Tata Nexon Price, Mileage And Features Telugu: ఒకే కారు.. నాలుగు ఆప్షన్లు - అదే టాటా నెక్సాన్‌. ఈ మోడల్‌లో పెట్రోల్, డీజిల్, CNG, EV వేరియంట్లు ఉన్నాయి. డిజైన్, స్పేస్‌, ప్రాక్టికాలిటీ, భద్రత, ఫీచర్లలో పెద్దగా తేడా ఉండదు. కానీ ఇంజిన్, పనితీరు, మైలేజీ, ప్రయాణ ఖర్చులో మాత్రం భారీ తేడా ఉంటుంది. అందుకే మీ అవసరానికి ఏ నెక్సాన్ సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యం. 

Continues below advertisement

పెట్రోల్ వేరియంట్‌ 1.2 లీటర్ మూడు సిలిండర్ టర్బో ఇంజిన్ 120hp శక్తి, 170Nm టార్క్ ఇస్తుంది. ఐదు స్పీడ్, ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్సులతో పాటు 6-స్పీడ్ AMT, 7-స్పీడ్ DCA ఆప్షన్లు ఉన్నాయి. ధర రూ.7.40 లక్షల నుంచి రూ.13.90 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్ వేరియంట్లలో 7-స్పీడ్ DCA ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, నిపుణులు చేసిన వాస్తవ ట్రాఫిక్‌ పరీక్షల్లో, ఈ కారు నగరంలో 7.7 కిలోమీటర్లు, హైవేపై 13.9 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చింది. ఒక్కో లీటరుకు అయ్యే ప్రయాణ ఖర్చును బట్టి, ఈ లైనప్‌లో ఇదే ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంది.

డీజిల్ వేరియంట్‌ 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. పవర్‌ట్రెయిన్‌లో టార్క్ బలంగా ఉంటుంది. హైవే ప్రయాణాలకు ఇది మంచి ఎంపిక. అయితే రిఫైన్‌మెంట్ విషయంలో పెట్రోల్ కంటే వెనుకబడి ఉంటుంది. రియల్‌ వరల్డ్‌ టెస్ట్‌లో డీజిల్ మాన్యువల్ 17.95 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చింది. కిలోమీటర్‌కు సుమారు రూ.5.30 ఖర్చు వచ్చింది. ఏడాదికి ఎక్కువ దూరం ప్రయాణించేవారికి డీజిల్ సరైన ఎంపికగా చెప్పొచ్చు. 

Continues below advertisement

EV వేరియంట్‌ నెక్సాన్ EVలో 30 కిలోవాట్ అవర్, 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 30kWh వెర్షన్ వాస్తవ వినియోగంలో 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుంది. 45kWh వెర్షన్ సుమారు 350 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. శబ్దం తక్కువ. పికప్ కూడా వేగంగా ఉంటుంది. ఇంట్లో ఛార్జింగ్ చేస్తే కిలోమీటర్‌కు సుమారు రూ.1.03 మాత్రమే ఖర్చవుతుంది. 45kWh వెర్షన్‌ను 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 29 నిమిషాలు పడుతుంది. 

ఇది కూడా చదవండి: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!

CNG వేరియంట్‌ ఈ లైనప్‌లో ఇదే బాగా బ్యాలెన్స్ అయిన ఆప్షన్‌గా కనిపిస్తుంది. పెట్రోల్‌లో ఉన్న 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో ఇంజిన్‌నే ఇందులోనూ ఉపయోగించారు.ఈ వేరియంట్‌ 100hp, 170Nm టార్క్ ఇస్తుంది. నిజ జీవిత ట్రాఫిక్‌లో.. నగరంలో 15.1 కిలోమీటర్లు, హైవేపై దాదాపు 24 కిలోమీటర్లు మైలేజీ ఇచ్చింది. కిలోమీటర్‌కు సుమారు రూ.4.28 ఖర్చవుతుంది. పెట్రోల్‌ వేరియంట్‌ తరహా డ్రైవింగ్, తక్కువ ప్రయాణ ఖర్చు, మంచి రేంజ్ దీని ప్రధాన బలాలు. అయితే CNG స్టేషన్లు అందుబాటులో లేకపోవడం, కొన్నిచోట్ల ఎక్కువ సమయం క్యూలో నిలబడాల్సి రావడం ఇబ్బంది. 

ఏది మీకు సరైనది?తక్కువ ప్రారంభ ధర & ఎక్కువ గేర్‌బాక్స్ ఎంపికలు కావాలంటే పెట్రోల్ వేరియంట్‌; ఏడాదిలో ఎక్కువ ప్రయాణం, హైవే వినియోగం ఉంటే డీజిల్ వేరియంట్‌; ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉండి, ఎక్కువగా నగరంలో నడిపితే EV వేరియంట్‌; తక్కువ ఖర్చుతో పెట్రోల్‌ లాంటి డ్రైవింగ్ కావాలంటే CNG వేరియంట్‌ అనువుగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ కొనబోతున్నారా? కొత్త ధరలు వచ్చేశాయ్.. ఏ వేరియంట్ ఎంతంటే?

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.