Tollywood Celebrities Luxury Cars: సినిమా స్క్రీన్‌పై హీరోలు చేసే పాత్రలు ఎంత స్టైలిష్‌గా ఉంటాయో, స్క్రీన్‌ బయట వారు డ్రైవ్‌ చేసే కార్లు కూడా అంతే స్టైలిష్‌గా ఉంటాయి. దక్షిణాది సినీ పరిశ్రమలోని టాప్‌ స్టార్‌ల గ్యారేజీల్లో ఉన్న లగ్జరీ కార్లు చూస్తే, ఒక్కో కార్‌ వెనుక ఒక్కో వ్యక్తిత్వం కనిపిస్తుంది. వేగాన్ని ఇష్టపడే హీరోలు సూపర్‌ కార్లను ఎంచుకుంటే, కంఫర్ట్‌కి ప్రాధాన్యం ఇచ్చే వాళ్లు అల్ట్రా లగ్జరీ SUVలను ఎంచుకుంటున్నారు.

Continues below advertisement

స్పోర్ట్స్‌ కార్లతో రేస్‌ మూడ్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ - లాంబోర్గినీ ఉరస్‌ గ్రాఫైట్‌ క్యాప్సూల్‌ఎనర్జీ, పవర్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌... ఇవన్నీ కలిసిన వ్యక్తిత్వం జూనియర్‌ ఎన్టీఆర్‌ది. అదే స్టైల్‌ను ప్రతిబింబించేలా ఆయన ఎంచుకున్న లాంబోర్గినీ ఉరస్‌ గ్రాఫైట్‌ క్యాప్సూల్‌తో... భారతదేశంలో ఈ కారును తొలిసారిగా తీసుకున్న సెలబ్రిటీగా ఆయన నిలిచారు. అగ్రెసివ్‌ డిజైన్‌, శక్తిమంతమైన ఇంజిన్‌, స్పోర్టీ డ్రైవింగ్‌ ఫీల్‌ ఈ కార్‌ ప్రత్యేకతలు.

Continues below advertisement

నాగ చైతన్య - ఫెరారీ 488 GTBనాగ చైతన్య వ్యక్తిత్వంలానే ఆయన ఫెరారీ కూడా సైలెంట్‌గా ఆకట్టుకుంటుంది. ఎక్కువ హంగామా లేకుండా క్లాస్‌ను చూపించే ఈ సూపర్‌ కార్‌, పెర్ఫార్మెన్స్‌తో పాటు ఎలిగెన్స్‌కు ప్రతీకగా నిలుస్తుంది.

సమంత రూత్‌ ప్రభు - పోర్షే కేమన్‌ GTSసమంతకు నచ్చే పాత్రలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో, ఆమె డ్రైవ్‌ చేసే పోర్షే కేమన్‌ GTS కూడా అంతే పవర్‌ఫుల్‌. సెవెన్‌ స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ గేర్‌బాక్స్‌, స్పోర్టీ హ్యాండ్లింగ్‌ ఈ కార్‌ను నిజమైన డ్రైవర్‌ కార్‌గా నిలబెడతాయి.

లగ్జరీ కార్లలో రాజసం

రామ్‌ చరణ్‌ -  రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్‌రామ్‌ చరణ్‌ గ్యారేజ్‌ అంటే లగ్జరీకి మరో పేరు. ఫెరారీ పోర్టోఫినో, ఆస్టన్‌ మార్టిన్‌, మెర్సిడెస్‌ మేబాక్‌ GLS 600 వంటి కార్లు ఉన్నప్పటికీ, అసలు ఆకర్షణ రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్‌. పూర్తిగా ఎలక్ట్రిక్‌గా వచ్చిన ఈ కూపే సుమారు ₹7.5 కోట్ల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) విలువతో, రాయల్‌ లుక్‌, ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీని కలిపిన కార్‌గా నిలుస్తుంది.

అట్లీ - BMW i7సినిమాల్లో మాస్‌ ఎలిమెంట్స్‌ చూపించే అట్లీ, నిజ జీవితంలో మాత్రం సొఫిస్టికేటెడ్‌ లగ్జరీని ఎంచుకున్నాడు. BMW i7లో ఉన్న 31.3 అంగుళాల 8K థియేటర్‌ స్క్రీన్‌ ఈ కార్‌ను ఒక మూవింగ్‌ సినిమా హాల్‌లా మార్చేస్తుంది.

నయనతార - మెర్సిడెస్‌ బెంజ్‌ మేబాక్‌ GLSలేడీ సూపర్‌స్టార్‌కి తగ్గ కార్‌ ఇదే. భర్త విఘ్నేశ్‌ శివన్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన మేబాక్‌ GLS, అల్ట్రా లగ్జరీ SUVగా నయనతార స్టైల్‌ను పర్ఫెక్ట్‌గా చూపిస్తుంది.

మోహన్‌లాల్‌ - టయోటా వెల్‌ఫైర్‌హంగామా కన్నా కంఫర్ట్‌ ముఖ్యం అనుకునే మోహన్‌లాల్‌, వెల్‌ఫైర్‌ను ఎంచుకున్నారు. రిక్లైనింగ్‌ సీట్లు, మసాజ్‌ ఫంక్షన్‌, నిశ్శబ్దమైన డ్రైవ్‌ ఈ కార్‌ ప్రత్యేకతలు.

యష్‌ - రేంజ్‌ రోవర్‌ ఇవోక్‌రఫ్‌ అండ్‌ టఫ్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా యష్‌ ఎంచుకున్నది రేంజ్‌ రోవర్‌ ఇవోక్‌. SUV తరహాలో ఉండే లుక్‌, ఆఫ్‌రోడ్‌ సామర్థ్యం, కాంపాక్ట్‌ సైజ్‌లో లగ్జరీ ఫీల్‌ ఈ కార్‌ ప్లస్‌ పాయింట్స్‌.

మొత్తానికి, దక్షిణాది స్టార్‌లు డ్రైవ్‌ చేసే కార్లు కేవలం వాహనాలు కాదు... వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే నాలుగు చక్రాల ప్రతిరూపాలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.