Mahindra XEV 9e Vs Tata Harrier EV: చాలా కాలం ఎదురు చూపుల తర్వాత టాటా హారియర్ EV భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎలక్ట్రిక్ SUV విభాగంలో, ఇది మహీంద్రా XUV 9eకు పోటీగా టాటా మోటార్స్ ఈ బండి రోడ్డుపైకి తెచ్చింది. ఈ పరిస్థితిలో, ఈ రెండు EVలలో ఏది కొనడం బెటర్, ఏది ఎక్కువ ప్రయోజనకరం?, వివరంగా తెలుసుకుందాం.
బడ్జెట్‌కు తగిన విలువను అందించే బండి ఏది?టాటా హారియర్ EV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.49 లక్షలు, మహీంద్రా XUVe9 ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.90 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. దీనితో పోలిస్తే టాటా హారియర్ EV 40,000 తక్కువ. ఈ కంపెనీ టాప్ వేరియంట్లు కూడా మహీంద్రా కంటే ఎక్కువ రేంజ్‌ను & పెర్ఫార్మెన్స్‌ను అందిస్తాయి. హారియర్ EV కొంచెం చవకగా & డబ్బుకు తగిన విలువను అందించగలదు.
డిజైన్ పరంగా ఏది బెస్ట్?ICE మోడల్ నుంచి ప్రేరణతో టాటా హారియర్ EV రూపొందింది. అయితే.. క్లోజ్డ్ గ్రిల్, ఏరో-ఆప్టిమైజ్డ్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ & కనెక్టెడ్ LED టెయిల్ లాంప్స్ వంటి ఆధునిక టచ్‌లు ఇచ్చారు. మహీంద్రా XUV e9 ఇన్వర్టెడ్ L-షేప్ LED టెయిల్‌లైట్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ & డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో కూడిన పవర్‌ఫుల్ కూపే-స్టైల్ SUV. దీని లుక్ మరింత యూత్‌ఫుల్‌గా & ఫూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. టాటా హారియర్‌తో పోలిస్తే XUV e9 డిజైన్ మరింత మోడ్రన్ &డెవలప్డ్ మోడల్, ఇది యువతను ఆకర్షిస్తుంది.
ఇంటీరియర్స్ & టెక్నాలజీటాటా హారియర్ EV క్యాబిన్ డ్యూయల్-టోన్ థీమ్ & 14.5-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లతో వచ్చింది & దీని ఇంటీరియర్ ప్రీమియం ఫీల్ ఇస్తుంది. మహీంద్రా XUV e9 మూడు స్క్రీన్‌లను అందిస్తుంది, అవి - డ్రైవర్ డిస్‌ప్లే, సెంటర్ ఇన్ఫోటైన్‌మెంట్ & ప్యాసింజర్ స్క్రీన్. ఇవన్నీ 12.3 అంగుళాల స్క్రీన్‌లు. పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ & మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి హై-ఎండ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. XUV e9 ఇంటీరియర్ మోర్ హై-టెక్ & లగ్జరీ అనుభవాన్ని అందిస్తుంది.
భద్రత లక్షణాలుటాటా హారియర్ EV & మహీంద్రా XUV e9 రెంటింటిలో లెవల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఆధునిక భద్రత & సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, టాటా హారియర్ EVలో ట్రాన్స్‌పరెంట్ మోడ్, బూస్ట్ మోడ్ & ఆరు టెర్రైన్ మోడ్స్ వంటి ఆఫ్-రోడింగ్ ఫీచర్లు ఉన్నాయి, కఠినమైన రోడ్లపై మెరుగ్గా పనిచేయడానికి ఇవి వీలు కల్పిస్తాయి. మహీంద్రా XUV e9లో AR ఆధారిత హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆటో పార్క్ అసిస్ట్ & 1400W హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి హై-టెక్ & ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి, ఇవి కారును సాంకేతికంగా మరింత ఉన్నతంగా నిలబెడతాయి. ఈ విధంగా చూస్తే.. హారియర్ EV ఆఫ్-రోడింగ్ ప్రియులకు అనుకూలంగా ఉంటుంది, XUV e9 ఇన్నోవేషన్ & లగ్జరీ ఫీచర్లకు ప్రాధాన్యతనిచ్చే కస్టమర్లను ఆకర్షిస్తుంది.
బ్యాటరీ & పనితీరుటాటా హారియర్ EV రెండు ఆప్షన్స్‌లో (65kWh & 75kWh బ్యాటరీ ప్యాక్) లాంచ్ అయింది, అవి వరుసగా 505 km & 627 km డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తాయి. దీని పవర్ అవుట్‌పుట్ 235 bhp నుంచి 390 bhp వరకు ఉంటుంది & ఈ SUV కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. దీని డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సెటప్ కారణంగా పెర్పార్మెన్స్ & గ్రిప్ రెండింటిలోనూ బలంగా ఉంటుంది. మహీంద్రా XUV e9 కూడా రెండు బ్యాటరీ ఎంపికలలో (59kWh & 79kWh) అందుబాటులో ఉంది, ఇది 542 & 656 km డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది. దీని పవర్ అవుట్‌పుట్ 228 bhp నుంచి 282 bhp వరకు ఉంటుంది & ఇది 6.8 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ బండికి రియర్-వీల్ డ్రైవ్ (RWD) సెటప్ ఉన్నప్పటికీ ఈ SUV ఇచ్చే లాంగ్ రేంజ్ వల్ల సుదూర ప్రయాణాలకు మంచి ఆప్షన్ అవుతుంది.