవచ్చు. RTO ఫీజ్ దాదాపు రూ. 1.04 లక్షలు & బీమా దాదాపు రూ. 38,000 ఇతర ఖర్చులు కలుపుకుని, ఈ కారు రోడ్డు మీదకు రావాలంటే దాదాపు (Tata Punch CNG on-road price, Hyderabad) రూ. 8.72 లక్షలు అవుతుంది.
విజయవాడలో, ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.30 లక్షలు (Tata Punch CNG price in Vijayawada) కాగా; అన్ని ఫీజ్‌లు, పన్నులు కలుపుకుని ఆన్-రోడ్ ధర రూ. రూ. 8.75 లక్షలు అవుతుంది.
టాటా పంచ్ EMI ఆప్షన్స్‌హైదరాబాద్‌లో, టాటా పంచ్ బేస్ వేరియంట్ కొనడానికి మీ దగ్గర కేవలం రూ. 1.50 లక్షలు ఉంటే చాలు. ఈ లక్షన్నర రూపాయలను టాటా షోరూమ్‌లో డౌన్ పేమెంట్ చేయండి. మిగిలిన రూ. 7.22 లక్షలకు కారు లోన్ వస్తుంది. ఈ మొత్తాన్ని మీరు 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో తీసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు జీతంలో ఎంత EMI కట్ అవుతుందో లెక్క చూద్దాం.
7 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలని మీరు భావిస్తే, మీ జీతం నుంచి నెలకు రూ. 11,616 EMI కట్ అవుతుంది.
6 సంవత్సరాల లోన్ టెన్యూనర్ ఎంచుకుంటే, మీ జీతం నుంచి నెలకు రూ. 13,014 EMI చెల్లించాలి.
5 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయదలుచుకుంటే, మీ జీతం నుంచి నెలకు రూ. 14,988 EMI బ్యాంక్‌కు జమ చేయాలి.
4 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలని ప్లాన్ చేస్తే, మీ జీతం నుంచి నెలకు రూ. 17,967 EMI బ్యాంక్‌కు చెల్లించాలి.
బ్యాంక్ ఇచ్చే రుణం, వసూలు చేసే వడ్డీ రేటు పూర్తిగా మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ విధానంపై ఆధారపడి మారతాయి. మీరు ఎంత ఎక్కువ మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేయగలిగితే, మీ వడ్డీ మొత్తం అంత తగ్గుతుంది.
మోడరన్ ఫీచర్లుటాటా పంచ్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అనేక మోడరన్ ఫీచర్లు ఉన్నాయి. బలమైన బాడీ, అట్రాక్టివ్ డిజైన్ ఈ కారు సొంతం. కారు లోపల తగినంత స్థలం, భద్రత కోసం అధిక-ప్రామాణిక ఫీచర్లు కూడా ఉన్నాయి.
మైలేజీటాటా పంచ్ 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 6000 RPM వద్ద 86 PS పవర్‌ను & 3300 RPM వద్ద 113 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇది ప్రామాణికంగా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కంపెనీ వెల్లడించిన ప్రకారం, టాటా పంచ్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 18.97 kmpl మైలేజ్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 18.82 kmpl మైలేజ్ ఇస్తుంది.