CAFE 3 Norms India: భారత ప్రభుత్వం ప్రతిపాదించిన CAFE 3 (Corporate Average Fuel Efficiency) నార్మ్స్‌ అమల్లోకి వస్తే, దేశంలో అమ్ముడయ్యే చిన్న పెట్రోల్‌ కార్లకు పెద్ద ప్రయోజనం దక్కబోతుందని ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ చెబుతోంది. ముఖ్యంగా 4 మీటర్లలోపు పొడవు, 1200cc వరకు ఇంజిన్‌, 909kg లోపు కర్బ్‌ వెయిట్‌ కలిగిన కార్లకు అదనపు CO₂ రిలాక్సేషన్‌ ఇవ్వనున్నట్లు డ్రాఫ్ట్‌ నిబంధనలు చెబుతున్నాయి. అంటే ప్రతి కారుపై 3g CO₂/km వరకు తగ్గింపు & గరిష్టంగా 9g CO₂/km వరకు కారు కంపెనీలు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

Continues below advertisement

ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ఎక్కువ ప్రయోజనం పొందేది చిన్న పెట్రోల్‌ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌. మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాలు ఎక్కువగా ఉన్న మారుతి & రెనాల్ట్‌ చిన్న కార్లు ఈ జాబితాలో ఉన్నాయి.

కొత్త CAFE 3 నార్మ్స్‌ వల్ల లాభం పొందబోతున్న 6 ముఖ్య కార్ల వివరాలు:

Continues below advertisement

Maruti Suzuki S-Presso

పొడవు: 3.56 మీటర్లుఇంజిన్‌: 998ccకర్బ్‌ వెయిట్‌: 736–775kg

దేశంలో అత్యంత అందుబాటు ధర కార్లలో ఒకటైన S-Presso, కొత్త ఉద్గార నిబంధనల వల్ల నేరుగా లాభం పొందబోతుంది. 3,565mm పొడవు, తక్కువ బరువు, 1 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో ఇది పూర్తిగా ప్రమాణాలకు సరిపోతుంది. ప్రస్తుతం ఇది రూ.3.50 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు లభిస్తుంది.

Maruti Suzuki Alto K10

పొడవు: 3.53 మీటర్లుఇంజిన్‌: 998ccకర్బ్‌ వెయిట్‌: 730–754kg

Alto K10 ఈ లిస్ట్‌లో అతి తక్కువ బరువు కలిగిన కారు. 1 లీటర్‌ ఇంజిన్‌, చిన్న సైజుతో ఇది CAFE 3 రిలాక్సేషన్‌కు పూర్తి అర్హత సాధిస్తుంది. ఇది రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు లభిస్తుంది.

Renault Kwid

పొడవు: 3.73 మీటర్లుఇంజిన్‌: 999ccకర్బ్‌ వెయిట్‌: 732–782kg

లిస్ట్‌లో ఉన్న ఏకైక నాన్‌-మారుతి కారు క్విడ్‌. 69hp పెట్రోల్‌ ఇంజిన్‌, తక్కువ బరువుతో ఈ కారుకూ CAFE 3 ప్రత్యేక సడలింపులు వర్తిస్తాయి. ధర రూ.4.30 లక్షల నుంచి రూ.5.99 లక్షల మధ్య ఉంటుంది.

Maruti Suzuki Celerio

పొడవు: 3.69 మీటర్లుఇంజిన్‌: 998ccకర్బ్‌ వెయిట్‌: 810–835kg

దేశంలో అత్యధిక మైలేజ్‌ ఇచ్చే కార్లలో ఒకటైన Celerio కూడా ఈ నార్మ్స్‌ వల్ల లాభపడుతుంది. 26kpl మైలేజ్‌ క్లెయిమ్‌ చేసే ఈ మోడల్‌ రూ.4.70–6.73 లక్షల రేంజ్‌లో లభిస్తుంది.

Maruti Suzuki Wagon R

పొడవు: 3.65 మీటర్లుఇంజిన్‌: 998cc / 1197ccకర్బ్‌ వెయిట్‌: 825–860kg

దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి Wagon R. ఈ మోడల్‌ రెండు ఇంజిన్‌ ఆప్షన్లలో వచ్చినా 1200ccలోపే ఉండడం వల్ల CAFE 3 రిలాక్సేషన్‌ కేటగిరీలోకి వస్తుంది. ఇప్పటి ధరలు రూ.4.99-6.95 లక్షలు.

Maruti Suzuki Ignis

పొడవు: 3.70 మీటర్లుఇంజిన్‌: 1197ccకర్బ్‌ వెయిట్‌: 840–865kg

Nexa ఛానల్‌ ద్వారా అమ్ముడయ్యే Ignis కూడా ఈ కొత్త నార్మ్స్‌ వల్ల లాభం పొందే అవకాశం ఉంది. 83hp ఇంజిన్‌, చిన్న సైజు, తక్కువ బరువు ఈ కారును పూర్తిగా అర్హత కలిగిన మోడల్‌గా నిలబెడుతున్నాయి. ధర రూ.5.35-7.55 లక్షల మధ్య ఉంది.

CAFE 3 నార్మ్స్‌ అమల్లోకి వస్తే భారత మార్కెట్లో అమ్ముడయ్యే చిన్న పెట్రోల్‌ కార్లకు పెద్ద ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా... మారుతి కార్లు తక్కువ బరువు, చిన్న ఇంజిన్‌ కారణంగా మరింతగా లాభపడతాయి. ఇది కస్టమర్లకు కూడా ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.