టాటా మోటార్స్ కొత్త Nexon EV జెట్ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. Nexon EV PRIME Jet Edition రూ.17.50 లక్షలకు (ఎక్స్-షోరూమ్) విడుదల చేస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. Nexon EV Max Jet Edition ధర రూ. 19.54 లక్షలుగా (ఎక్స్-షోరూమ్)  కంపెనీ నిర్ణయించింది. సఫారి, నెక్సాన్ , హారియర్ SUVల యొక్క JET ఎడిషన్‌లు కాకుండా ఆటోమేకర్ ప్రకటించిన కొన్ని ప్రత్యేక ఎడిషన్ కార్లలో ఇది ఒకటి. ఈ స్పెషల్ JET ఎడిషన్ Nexon EV MAXతో పాటు  Nexon EV PRIME వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.


డిజైన్ ఎలా ఉందంటే?


ఈ సరికొత్త Nexon EV ఇతర SUVల మాదిరిగానే JET ఎడిషన్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. బయట, ప్లాటినం రూఫ్‌తో పాటు కాంస్యంతో కూడిన ప్రత్యేకమైన స్టార్‌ లైట్ కలర్ ను కలిగి ఉంటుంది. ఇది జెట్-బ్లాక్ అల్లాయ్ వీల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లను కలిగి ఉంటుంది. SUVకి  ప్రీమియం రూపాన్ని కలిగించడంలో ఇవన్నీ ఉపయోగపడుతాయి.


ఫీచర్లు ఇవే..


లోపలి భాగంలో, కారు డ్యూయల్-టోన్ ఆయిస్టర్ వైట్,  గ్రానైట్ బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ముందు హెడ్‌ రెస్ట్‌లలో బ్రాంజ్ ప్యాట్రాన్ ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్, AQI డిస్‌ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్ తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఈ మోడల్ లో ముఖ్యమైన ఫీచర్లుగా చెప్పుకోవచ్చు.


ప్రత్యేకతలు


మెకానికల్ గా, నెక్సాన్ EV ప్రైమ్ ట్రిమ్‌ లో 127బిహెచ్‌పి, 245ఎన్ఎమ్ టార్క్ తో పాటు మ్యాక్స్ ట్రిమ్‌లో 141బిహెచ్‌పి,  250 ఎన్ఎమ్‌ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. EV యొక్క ప్రామాణిక వెర్షన్ ప్రస్తుతం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది.  Nexon EV Prime, Nexon EV MAX, Nexon EV ప్రైమ్ డార్క్ ఎడిషన్. తాజా  Nexon EV శ్రేణిలో ఈ వాహనం వినియోగదారులకు మరింత వైవిధ్యాన్ని కలిగించనుంది.


ఏ వాహనాలతో పోటీ అంటే?


Nexon EVకి పలు ప్రత్యర్థి వాహనాలతో పోటీ పడనుంది. ముఖ్యంగా   MG ZS EV, హ్యుందాయ్ కోనాకు పోటీగా ఉండనుంది. 


దేశీ మార్కెట్లో సత్తా చాటినటాటా నెక్సాన్ EV


అటు Tigor EVని అందుబాటులోకి వచ్చిన తర్వాత  కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన టాటా నెక్సాన్ ఈవీని టాటా మోటార్స్ విడుదల చేసింది. పుణెలోని కంపెనీ ప్లాంట్ లో ఈ మోడల్ తయారవుతోంది. ఈ కారు విడుదలైన 6 నెలల్లోనే నెక్సాన్ EV 1000 యూనిట్లు అమ్ముడైంది.  భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ కు ఈ కారు ఓ కారణం అయ్యింది.  టాటా మోటార్స్ అమ్మిన మొత్తం ఈవీలలో 62 శాతం వాటా నెక్సాన్ ఈవీ ఆక్రమించడం విశేషం. ఈ మోడల్ మార్కెట్లో  మంచి ఆదరణ దక్కించుకుంది. ఆయా మోడల్‌ను బట్టి  టాటా నెక్సాన్ ఈవీ ధరలు రూ.13.99 లక్షల నుంచి రూ.15.99 వరకు ఉన్నాయి. ఈ కారుకున్న క్రేజ్ నేపథ్యంలో తాజాగా టాటా నెక్సాన్ EV జెట్ ఎడిషన్ ను కంపెనీ విడుదల చేసింది.