భారత్‌లో నమ్మదగిన బ్రాండ్లలో టాటా మోటార్స్ ఒకటి. టాటా మోటార్లు వెహికల్స్ అధిక సంఖ్యలో అమ్ముడవుతుంటాయి. ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా కార్లకు ఉన్న క్రేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.  ఇప్పుడు టాటా కార్లలో ఈవీలకు సైతం డిమాండ్ పెరుగుతోంది. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సురక్షితమైన, బలమైన మరియు అనేక ఫీచర్లతో కూడిన కాంపాక్ట్ SUV కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు, టాటా నెట్సన్ పేరు అందరికంటే ముందే వస్తుంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఈ కారు తన సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాల్లో ఒకటిగా నిలిచింది. చాలా మంది ఈ కారు కొనాలన్నా, ధర విషయంలో తగ్గేవారు. కానీ ఒకేసారి పూర్తి క్యాష్ పేమెంట్ చేయకున్నా డౌన్ పేమెంట్ చెల్లించి తీసుకుని, ప్రతినెలా EMI చెల్లిస్తే సరిపోతుంది. 

Continues below advertisement

మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో లేదా రాబోయే రోజుల్లో మీ మొదటి SUVగా టాటా నెక్సాన్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా.. మీరు మొదటగా రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేయడం ద్వారా ఈ SUVని మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆ తర్వాత మీరు బ్యాంక్ నుండి ఎంత లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి నెలా మీ జేబుపై ఎంత ఈఎమ్‌ఐ భారం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

బేస్ వేరియంట్ ధర

Continues below advertisement

టాటా నెక్సాన్‌లో అత్యంత ప్రారంభ వేరియంట్ అంటే బేస్ వేరియంట్‌ను స్మార్ట్ పెట్రోల్ అని పిలుస్తారు. దీని ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్ మార్కెట్‌లో దాదాపు రూ. 7.39 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఆన్ రోడ్ ధర అయితే రూ.9,09,176 గా ఉంది. అయితే మీరు ఏదైనా వాహనాన్ని షోరూమ్ నుంచి కొనుగోలు చేసినప్పుడు దానికి RTO ఛార్జీలు, రోడ్ టాక్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇతర ప్రభుత్వ పన్నులు తోడవుతాయి.

ఈ అవసరమైన ఖర్చులన్నింటినీ జోడించిన తర్వాత, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 8.28 లక్షలు అలా ఉంటుంది. వేర్వేరు రాష్ట్రాలు, నగరాలను బట్టి స్థానిక పన్నులు, ఇన్సూరెన్స్ పాలసీల ఆధారంగా ఆన్-రోడ్ ధరలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. 

7 సంవత్సరాల EMI వివరాలు

కారు ఫైనాన్సింగ్, లెక్కల గురించి చూస్తే.. మీరు టాటా నెక్సాన్ బేస్ స్మార్ట్ పెట్రోల్ మోడల్ కోసం మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్-రోడ్ ధర రూ. 8.28 లక్షలలో రూ. 2 లక్షలు తీసేస్తే మీ మొత్తం లోన్ అమౌంట్ దాదాపు రూ. 6,28,000 అవుతుంది.

మీరు ఏదైనా జాతీయ లేదా ప్రైవేట్ బ్యాంక్ నుండి 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో 7 సంవత్సరాలకి కార్ లోన్ తీసుకుంటే, మీ ప్రతి నెల ఈఎమ్‌ఐ దాదాపు రూ. 10,111 అవుతుంది. ఈ 7 సంవత్సరాలలో మీరు బ్యాంకుకు మొత్తంగా దాదాపు రూ. 2.21 లక్షల వడ్డీని చెల్లిస్తారు.

5 సంవత్సరాల EMI లెక్కలు

చాలా మంది కారు కొనుగోలుదారులు 7 సంవత్సరాల కాలానికి లోన్ తీసుకోవడానికి బదులుగా 5 ఏళ్ల కాలాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడతారు, తద్వారా కారు త్వరగా లోన్ ఫ్రీ అవుతుంది. వడ్డీ కూడా తక్కువగా చెల్లించవచ్చు. మీరు అదే 9 శాతం వడ్డీ రేటు, రూ. 6.28 లక్షల లోన్ అమౌంట్‌పై 5 సంవత్సరాల లోన్ వ్యవధిని ఎంచుకుంటే, మీ నెలవారీ ఈఎమ్‌ఐ పెరిగి దాదాపు రూ. 13,036 అవుతుంది.

అయితే 5 సంవత్సరాల కాలానికి తీసుకుంటే మీకు లభించే ఒక పెద్ద ప్రయోజనం ఏంటంటే, మీరు బ్యాంకుకు చాలా తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 5 ఏళ్లకుగానీ మీ మొత్తం వడ్డీ దాదాపు రూ. 1.54 లక్షలు అవుతుంది. 

మీరు ఈ డౌన్ పేమెంట్ ప్లాన్‌పై టాటా నెక్సాన్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంటే, ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. ముందుగా, మీ ఆర్థిక స్థితికి తగినట్లుగా లోన్ (Loan Term) వ్యవధిని ఎంచుకోండి. తద్వారా నెలవారీ ఈఎమ్‌ఐ బడ్జెట్ మీ రెగ్యూలర్ అవసరాలపై ప్రభావం చూపదు. మీ వడ్డీ రేటు, లోన్ అప్రూవల్ పూర్తిగా మీ సిబిల్ (CIBIL) స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.

మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే, బ్యాంకులు మీకు 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుకే కార్ లోన్ ఆఫర్ చేస్తాయి. దీనివల్ల మీ నెలవారీ EMI ఇంకా తగ్గుతుంది. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు వేర్వేరు బ్యాంకుల లోన్ స్కీమ్‌లు, ప్రాసెసింగ్ ఫీజులను ఖచ్చితంగా చెక్ చేసుకోండి.