Tata Motors Passenger Vehicles Ltd Latest News: Tata Motors Passenger Vehicles Ltd నవరాత్రి నుండి దీపావళి వరకు 30 రోజుల పండుగ సీజన్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలను ప్రకటించి, భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన బలాన్ని నిరూపించుకుంది. ఈ ముఖ్యమైన పండుగ విండోలో కంపెనీ ఏకంగా 1 లక్షకు పైగా కార్లు , ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే పండుగ సీజన్‌తో పోలిస్తే 33% వృద్ధిని సూచిస్తుంది. ఈ అద్భుతమైన అమ్మకాల వేగానికి ముఖ్యంగా కంపెనీ ఎస్‌యూవీ లైనప్ ముందుంది, ఇందులో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లు - నెక్సాన్ (Nexon) మరియు పంచ్ (Punch) లు కీలక పాత్ర పోషించాయి. నెక్సాన్ సెప్టెంబర్ 2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది, 38,000 యూనిట్ల విక్రయాలతో గత సంవత్సరం కంటే 73% భారీ వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు, కాంపాక్ట్ ఎస్‌యూవీ పంచ్ 32,000 యూనిట్ల విక్రయాలతో 29% వృద్ధిని నమోదు చేసింది, తద్వారా పండుగ సీజన్ అమ్మకాలలో గణనీయమైన వాటాను అందించింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ రెండు మోడళ్ల తో టాటా మోటార్స్ మార్కెట్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది.
వేల సంఖ్యలో ఈవీలు.. ఈ పండుగ సీజన్‌లో కేవలం పెట్రోల్,డీజిల్ వాహనాలు మాత్రమే కాకుండా, టాటా ఎలక్ట్రిక్ వాహనాల (EV) పోర్ట్‌ఫోలియో కూడా బలమైన పనితీరును ప్రదర్శించింది. ఈ 30 రోజుల కాలంలో 10,000 కంటే ఎక్కువ ఈవీలు విక్రయించబడ్డాయి. ఇది మునుపటి పండుగ సీజన్‌తో పోలిస్తే 37% గణనీయమైన వృద్ధిని సూచిస్తుంది. టియాగో ఈవీ (Tiago EV), నెక్సాన్ ఈవీ (Nexon EV), మరియు పంచ్ ఈవీ (Punch EV) వంటి మోడల్స్ ఈ వృద్ధికి కీలకపాత్ర పోషించాయి. భారతీయ ఈవీ మార్కెట్‌లో టాటా మార్కెట్ కు పెరుగుతున్న పట్టును ఈ సంఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
చారిత్రక మైలురాయి..ఈ రికార్డు స్థాయి అమ్మకాల మైలురాయిపై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, మిస్టర్ శైలేష్ చంద్ర, మాట్లాడుతూ.. నవరాత్రి నుండి దీపావళి వరకు 30 రోజుల కాలంలో, తాము 1 లక్షకు పైగా వాహన డెలివరీలతో ఒక చారిత్రక మైలురాయిని సాధించామని పేర్కొన్నారు. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 33% బలమైన వృద్ధిని సూచిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. నెక్సాన్ (73% వృద్ధి), పంచ్ (29% వృద్ధి) తో మా ఎస్‌యూవీలు ఈ ఊపందుకుంటున్నాయని తెలిపారు. అంతేకాకుండా, 10,000 కంటే ఎక్కువ ఈవీలు విక్రయించబడటం ద్వారా ఈవీ పోర్ట్‌ఫోలియో కూడా 37% వృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. తమ పూర్తి స్థాయి కార్లు , ఎస్‌యూవీల పోర్ట్‌ఫోలియో మద్దతుతోనే ఈ పెరుగుదల సాధ్యమైందని, ఇది ఈ కీలకమైన పండుగ విండోలో తమ గ్రూపు మంచి పనితీరు కనబర్చిందని ఆయన వివరించారు. ఈ బలమైన పండుగ సీజన్ పనితీరు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని, త్వరలో రాబోయే కొత్త ఉత్పత్తుల శ్రేణిని ప్రారంభించడానికి కంపెనీ సిద్ధమవుతోందని టాటా మోటార్స్ తెలిపింది. నెక్సాన్ , పంచ్ వంటి బలమైన మోడళ్లు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అమ్మకాలను నడిపించడం మరియు ఈవీ లైనప్ గణనీయమైన ఆకర్షణను పొందడంతో, టాటా మోటార్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న , అత్యంత విశ్వసనీయమైన ఆటోమేకర్లలో ఒకటిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూనే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.