Tata Curvv EV Price and Features | ఆటోమొబైల్స్ రంగంలో తనకంటూ ప్రత్యేకత, గుర్తింపుతో దూసుకెళ్తోంది టాటా మోటార్స్. ఈ సంస్థ వినియోగదారులకు ఫేమస్ Curvv EV కూపే ఎలక్ట్రిక్ SUV పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. టాటా మోటార్స్ కంపెనీ ఆగస్టు నెలలో కర్వ్ ఎలక్ట్రిక్ కొనుగోలు చేసిన వారికి రూ. 1 లక్ష 40 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ సైతం ఉన్నాయని తెలిపింది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. డిస్కౌంట్స్ సంబంధించి మరింత సమాచారం కోసం, కస్టమర్లు తమ దగ్గరలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ఈ ఆఫర్‌లు లొకేషన్, వేరియంట్‌ను బట్టి సైతం మారతాయి. 

Tata Curvv EV ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 17.49 లక్షలుగా నిర్ణయించారు. అయితే టాప్ మోడల్ ధర రూ. 22.24 లక్షల వరకు ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది. కర్వ్ EV కారు ఇంటీరియర్ అత్యాధునిక సాంకేతికతతో పాటు ప్రీమియం కంఫర్ట్ ఫీచర్లతో వస్తోంది.  ఈ ఎలక్ట్రిక్ SUVలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది కారు డ్రైవింగ్ సమయంలో స్మార్ట్, ఇంట్యూటివ్ ఫీల్ ఇస్తుంది. 

Tata Curvv EVలో భద్రతా సౌకర్యాలు

ఈ ఎస్‌యూవీ సేఫ్టీ విషయానికి వస్తే, Tata Curvv EVలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. రియర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీల్లో చూసేలా కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవెల్-2 ADAS వంటి హై ఎండ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ ఈ కారును సేఫ్టీతో పాటు కంఫర్ట్ విషయంలోనూ బెస్ట్ అని నిరూపిస్తాయి.

 డ్రైవింగ్ రేంజ్ 600 కి.మీ వరకు

Tata Curvv EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ప్రారంభించారు. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాటి లిమిట్ ఎంచుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఫస్ట్ ఛాయిస్ 45 kWh బ్యాటరీ ప్యాక్, ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 502 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంది.

అదే విధంగా పెద్ద 55 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ అయితే సింగిల్ ఛార్జింగ్ తో 585 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తోంది. ఈ సుదీర్ఘ దూర ప్రయాణ సౌకర్యం గమనిస్తే.. లాంగ్ డ్రైవ్‌లకు ఈ ఎలక్ట్రిక్ SUV బెస్ట్ అనినిపిస్తుంది. పదేపదే ఛార్జింగ్ గురించి ఆందోళన అవసరం లేదు. ఇలాంటి బెస్ట్ బ్యాటరీ ఎంపికతో పాటు, Tata Curvv EV 5 పలు అట్రాక్టివ్ రంగులలో మార్కెట్లో అందుబాటులో ఉంది.