Tata Nexon vs Mahindra XUV 3XO Mileage Comparison: కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో డీజిల్ వేరియంట్ కొనాలనుకునేవారికి ప్రస్తుతం రెండు పెద్ద ఆప్షన్‌లు కనిపిస్తున్నాయి, అవి - టాటా నెక్సాన్ & మహీంద్రా XUV 3XO. ఈ రెండూ దేశీయ బ్రాండ్లు, రెండింటికీ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది, అలాగే 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే... రోజువారీ వాడకంలో ఏ బండిది మంచి మైలేజ్?
ఇంజిన్ పనితీరు & పవర్‌మహీంద్రా XUV 3XO డీజిల్ ఇంజిన్ 115hp పవర్ & 300Nm టార్క్‌ను ఇస్తుంది. టాటా నెక్సాన్ డీజిల్ 113hp పవర్, 260Nm టార్క్ అందిస్తుంది. XUV 3XOకి 2hp పవర్ & 40Nm టార్క్ అదనంగా ఉన్నా, దాని బరువు నెక్సాన్ కంటే 112 కిలోలు ఎక్కువ. ఈ బరువు కారణంగా, నెక్సాన్ 0-100 కి.మీ./గం యాక్సిలరేషన్ టెస్ట్‌లో XUV 3XO కంటే వేగంగా దూసుకెళ్లింది, దాని కంటే ముందే 100 కి.మీ./గం వేగాన్ని అందుకుంది.
ట్యాంక్ కెపాసిటీ & ARAI మైలేజ్‌టాటా నెక్సాన్ డీజిల్‌కి 44 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉండగా, మహీంద్రా XUV 3XO డీజిల్‌లో 42 లీటర్ల ట్యాంక్ ఉంది. అదనంగా, ARAI సర్టిఫైడ్ ఫ్యూయల్ ఎఫిషెన్సీలో నెక్సాన్‌కి 2.63 kmpl మైలేజ్ అధికంగా ఉంది. అంటే, ట్యాంక్ ఫుల్‌గా నిండితే XUV 3XO కంటే Nexon కొంచెం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.
సిటీ & హైవే టెస్ట్ రిజల్ట్స్‌ఎక్స్‌పర్ట్ టీమ్ నిర్వహించిన రియల్ వరల్డ్ టెస్ట్‌లలో, టాటా నెక్సాన్ డీజిల్ సిటీలో లీటరుకు సుమారు 3 km ఎక్కువ మైలేజ్ ఇచ్చింది. హైవేలో కూడా 2 km తేడా కనిపించింది. మొత్తంగా, నెక్సాన్‌కి సగటు రియల్ వరల్డ్ మైలేజ్ XUV 3XO కంటే లీటరుకు 2.5 km ఎక్కువగా రికార్డు అయింది. అంటే, ఒక పూర్తి ట్యాంక్‌తో XUV 3XO కంటే నెక్సాన్ దాదాపు 141 కి.మీ. ఎక్కువ దూరం వెళ్లగలదు.
టెస్ట్ నియమాలుఎక్స్‌పర్ట్ టీమ్ ఈ టెస్ట్‌ను నవీ ముంబయి పరిసరాల్లో నిర్వహించింది. ప్రతి వాహనం ట్యాంక్‌ను ఫుల్ చేసిన తర్వాత సిటీ & హైవే రూట్‌లలో డ్రైవ్ చేశారు. టైర్ ప్రెషర్‌ను కార్ కంపెనీ సిఫారసుల ప్రకారం సెట్ చేశారు. ఏసీ, ఆడియో సిస్టమ్, లైటింగ్ వంటివి సాధారణ వాడకం మాదిరిగానే ఉపయోగించారు. డ్రైవర్‌లను మారుస్తూ టెస్ట్‌ను నిష్పక్షపాతంగా చేశారు. ప్రతి లూప్ పూర్తయ్యాక ట్యాంక్ మళ్లీ నింపి, ఖచ్చితమైన మైలేజ్ లెక్కించారు.
ధరలుధరల విషయానికి వస్తే, రెండు SUVs కూడా దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో Mahindra XUV 3XO డీజిల్ వేరియంట్ ధరలు ₹8.95 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. Tata Nexon డీజిల్ వేరియంట్ ధరలు ₹9.01 లక్షల నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే, XUV 3XO రేటు నెక్సాన్ కంటే సుమారు ₹6,000 తక్కువలోనే మొదలవుతుంది. డీజిల్‌లో టాప్ వేరియంట్ నెక్సాన్ కంటే ₹1,000 తక్కువ ధరతో అందుబాటులో ఉంది.
సమగ్రంగా చూస్తే, టాటా నెక్సాన్ డీజిల్ నిజ జీవిత మైలేజ్‌లో స్పష్టమైన ఆధిక్యం చూపింది. బెటర్ ఎఫిషెన్సీ, పెద్ద ట్యాంక్, తక్కువ బరువు వంటి అంశాలు నెక్సాన్‌ను ఈ పోటీలో ముందుంచాయి. మహీంద్రా XUV 3XO అయితే, పవర్ ఎక్కువ ఉన్నప్పటికీ, రియల్ వరల్డ్ ఎఫిషెన్సీలో కొద్దిగా వెనకబడింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.