Summer Road Trip Guide News: ఇండియాలో వేసవి కాలం మొదలైందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి. ఈ సెలవుల్లో చాలామంది ఫ్యామిలీతో కలిసి రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే, హైవేపైకి వెళ్ళే ముందు మీ కారును ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నడిరోడ్డుపై ఇంజన్ ఆగిపోయి, ఎండలో గంటల తరబడి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కేవలం 10 నుండి 15 నిమిషాల సమయం కేటాయించి కింద చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం ఎంతో హ్యాపీగా సాగుతుంది.

Continues below advertisement

కూలెంట్ - ఇంజన్ ఆయిల్ చెకప్..ఎండల వల్ల ఇంజన్ త్వరగా వేడెక్కుతుంది. అందుకే అన్నిటికంటే ముందు కూలెంట్ లెవల్ చెక్ చేయండి. కూలెంట్ తక్కువగా ఉంటే నిమిషాల వ్యవధిలోనే ఇంజన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కూలెంట్ బాటిల్ మీద ఉండే మినిమం, మాక్సిమం మార్కుల మధ్య ద్రవం ఉండేలా చూసుకోండి. ఒకవేళ తక్కువగా ఉంటే వెంటనే టాప్-అప్ చేయండి. అలాగే ఇంజన్ ఆయిల్ కూడా తనిఖీ చేయండి. ఆయిల్ పాతదైనా లేదా తక్కువగా ఉన్నా ఇంజన్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. సర్వీసింగ్ టైమ్ దగ్గరపడితే అస్సలు ఆలస్యం చేయకండని నిపుణుల సూచిస్తున్నారు.

టైర్లు - బ్యాటరీ కండిషన్..వేసవిలో టైర్ల విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి వల్ల టైర్లలో ఉండే గాలి వ్యాకోచిస్తుంది. అందుకే గాలి ఎక్కువగా ఉంటే టైర్లు పేలిపోయే రిస్క్ ఉంటుంది. కంపెనీ సూచించిన మేరకే ఎయిర్ ప్రెజర్ మెయింటైన్ చేయండి. టైర్లపై ఏవైనా కట్స్ లేదా అరిగిపోయిన గుర్తులు ఉంటే లాంగ్ జర్నీకి ముందే మార్చడం ఉత్తమం. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఎండ వేడి బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. కారు స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటే ఒకసారి మెకానిక్‌తో చెక్ చేయించుకోండి. దారి మధ్యలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో బ్యాటరీ మొరాయిస్తే చాలా కష్టమవుతుంది అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 

Continues below advertisement

ఏసీ - బ్రేక్స్ ప్రాధాన్యత..ఈ ఎండల్లో ఏసీ సరిగ్గా పని చేయకపోతే ప్రయాణం నరకంలా మారుతుంది. ఏసీ కూలింగ్ తక్కువగా ఉన్నా లేదా ఏవైనా శబ్దాలు వస్తున్నా ముందే రిపేర్ చేయించుకోండి. క్యాబిన్ చల్లగా ఉంటేనే డ్రైవర్ అలసట చెందకుండా ప్రయాణం కొనసాగించగలరు. వీటితో పాటు బ్రేక్స్ కూడా చాలా ముఖ్యం. బ్రేక్ పెడల్ నొక్కినప్పుడు ఏవైనా వింత శబ్దాలు వస్తున్నాయేమో గమనించండి. బ్రేక్స్ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కారులో ఉంచుకోవాల్సిన వస్తువులు..ప్రయాణంలో మీతో పాటు కొన్ని అత్యవసర వస్తువులు ఉంచుకోండి. తాగడానికి నీళ్ల బాటిళ్లు, ఫోన్ ఛార్జర్, కొన్ని స్నాక్స్, బేసిక్ టూల్ కిట్ వెంట ఉంచుకోవడం మంచిది. కారు డాక్యుమెంట్లను కూడా అందుబాటులో ఉంచుకోండి.  అప్‌డేటెడ్ కార్లలో సేఫ్టీ ఫీచర్లు బాగున్నప్పటికీ, మనం తీసుకునే ఈ కనీస జాగ్రత్తలు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తాయి. ఈ చిన్నపాటి ప్రిపరేషన్ మీ ట్రిప్‌ను చిరస్మరణీయం చేస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.