Tata Harrier EV vs Mahindra XEV 9e: భారతదేశంలో EV మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు రెండు పెద్ద కంపెనీలు టాటా, మహీంద్రా తమ ప్రీమియం ఎలక్ట్రిక్ SUVsతో పోటీ పడుతున్నాయి. టాటా హ్యారియర్ EV, మహీంద్రా XEV 9e రెండూ తమ సెగ్మెంట్‌లో అత్యుత్తమ కార్లు. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాలనుకుంటే, వాటి సైజు, పవర్, రేంజ్, ఫీచర్లను పోల్చి చూడాల్సిన అవసరం అయితే ఉంది. తద్వారా సులభంగా నిర్ణయం తీసుకోవడానికి వీలుకలుగుతుంది. అందుకే ఆ పోలికను మేం మీకు అందిస్తున్నాం.
సైజు, డిజైన్
మహీంద్రా XEV 9e టాటా హ్యారియర్ EV కంటే కొంచెం పెద్దది. XEV 9e పొడవు 4789mm, వీల్‌బేస్ 2775mm, అయితే హ్యారియర్ EV పొడవు 4598mm, వీల్‌బేస్ 2741mm. రెండూ 5-సీటర్ SUVs, కానీ XEV 9e డిజైన్ మరింత ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది, దీనిలో కూప్ స్టైల్ సిల్హౌట్, లైట్ బార్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 లేదా 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ప్రీమియం ఎలిమెంట్స్ ఉన్నాయి.
మరోవైపు, హ్యారియర్ EV దాని ICE వెర్షన్‌కు చాలా పోలి ఉంటుంది, కానీ దీనిలో కూడా లైట్ బార్, పెద్ద వీల్స్ వంటి స్పోర్టీ, ఏరోడైనమిక్ డిజైన్ ఉంది. డిజైన్ మీ వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది, XEV 9e ఫ్యూచర్ లుక్ ఇస్తుంది, అయితే హ్యారియర్ EV ఒక సాంప్రదాయ SUV అప్పీల్‌ను కలిగి ఉంటుంది.
పెర్ఫార్మెన్స్, రేంజ్
XEV 9eలో 286bhp సింగిల్ మోటార్ సెటప్ ఉంది, ఇది 59kWh, 79kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఈ సెటప్ 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే నిజ జీవితంలో దాదాపు 500 కిమీ రేంజ్ ఇస్తుంది. అయితే, హ్యారియర్ EV బ్యాటరీ స్పెసిఫికేషన్లు అధికారికంగా ప్రకటించలేదు, కానీ మీడియాల వస్తున్న వివరాల ప్రకారం దీనిలో డ్యూయల్ మోటార్, AWD (ఆల్-వీల్ డ్రైవ్) సెటప్ ఉంటుంది, ఇది 500Nm వరకు టార్క్ ఇస్తుంది. రేంజ్ విషయానికి వస్తే, హ్యారియర్ EV కూడా దాదాపు 500 కిమీ నిజ రేంజ్ ఇవ్వగలదు. అంటే పవర్ విషయంలో హ్యారియర్ EV కొంచెం ముందుంది.
టెక్నాలజీ, ఫీచర్లు
టెక్నాలజీ, ఫీచర్ల విషయంలో మహీంద్రా XEV 9e, టాటా హ్యారియర్ EV రెండూ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలతో సిద్ధమైన SUVs. ఇవి వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించడానికి ఉన్నవే. మహీంద్రా XEV 9eలో ప్యాటర్న్ లైటింగ్‌తో పనోరామిక్ సన్‌రూఫ్, డాల్బీ అట్మాస్‌తో అమర్చిన 16-స్పీకర్ హర్మన్ కార్డ్ ఆడియో సిస్టమ్, హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, రిమోట్ పార్కింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు, టాటా హ్యారియర్ EVలో కూడా ఇదే స్థాయి టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది, దీనిలో రిమోట్ డ్రైవ్ (సమ్మన్ మోడ్), ADAS లెవెల్-2, పనోరామిక్ సన్‌రూఫ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటి సౌకర్యాలు ఉండవచ్చు.
ఇప్పుడు ధర గురించి మాట్లాడుకుంటే, మహీంద్రా XEV 9e ఎక్స్-షోరూమ్ ధర 21.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాని టాప్ వేరియంట్ ధర 31.25 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు, టాటా హ్యారియర్ EV ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ దాని ప్రారంభ ధర 22 లక్షల చుట్టూ ఉంటుందని, టాప్ వేరియంట్ ధర దాదాపు 30 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.