Suzuki e Access Price And Features: భారత ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన మార్కెట్లోకి సుజుకి అధికారికంగా అడుగు పెట్టింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సుజుకి తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ Suzuki e-Access ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. కంపెనీ ఈ స్కూటర్‌ను ₹1.88 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో లాంచ్‌ చేసింది. బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. డెలివరీలు త్వరలోనే మొదలవుతాయని సుజుకి ప్రకటించింది.

Continues below advertisement

కొత్త కలర్‌ ఆప్షన్‌తో మరింత ఆకర్షణ

e-Access లాంచ్‌తో పాటు సుజుకి ఒక కొత్త డ్యూయల్‌ టోన్‌ కలర్‌ను పరిచయం చేసింది. మ్యాట్‌ బ్లూ విత్‌ గ్రే కలర్‌ ఆప్షన్‌ రావడంతో మొత్తం కలర్‌ ఆప్షన్లు నాలుగుకు చేరాయి. యువతను ఆకట్టుకునేలా ఈ కొత్త కలర్‌ను డిజైన్‌ చేశారు.

Continues below advertisement

LFP బ్యాటరీతో సుజుకి ప్రత్యేకత

ఈ స్కూటర్‌ సుజుకి రూపొందించిన Suzuki e-Technology ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇందులో 3kWh లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ (LFP) బ్యాటరీ ఉంది. సాధారణంగా ఉపయోగించే NMC బ్యాటరీలతో పోలిస్తే, LFP బ్యాటరీకి ఎక్కువ ఆయుష్షు ఉంటుందని సుజుకి చెబుతోంది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ బ్యాటరీకి 95 కి.మీ. IDC రేంజ్‌ ఉంది. అంటే, ఫుల్‌ ఛార్జ్‌తో సిటీ మొత్తం చుట్టి రావచ్చు.

ఈ బ్యాటరీని నీటిలో ముంచడం, ఉష్ణోగ్రత మార్పులు, వైబ్రేషన్‌, డ్రాప్‌ టెస్టులు వంటి కఠిన పరీక్షలు చేశారు. అన్ని పరీక్షల తర్వాత మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇది, మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు అనే నమ్మకాన్ని ఇస్తోంది.

మోటార్‌, రైడింగ్‌ మోడ్‌లు

e-Access‌లో 4.1kW స్వింగ్‌ఆర్మ్‌ మౌంటెడ్‌ మోటార్‌ ఉంది. ఇది 15Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలకు సరిపోయేలా మూడు రైడింగ్‌ మోడ్‌లు ఇచ్చారు, అవి: Eco, Ride A, Ride B.

రెజెనరేటివ్‌ బ్రేకింగ్‌, రివర్స్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. బ్యాటరీ ఛార్జ్‌ తక్కువగా ఉన్నా థ్రాటిల్‌ రెస్పాన్స్‌ ఒకేలా ఉంటుందని సుజుకి చెబుతోంది. అంటే, ఛార్జింగ్‌ తక్కువున్నా పంచ్‌ తగ్గదు.

ఫ్రేమ్‌, డ్రైవ్‌ సిస్టమ్‌

లైట్‌వెయిట్‌ ఫ్రేమ్‌తో పాటు అల్యూమినియం బ్యాటరీ కేస్‌ను స్ట్రక్చర్‌లో భాగంగా చేశారు. దీని వల్ల స్థిరత్వం, రైడ్‌ క్వాలిటీ మెరుగవుతాయని కంపెనీ వెల్లడించింది. ఇందులో ఉన్న 'బెల్ట్‌ ఫైనల్‌ డ్రైవ్‌'. మెయింటెనెన్స్‌ అవసరం లేకుండా 70,000 కి.మీ. లేదా 7 సంవత్సరాలు పనిచేస్తుందని సుజుకి చెబుతోంది.

ఛార్జింగ్‌, డీలర్‌ నెట్‌వర్క్‌

భారతదేశవ్యాప్తంగా ఉన్న 1,200కి పైగా సుజుకి డీలర్‌షిప్‌ల్లో e-Access‌ను విక్రయిస్తారు. ప్రస్తుతం 240కి పైగా డీలర్‌షిప్‌లలో DC ఫాస్ట్‌ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. పోర్టబుల్‌ AC ఛార్జర్‌ను అన్ని డీలర్‌షిప్‌లలో ఇస్తున్నారు.

ధర, పోటీ

Suzuki e-Access ధర ₹1.88 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ). ఈ ధర వద్ద ఇది Simple One Gen 2, Ather 450 Apex, TVS iQube 5.3kWh వంటి స్కూటర్లతో పోటీ పడుతుంది. ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, LFP బ్యాటరీ, బ్రాండ్‌ విలువ కారణంగా ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది.

అదనపు ఆఫర్లు

సుజుకి ఈ స్కూటర్‌పై 7 సంవత్సరాలు / 80,000 కి.మీ. ఎక్స్‌టెండెడ్‌ వారంటీని అదనపు ఖర్చు లేకుండా ఇస్తోంది. అలాగే 3 సంవత్సరాలకు 60 శాతం బైబ్యాక్‌ అస్యూరెన్స్‌ కూడా అందిస్తోంది. డెలివరీలు మొదలైన తర్వాత Flipkart‌లో కూడా ఈ స్కూటర్‌ అందుబాటులోకి రానుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.