Suzuki Access 125 Diwali Offer 2025: సుజుకీ యాక్సెస్‌ 125, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్‌ స్కూటర్‌. కాలేజీ కుర్రాళ్లు, ఆఫీస్‌ రైడర్లు, రిటైర్మెంట్‌ దగ్గరలో ఉన్న ఉద్యోగులు.. అందరికీ నచ్చిన టూవీలర్‌ ఇది. మీరు ఈ దీపావళికి  సుజుకి యాక్సెస్ 125 కొనాలనుకుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే కొనేయండి. ఇప్పుడు, ఈ యంగ్‌స్టర్స్‌ స్కూటర్‌ దాదాపు ₹8,500 చౌకగా వస్తోంది. GST తగ్గించకముందు, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో దాదాపు ₹89,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉన్న దీని బేస్ వేరియంట్ ఇప్పుడు ₹79,386 కి తగ్గింది. అంటే, ఈ దీపావళికి ఈ స్కూటర్‌పై మీకు ₹8,500 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతోపాటు, కొన్ని షోరూమ్‌లు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించాయి.

కేంద్ర ప్రభుత్వం, 22 సెప్టెంబర్ 2025 నుంచి, 350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలపై GST ని 28% నుంచి 18% కి తగ్గించింది. దీని ఫలితంగా యాక్సెస్ 125 సహా అన్ని స్కూటర్లు, బైకుల ధరలు తగ్గాయి.

స్కూటర్ ఇంజిన్ & మైలేజ్సుజుకి యాక్సెస్ 125... 124cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ - సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 8.42 PS శక్తిని & 10.2 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్ OBD - 2B కి అనుగుణంగా ఉంటుంది. గేర్‌ లెస్‌ కారణంగా ఈ స్కూటర్‌ను సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపవచ్చు. దీని ARAI- రేటెడ్ ఇంధన సామర్థ్యం లీటరుకు 45 km. దీనికి భిన్నంగా, వాస్తవ పరిస్థితులలో ఈ స్కూటర్ 50 నుంచి 55 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ బండికి ఉన్న 5.3 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో లాంగ్ రైడ్‌లకు తగినంత ఇంధనాన్ని నింపుకోవచ్చు. మృదువైన పనితీరు & అద్భుతమైన ఇంధన సామర్థ్యం కారణంగా యాక్సెస్ 125 ఫ్యామిలీకి ఇష్టమైన స్కూటర్‌గా మార్చాయి.

స్కూటర్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?సుజుకి యాక్సెస్ 125 లో మోడ్రన్‌ & ప్రాక్టికల్‌ ఫీచర్లు ఉన్నాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) & స్పీడోమీటర్, ట్రిప్‌మీటర్, ఓడోమీటర్ & క్లాక్ వంటి సమాచారాన్ని ప్రదర్శించే డిజిటల్ LCD కన్సోల్‌ ఉంది. హయ్యర్‌ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ & నావిగేషన్, కాల్ అలర్ట్స్‌ & సర్వీస్ రిమైండర్‌ల సమాచారాన్ని అందించే TFT డిస్‌ప్లే కూడా ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్‌లో పెట్రోల్‌ పోయించడానికి ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ క్యాప్‌ ఇచ్చారు, ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా.. USB ఛార్జర్, LED టెయిల్‌లైట్ & DRLs కూడా ఉన్నాయి.

యాక్సెస్‌ పోటీ స్కూటర్లుసుజుకి యాక్సెస్ 125 కి పోటీగా - హోండా యాక్టివా 125 & టీవీఎస్ జూపిటర్ 125 మార్కెట్‌లో ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత హోండా యాక్టివా 125 ధర ₹7,831 తగ్గింది, టీవీఎస్ జూపిటర్ 125 ₹6,795 చౌకగా ఉంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125, హీరో డెస్టిని 125, హోండా యాక్టివా 6G & యమహా ఫాసినో 125 కూడా ఈ విభాగంలో ఉన్నాయి.