టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాటా లాంచ్ చేసిన నెక్సాన్ ఈవీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే సక్సెస్ అయింది. ఇప్పుడు టాటా కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సిద్ధం అయింది. రానున్న ఐదు సంవత్సరాల్లో 10 ఎలక్ట్రిక్ వాహనాలను టాటా మోటార్స్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.


కొత్త ఈవీ ప్లాట్‌ఫాంలపై కార్లను టాటా రూపొందించనుంది. ఈ కార్లలో పెట్రోల్, డీజిల్ వెర్షన్లు ఉండవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లకు ఎలక్ట్రిక్ వెర్షన్లు త్వరలో లాంచ్ కానున్నాయి. అయితే భవిష్యత్తుల్లో లాంచ్ కానున్న కొన్ని కార్లను పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ కారు ప్లాట్‌ఫాంపై రూపొందించనున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు అంటే డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ టాటా తన ఎలక్ట్రిక్ కార్లకు ఉపయోగించే ప్లాట్‌ఫాంలో స్పేస్ విషయంలో ఏమాత్రం రాజీ పడటంలేదు.


ఎలక్ట్రిక్ వాహనాలకు సరైన ప్యాకేజింగ్ ఉండాలి. ఎందుకంటే ఇందులో హెవీ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు లోపల కూడా కాస్త విశాలంగా ఉండాలి. అయితే టాటా త్వరలో లాంచ్ చేయనున్న కార్లలోని ప్లాట్‌ఫాంలు నెక్సాన్, టిగోర్ తరహాలో కాకుండా పెద్ద బ్యాటరీ ప్యాక్స్‌తో ఉండనున్నాయి. అంతేకాకుండా ఎక్కువ స్పేస్, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఫీచర్లు కూడా ఉండనున్నాయి.


టాటా మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్లను ఏప్రిల్ 6వ తేదీన ప్రదర్శించనుందని తెలుస్తోంది. లేదా భవిష్యత్తులో లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన ప్రొడక్షన్ రెడీ వెర్షన్లను ప్రదర్శించనుందని వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు 2022 టాటా నెక్సాన్ ఈవీ లేదా టాటా అల్ట్రోజ్ ఈవీ లాంచ్ కానుందని తెలుస్తోంది.


నెక్సాన్ ఆధారంగా స్పోర్ట్స్ లుక్ ఉన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్ చేయాలనే టాటా వ్యూహానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత టాటా సియర్రా ప్రొడక్షన్ రెడీ వెర్షన్‌ను కూడా కంపెనీ డిస్‌ప్లే చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కాన్సెప్ట్‌ను టాటా గత ఆటో ఎక్స్‌పోలోనే ప్రదర్శించింది. దీంతోపాటు టాటా అల్ట్రోజ్ ఈవీని కూడా గత ఆటో ఎక్స్‌పోలో డిస్‌ప్లే చేసింది.


వీటిలో టాటా సియర్రా ఈవీ ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉంది కాబట్టి ఇది లాంచ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. అయితే అల్ట్రోజ్ ఈవీ మాత్రం త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ, హ్యుండాయ్, మారుతి ఇలా అన్ని కార్లూ ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించడంలో బిజీ అయ్యాయి. కాబట్టి త్వరలో ఈవీ మార్కెట్ మరింత వేడెక్కే అవకాశం ఉంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?